Just In
- 14 min ago
Box office: పది రోజులైనా తగ్గని క్రాక్ హవా.. మొత్తానికి మాస్టర్ పనైపోయింది
- 30 min ago
సిగరెట్ తాగుతూ బోల్డ్ మాటలు.. షాక్ ఇచ్చిన రేసుగుర్రం మదర్ పవిత్ర.. రెడ్ రెమ్యునరేషన్ ఎంత?
- 1 hr ago
దానికి రెడీ అంటూ అలీకి షాకిచ్చిన షకీలా: తెలుగు డైరెక్టర్ ఫోన్.. మోసం చేసింది ఆయనంటూ లీక్ చేసింది
- 2 hrs ago
ఆ డైరెక్టర్ రూంకి పిలిచి అక్కడ తాకాడు.. ప్రైవేట్ పార్టు చూపిస్తూ: టాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు
Don't Miss!
- News
నేడే అగ్రరాజ్యం అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ ప్రమాణ స్వీకారం
- Finance
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు: ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7000 తక్కువ
- Automobiles
స్పోర్ట్స్ కార్లా హ్యుందాయ్ ఎలాంట్రా; దీని నుంచి చూపు తిప్పుకోవటం కష్టం!
- Sports
ఆస్ట్రేలియాని వెనక్కి నెట్టిన టీమిండియా.. నెం.1లో న్యూజిలాండ్!
- Lifestyle
బుధవారం దినఫలాలు : మీన రాశి వారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రాజమౌళి లెవెల్‌లో ఎలివేషన్.. యాంకర్ సుమ అద్భుతమైన స్కెచ్ అదిరిందంతే!!
యాంకర్ సుమ బుల్లితెరపై తిరుగులేని స్టార్డంతో దూసుకుపోతూనే ఉంటుంది. దశాబ్దానికి పైగా బుల్లితెరపై మకుటం లేని మహారాణిలా సుమ రాణిస్తూనే ఉంటోంది. కొత్త కొత్త యాంకర్లు, అందాలను ఒలకబోస్తూ రెచ్చగొట్టినా కూడా సుమ స్థానంలో మాత్రం మార్పు రాలేదు. ఇప్పటికీ టాప్ ప్లేస్‌లో ఉంది.. ఇంకా ఉంటుంది కూడా. తాజాగా సుమ మరో కొత్త షోను ప్రారంభించింది. అది కూడా ఎన్నడూ లేనట్టుగా జీ తెలుగు కొత్త షోను హోస్ట్ చేయబోతోంది.

ఆ రెండు చానెల్స్‌లో...
సుమ అంటే మామూలుగా అందరికీ ఈటీవి గుర్తుకు వస్తుంది. ఆ తరువాత స్టార్ మా గుర్తుకు వస్తుంది. స్టార్ మహిళ, క్యాష్ వంటి ప్రోగ్రాంలో సుమ ఎన్నో యేళ్లుగా పలకరిస్తూనే ఉంది. ఇక స్టార్ మాలో అయితే భలే చాన్సులే అంటూ కొత్త కొత్త ఎంటర్టైన్మెంట్ షోలు చేసింది. అలా సుమ ఈ రెండు చానెల్స్‌లోనే దాదాపు కనిపించేది.

ఇప్పుడు అలా..
అయితే సుమ ఇప్పుడు బుల్లితెరపైనే కాకుండా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. సుమ చేసే ఫన్నీ వీడియాలు సోషల్ మీడియాను ఊపేస్తోన్నాయి. యూట్యూబ్‌లో సుమక్క పేరిట ప్రారంభించిన చానెల్ ఫుల్ సక్సెస్ అయింది. సుమకు యూట్యూబ్‌లోనూ భారీ ఫాలోయింగ్, రికార్డ్ స్టాయి వ్యూస్‌లతో దూసుకుపోతోంది.

ప్రస్తుతం కొత్త షో..
అయితే తాజాగా సుమ తన కొత్తషోకు సంబంధించిన ప్రోమోను వదిలింది. ఇందులో రాజమౌళి ఆర్ఆర్ఆర్ టీజర్లకు ఇచ్చినంత ఎలివేషన్ ఇచ్చారు. సుమ అలా నడిచి వస్తుంటే బ్యాక్ గ్రౌండ్‌లో యాంకర్ రవి డైలాగ్‌లు, ఆ ఎఫెక్ట్స్ చూస్తుంటే ఈ సారి పెద్ద లెవెల్‌లోనే సుమ ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్ అంటూ రాబోతోన్న కొత్త షో ప్రోమో బాగానే క్లిక్ అయింది.
ఇంటి పేరు కనకలా.. టీఆర్పీలు ఆమె వెనకాల..
ఆమె అడుగు పెడితే ఆనందమే అడుగుపెట్టినట్టుంటది.. ఆమె మైక్ పడితే సెటైర్లకు సైతం చెమట ధార కడతది.. ఆమె పంచ్‌లకు భాష కూడా బాంచన్ అయితది.. ఆమె ఇంటి పేరు కనకాల.. టీఆర్పీలన్నీ ఆమె వెనకాల.. నా అక్క.. బుల్లితెర లేడీ మెగాస్టార్..సుమ కనకాల అంటూ యాంకర్ రవి చెప్పిన డైలాగ్‌లు, సుమ ఇచ్చిన బిల్డప్ బాగానే క్లిక్ అయింది.