For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆనీ మాస్టర్ గురించి ఎవరికి తెలియని విషయాలు..300 సినిమాలు.. వయసు 26 కాదు..

  |

  బిగ్ బాస్ తెలుగు 5 మొదలైనప్పటి నుంచి కూడా షోలో కంటెస్టెంట్స్ గా వచ్చిన ప్రతి ఒక్కరికి గురించి తెలుసుకోవాలని నెటిజన్లు ఇంటర్నెట్లో బాగానే సెర్చ్ చేస్తున్నారు. అయితే గూగుల్ తల్లి కొన్ని విషయాలలో తప్పుగా సమాచారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆనీ మాస్టర్ వయస్సు విషయంలో ఇదివరకే చివరికి బిగ్ బాస్ ద్వారా ఒక క్లారిటీ వచ్చేసింది. అయినప్పటికీ ఆమె 26లోనే ఉన్నట్లు అనేక కథనాలు వెలువడుతున్నాయి. కానీ చాలామంది హౌజ్ లో ఆమెను అమ్మా అని పిలుస్తున్నారు అంటే ఆమె రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఆనీ మాస్టర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 17 ఏళ్లకు పైగానే అవుతోంది. కొరియోగ్రాఫర్ గా రెండు పదుల వయసులో కి రాగానే మొదలుపెట్టారు. ఇక దాదాపు మూడు వందల సినిమాలకు పని చేసిన అని మాస్టర్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి తెలుసుకుందాం..

  13 సంవత్సరాల వయసులో..

  13 సంవత్సరాల వయసులో..

  ఆనీ మాస్టర్ తల్లిదండ్రులు నేపాలికి చెందిన వారు అయినప్పటికీ ఆమె పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే. ఆనీ అసలు పేరు అనిత లామా. ఆమె స్కూల్ దశలోనే డ్యాన్స్ పై మక్కువను పెంచుకోని ఎన్నో స్టేజ్ షోలతో పెర్ఫామెన్స్ ఇచ్చింది. ఇక 13 సంవత్సరాల వయసులో ఆమె కొన్ని టెలివిజన్ ప్రోగ్రాంలకు కూడా వెళ్లింది. మెల్లగా కొంత వయసు పెరిగిన అనంతరం ఆమె జెమిని టీవీకి కూడా వెళ్ళింది. డ్యాన్స్ బేబీ డ్యాన్స్ లో కూడా పార్టీసిపెంట్ చేశారు.

  హాట్‌గా హాట్‌గా బాలయ్య హీరోయిన్ .. మరో ప్రస్థానంలో గ్లామరస్‌గా

  ఎక్కువగా పూరి జగన్నాథ్ సినిమాలకు

  ఎక్కువగా పూరి జగన్నాథ్ సినిమాలకు

  ఆనీ మాస్టర్ ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా కూడా వర్క్ చేశారు. అందులో మెగాస్టార్ చిరంజీవి శంకర్ దాదా MBBS సినిమాకు కూడా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా వర్క్ చేశారు. నా పేరు కాంచనమాల సినిమా నుంచి ఆమె సోలో కొరియోగ్రాఫర్ గా సరికొత్త కెరీర్ ను స్టార్ట్ చేశారు. దాదాపు 350 సినిమాలకు ఆమె కొరియోగ్రాఫర్ గా వర్క్ చేశారు. అందులో పూరి జగన్నాథ్ పైసా వసూల్, రోగ్, లోఫర్, జ్యోతి లక్ష్మి సినిమాలు కూడా ఉన్నాయి.

  పవన్ కళ్యాణ్ తో కూడా

  పవన్ కళ్యాణ్ తో కూడా

  ఆమె పవన్ కళ్యాణ్ వంటి చాలా మంది ప్రముఖ హీరోలతో కూడా వర్క్ చేశారు. పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలోని ఆనీ మాస్టర్ గురించి తెలుసుకొని పవర్ స్టార్ ఆమెకు ఓ పిల్ల సుభాన్ అల్లా సాంగ్ కొరియోగ్రఫీ చేసే అవకాశం ఇచ్చారు. ఆ తరువాత ఆనీ మీడియం రేంజ్ అలాగే చిన్న హీరోల సినిమాలకు వందల పాటలకు డ్యాన్స్ కంపోజర్ గా వర్క్ చేశారు.

  నటరాజ్ మాస్టర్ గురువుగా

  నటరాజ్ మాస్టర్ గురువుగా


  ఇక ఆనీ మాస్టర్ మళ్ళీ తన స్థాయిని పెంచుకోవాలని ఆమె ప్రయత్నం చేస్తున్నారు. సొంతంగా ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్ లో అడుగు పెట్టింది. ఇక ఆనీ మాస్టర్ మొదట గురువుగా ఉన్నటువంటి నటరాజ్ మాస్టర్ కూడా బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టెంట్ గా ఉండడం విశేషం.

  వయసు ఎంతంటే..?

  వయసు ఎంతంటే..?

  అయితే ఎక్కువగా ఆనీ మాస్టర్ వయసు గురించి అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ఆమెకు కేవలం 26 మాత్రమే అనే కామెంట్స్ ఎక్కువగానే వచ్చాయి. కానీ అందులో నిజం లేదు. ఎందుకంటే ఆమె గత 20 ఏళ్ళుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. వయసు 40 ఏళ్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. జెస్సి ఆనీ మాస్టర్ తో గొడవ పడినప్పుడు కూడా యాంకర్ రవి మధ్యలోకి వచ్చి ఆమె అనుభవం నీ వయసు అని క్లారిటీగా చెప్పాడు. ఇక కొందరు ఆమెను తల్లి సమనురాలిగా చూస్తున్నారు.

  English summary
  Anee master actual age and personal life details
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X