For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 5: లిస్ట్ లీక్ అవ్వడమే కాదు.. ఫైనల్ వరకు ఎవరు వెళతారో కూడా తెలిసిపోయింది!

  |

  ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఏ స్థాయిలో క్రేజ్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదట హిందీలో భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్న ఈ కాంట్రవర్సీ షో అసలు సౌత్ ఇండస్ట్రీలో క్లిక్కవుతుందా లేదా అనే అనుమానాలు చాలానే వచ్చాయి. ఇక ఫైనల్ గా తెలుగులో కూడా ఈ రియాల్టీ షో మొదట్లోనే భారీ స్థాయిలో అయితే క్రేజ్ అందుకుంది. ఇక నిత్యం కంటెస్టెంట్స్ విషయంలో లీక్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

  గడిచిన నాలుగు సీజన్స్ లో కూడా నిర్వాహకులు ఎంత గోప్యంగా ఉంచినప్పటికీ కంటెస్టెంట్ లిస్ట్ అయితే ఈజీగా లీకయ్యింది. ఈసారి కూడా 16 మంది హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నాడు అని అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఫైనల్ లిస్ట్ కూడా బయటకు రావడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ఏడు మంది ఫైనలిస్ట్ లను ముందే రెడీ చేసినట్లు తెలుస్తోంది.

  రేటింగ్స్ వస్తాయా లేదా?

  రేటింగ్స్ వస్తాయా లేదా?

  బిగ్ బాస్ సీజన్ వన్ మొదలైనప్పుడు అసలు రేటింగ్స్ వస్తాయా లేదా అనుమానాలు చాలానే వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ సీజన్ తో మంచి ట్రాక్ క్రియేట్ చేయడంతో ఆ తరువాత జనాల్లోకి ఈజిగానే వెళ్లింది. ఆ తరువాత నాని, నాగార్జున కూడా అదే తరహాలో కొనసాగించారు. ఈసారి కూడా నాగార్జున వస్తుండడంతో 5వ సీజన్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి బిగ్ బాస్ ప్రోమో లో అయితే బాగానే క్రేజ్ వచ్చింది.

  దాదాపు 13 మంది అయితే ఫిక్స్

  దాదాపు 13 మంది అయితే ఫిక్స్

  ఇక కంటెస్టెంట్స్ విషయంలో గత ఏడాది నిర్వాహకులు కాస్త నిరుత్సాహ పరిచినట్లు టాక్ అయితే వచ్చింది. అయినప్పటికీ షోను నడిపించిన విధానంతో మంచి రేటింగ్స్ అయితే వచ్చాయి. ఇక ఈసారి మాత్రం ఈ విషయంలో నిర్వాహకులు కాస్త భారీగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లీకైన 16 మంది కంటెస్టెంట్స్ లో దాదాపు 13 మంది అయితే ఫిక్స్ అయ్యారని సమాచారం అందుతోంది. వారిలో అందరూ కూడా క్వారంటైన్ లోకి వెళ్లినట్లు టాక్ వస్తోంది.

  స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే

  స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే

  స్టార్ మా వారు కొత్త సీజన్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించినప్పటి నుండి బిగ్ బాస్ తెలుగు 5 కంటెస్టెంట్ లిస్ట్ అయితే చర్చనీయాంశమైంది. ఇక మళ్లీ మనందరినీ ఆకట్టుకునేలా తెలుగు స్టార్ అక్కినేని నాగార్జున చిన్న తెరపైకి గ్రాండ్‌గా పునరాగమనం చేస్తున్నారు. ఈ కార్యక్రమం అధికారికంగా సెప్టెంబర్ 5 ప్రారంభం కానుందట. ఫస్ట్ ఎపిసోడ్ సెప్టెంబర్ 5న సాయంత్రం 6 గంటలకు స్టార్ మాలో ప్రారంభమవుతుందిని సమాచారం.

  కంటెస్టెంట్స్ లిస్ట్.. మొత్తం 16 మంది

  కంటెస్టెంట్స్ లిస్ట్.. మొత్తం 16 మంది

  ఇక బిగ్ బాస్ తెలుగు 5 కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జున ఫస్ట్ ఎపిసోడ్‌లో ఎప్పటిలానే డ్యాన్స్ లతో పోటీదారులను ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారని తెలుస్తోంది. బిగ్ బాస్ తెలుగు 5 లో కంటెస్టెంట్‌లుగా ఎంటర్ అయ్యే పార్టిసిపెంట్స్ తుది జాబితా ఇదేనట. యాంకర్ రవి, యాంకర్ వర్షిణి, యాంకర్ లోబో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియ, సీరియల్ నటి ఉమా దేవి, VJ సన్నీ, యూట్యూబ్ సరయు, లహరి శారీ, ప్రియాంక జబర్దస్త్, అనీ మాస్టర్, RJ కాజల్, మానస్, ఆటా సందీప్, నటరాజ్ మాస్టర్ పోటీకి సిద్ధమయ్యారని తెలుస్తోంది.

  వారం రోజులకు.. రెమ్యునరేషన్ ఎంతంటే?

  వారం రోజులకు.. రెమ్యునరేషన్ ఎంతంటే?

  ఇక ఈ పోటీలో సగం మంది కొన్ని రోజులు ఉండడానికి మాత్రమే ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే వారికి రెమ్యునరేషన్ మాత్రం గట్టిగానే ఇస్తున్నారట. ఎందుకంటే బయట రియాలిటీ షోలను ప్రోగ్రామ్లను వదులుకొని రావాలి అంటే బిగ్ బాస్ నిర్వాహకులు అంతకంటే ఎక్కువ పారితోషికం ఇస్తేనే వారికి న్యాయం చేసినట్లు.ఇక అందుకే కొంతమంది యూట్యూబ్ స్టార్ట్ కి అడిగిన దానికంటే కూడా ఎక్కువగా ఇస్తున్నాట్లు సమాచారం. బిగ్ బాస్ లో ఈ వారం రోజులు ఉన్నా కూడా పది లక్షలకు పైగా ఆదాయం దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

  Sohel Fun With House Arrest Movie Kids..నవ్వులే నవ్వులు
  ఫైనల్ కు వెళ్లేది ఏడుగురు మాత్రమే?

  ఫైనల్ కు వెళ్లేది ఏడుగురు మాత్రమే?

  ఈసారి బిగ్ బాస్ రియాలిటీ షో లో ఏడు మంది ఫైనలిస్టులను కూడా ముందుగానే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది ఫైనల్ ఎపిసోడ్ వరకు ఎలాంటి టాస్క్ లు ఇవ్వాలి అనే విషయంలో కూడా నిర్వాహకులు ఒక ప్లాన్ అయితే రెడీ చేసుకున్నారట. ఇక ఫైనల్ లిస్టులో యాంకర్ రవి, యాంకర్ వర్షిణి, యాంకర్ లోబో, VJ సన్నీ, యూట్యూబ్ సరయు, RJ కాజల్, ఆటా సందీప్ వంటి వారు షో తొలి వారం వరకు కూడా పోటీలో ఉంటారని మరొక కీలకమైన విషయం లీక్ అయింది. ఏడుగురు కూడా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ తో పాటు కాంట్రవర్సీ గొడవలతో కూడా సరికొత్త ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నట్లు సమాచారం.

  English summary
  Another interesting news leak from bigg boss 5 final list
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X