»   » జలోటాకు దిమ్మతిరిగే షాక్.. జస్లీన్‌తో బ్రేకప్.. అలా చేస్తుందా.. రాత్రంతా నిద్రపట్టలేదు!

జలోటాకు దిమ్మతిరిగే షాక్.. జస్లీన్‌తో బ్రేకప్.. అలా చేస్తుందా.. రాత్రంతా నిద్రపట్టలేదు!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హిందీ బిగ్‌బాస్ 12లోని నామినేషన్ ప్రక్రియ భజన్ కింగ్ అనూప్ జలోటా, జస్లీన్ మాతురు మధ్య చిచ్చు పెట్టింది. 63 ఏళ్ల జలోటా, 25 ఏళ్ల జస్లీన్ ఇద్దరు ప్రేమికుల జంటగా బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన నామినేషన్‌ ప్రక్రియలో తన ప్రియుడి కోసం జుట్టు కత్తిరించుకోవడానికి జస్లీన్ ససేమిరా అనడంతో జలోటా నామినేట్ అయ్యాడు. అయితే ఈ విషయంతో జలోటా మనస్తాపానికి గురైనట్టు కనిపించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..

  జస్లీన్, అనూప్ జలోటా చిచ్చు

  జస్లీన్, అనూప్ జలోటా చిచ్చు

  బిగ్‌బాస్ హౌస్‌లో జస్లీన్ మాతురు అంటే గిట్టని వ్యక్తులల్లో దీపికా కక్కర్ ఒకరు. నామినేషన్ ప్రక్రియను వాడుకొని జస్లీన్, అనూప్ జలోటా మధ్య చిచ్చుపెట్టింది. జలోటా, మాతురును దీపిక నామినేట్ చేసింది. ఒకవేళ జస్లీన్ తన బట్టలు, మేకప్ కిట్టు ఇచ్చేసి, తన జుట్టు కత్తిరించుకొంటే నామినేషన్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అని దీపిక చెప్పింది.

   జుట్టు కత్తిరించుకోలేను

  జుట్టు కత్తిరించుకోలేను

  దీపిక చేసిన ఛాలెంజ్‌ను జస్లీన్ స్వీకరించలేదు. ప్రియుడు జలోటాను నామినేషన్ నుంచి తప్పించడానికి నేను జట్టు కత్తిరించుకోలేనని చెప్పింది. అంతేకాకుండా ఆ టాస్క్‌ను చేయలేక ఇంటి సభ్యుల ముందు భోరున ఏడ్చింది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో జలోటా నామినేషన్ ముప్పును ఎదుర్కోవాల్సి వచ్చింది.

  తన గ్లామర్ పోతుందనే

  తన గ్లామర్ పోతుందనే

  జస్లీన్ జుట్టు కత్తిరించుకోకపోవడంపై దీపిక ధ్వజమెత్తింది. తన గ్లామర్‌కు ముప్పు ఏర్పడుతుందనే ఉద్దేశంతోనే జట్టు కత్తిరించుకోలేదని విమర్శించింది. తాను అనుకొన్న విధంగానే జలోటా, జస్లీన్‌ను నామినేట్ చేయడమే కాకుండా.. వారి మూడున్నర ఏళ్ల రిలేషన్‌పై దెబ్బ కొట్టింది.

  జలోటాకు జస్లీన్ షాక్

  జలోటాకు జస్లీన్ షాక్

  జస్లీన్ ఇచ్చిన షాక్‌తో జలోటా గందరగోళంలో పడిపోయాడు. ఇంటి సభ్యులతో జలోటా తన బాధను పంచుకొన్నాడు. జస్లీన్ స్వార్ధపరురాలు. ఆమెలోని అసలు రూపం బయటపడింది అని జలోటా పేర్కొన్నాడు. జస్లీన్ బిహేవియర్‌తో నాకు చాలా బాధకలిగింది. రాత్రంతా నిద్రపట్టలేదు. మా రిలేషన్ గురించే ఆలోచిస్తూ ఉన్నాను అని జలోటా తన గోడును వెల్లబోసుకొన్నారు.

  ఒక నేను ఒంటరిగానే

  ఒక నేను ఒంటరిగానే

  జస్లీన్ చేసిన నిర్వాకంతో మనస్తాపం చెందిన జలోటా తీవ్రమైన నిర్ణయాన్ని తీసుకొన్నాడు. ఇక నుంచి జోడిగా ఆడబోను. ఒంటరిగానే బిగ్‌బాస్ ఇంట్లో ఉంటాను. నా గేమ్ నేను ఆడుతాను అని జలోటా చెప్పారు. ఒక నుంచి జస్లీన్ కూడా ఒంటరిగానే ఆడాల్సిందే. ఇక నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు అని ఆయన స్పష్టం చేశారు.

  జలోటా ఎలిమినేషన్ ఖాయమా?

  జలోటా ఎలిమినేషన్ ఖాయమా?

  జలోటా, జస్లీన్ బిగ్‌బాస్ హౌస్‌లో కొనసాగుతారా? లేదా బయటపడుతారా లేదా అనే విషయం వచ్చే వారం జరిగే ఎలిమినేషన్‌ ప్రక్రియలో తేలుతుంది. అయితే బిగ్‌బాస్‌ నుంచి జలోటా త్వరలోనే బయటకు వెళ్తారనే వార్తలు మీడియాలో కనిపించాయి. అమెరికాలో జరిగే భజన కార్యక్రమంలో జలోటా పాల్గొనాల్సి ఉంది. అందుకే ఆయన ఇంటిని వీడే అవకాశం కనిపిస్తున్నది.

  English summary
  This week's nomination process brought along a major twist Bigg Boss 12. Challenge given by Dipika to Jasleen which not only got Jalota and Matharu nominated but also ended their relationship of over 3.5 years. In order to free the Bhajan maestro from the nomination challenge, Dipika had challenged Jasleen to give away all her clothes and make-up to Bigg Boss and chop-off her hair.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more