Just In
- 7 hrs ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 8 hrs ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 9 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 10 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- News
జేఈఈ మెయిన్స్ దరఖాస్తుల గడువు పొడిగింపు: ఎప్పటి వరకంటే..?
- Finance
రూ.49,000 దిగువన బంగారం ధరలు, రూ.1650 తగ్గిన వెండి
- Lifestyle
వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? ప్రతిరోజూ ఆ పసుపును ఇలా వాడండి ...
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అవినాష్ అంతవరకే.. పెళ్లి చేసుకోవడానికి రెడీ.. కాబోయే వాడు సైలెంట్ గా ఉండాల్సిందే: అరియానా గ్లోరి
బోల్డ్ గర్ల్ అంటూ బిగ్ బాస్ లోకి చాలా డిఫరెంట్ గా ఎంట్రీ ఇచ్చింది అరియానా గ్లోరి. మొదట హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు పెద్డగా అంచనాలు ఏమి లేవు. పొట్టి డ్రెస్సుల్లో హౌజ్ లో అమ్మడు ఇతర కంటెస్టెంట్స్ కి పోటీ ఇచ్చే ప్రయత్నం గట్టిగానే చేసింది. గ్లామర్ విషయంలో అరియానా ఏ మాత్రం తగ్గలేదనే చెప్పాలి. ఇక బిగ్ బాస్ సీజన్ 4తో ఒక్కసారిగా క్రేజ్ అందుకున్న ఆమె హాట్ టాపిక్ గా మారింది. పెళ్లిపై కూడా ఒక క్లారిటి ఇచ్చేసింది.

ఫైనల్స్ వరకు ఉంటుందని ఊహించలేదు
బిగ్ బాస్ సీజన్ 4 స్టార్ట్ అయినప్పుడు అరియానా గ్లోరి అనే రెగ్యులర్ టీవీ ఆడియెన్స్ కు అయితే పెద్దగా తెలియదు. కేవలం రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతోనే సోషల్ మీడియాలో కాస్త క్రేజ్ అందుకుంది అంతే. ఇక హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కూడా ఆమె చాలా ఎనర్జిటిక్ గా గేమ్ ఆడుతూ వచ్చింది. ఫైనల్స్ వరకు ఉంటుందని కూడా ఎవరు కూడా ఊహించలేదు.

అవినాష్ ఫ్రెండ్ మాత్రమే..
ఇక ఆమె బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నన్ని రోజులు కూడా అవినాష్ తో కెమిస్ట్రీ ఏ రేంజ్ లో నడిపిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. హౌజ్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అనే రేంజ్ లో రూమర్స్ వచ్చేలా వారి రిలేషన్ ని నడిపించారు. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అవినాష్ తనకు కేవలం ఒక ఫ్రెండ్ మాత్రమే అంటూ.. క్లారిటీ ఇచ్చేసింది.

ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ..
నాకు బిగ్ బాస్ ద్వారా వచ్చిన క్రేజ్ చాలు. స్టార్ హీరోయిన్ అవ్వాలని పెద్ద కోరికలు ఏమి లేవు. ఇంకా ఎన్ని రోజులు ఇలానే ఉండాలి. ఎవరైనా మంచి అబ్బాయిని చూసుకొని పెళ్లి చేసేసుకుంటా. వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవడానికి రెడీ. కానీ నాకు హౌజ్ వైఫ్ గా ఉండాలని లేదు. పెళ్లి తరువాత కూడా జాబ్ చేయాలని ఉంది. వీలైతే యాంకర్ గా అలానే కొనసాగుతాను.. అని చెప్పింది.

కాబోయే వాడు అలా ఉండకూడదు..
నాకు కాబోయే వాడు చాలా సైలెంట్ అయ్యి ఉండాలి. నేను అల్లరిగా ఉంటాను కాబట్టి వచ్చేవాడు తక్కువ మాట్లాడే వాడు అయ్యి ఉండాలి. పెళ్లి తరువాత జాబ్ చేస్తాను కాబట్టి. షూటింగ్ అయిపోయిన టారువత ఎక్కడ ఉన్నావ్? ఎప్పుడు వచ్చి పికప్ చెలుకోవాలి అనేలా ఉండాలి కానీ.. ఎప్పుడొస్తావ్ ఇంటికి.. ఇంత టైమ్ వరకు ఏం చేస్తున్నావ్.. అనేలా ఉండకూడదు అని అరియానా వివరణ ఇచ్చింది.

ఏది పడితే అది చేయను
హీరోయిన్ గా అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని చెప్పిన అరియానా తనకు ఇంతగా క్రేజ్ రావడానికి మొదటి కారణమైన రామ్ గోపాల్ వర్మ కూడా కలవమని చెప్పినట్లు తెలిపింది. అయితే ఆయన ఏ రోల్ ఇస్తే ఆ రోల్ లో చేయనని చెప్పిన ఈ బోల్డ్ గోర్ల్ వీలైనంత వరకు తనకు సెట్టయ్యే మంచి పాత్రల్లోనే నటిస్తానని తెలిపింది.