ప్రేమలో ఉన్నట్లు ఆరియానా గ్లోరీ ప్రకటన: ఈ మధ్య ఎక్కువైపోయిందంటూ.. చివర్లో ట్విస్ట్ ఇచ్చిన బ్యూటీ
కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోన్న పేర్లలో ఆరియానా గ్లోరీ ఒకటి. యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించి.. బిగ్ బాస్ షోతో ఎనలేని ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుందీ బ్యూటీ. హౌస్‌లోనే కాకుండా బయట కూడా బోల్డుగా ఉంటూ నచ్చినట్లు చేస్తూ విపరీతంగా హైలైట్ అయింది. ఈ క్రమంలోనే వరుసగా ఆఫర్లను కూడా అందుకుంటూ ముందుకు సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా తాను ప్రేమలో పడినట్లు ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేసింది ఆరియానా గ్లోరీ. దాని గురించి వివరిస్తూ చివర్లో బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

అలా వెలుగులోకి వచ్చిన ఆరియానా
యూట్యూబ్ ఛానెళ్ల యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించింది ఆరియానా గ్లోరీ. తన విధిలో భాగంగా ఎంతో మంది సినీ ప్రముఖులను ఇంటర్వ్యూలు చేసింది. ఈ క్రమంలోనే ఓ సారి రాంగోపాల్ వర్మతో చిట్ చాట్ చేసింది. ఆ సమయంలో ఇద్దరి మధ్య బోల్డుగా చర్చలు జరిగాయి. దీంతో వర్మ ఎంతో ఇంప్రెస్ అయి ఆమె గురించి ట్వీట్లు కూడా పెట్టడంతో ఆరియానా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.

బిగ్ బాస్‌లో అదుర్స్... సత్తా చాటింది
ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఆరియానా గ్లోరీ పేరు రెండు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోయింది. ఈ కారణంగానే బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే ఛాన్స్‌ను పట్టేసింది. ఆరంభంలోనే సీక్రెట్ రూమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత అదిరిపోయే ఆటతీరుతో ఆకట్టుకుంది. నిజాయితీగా ఉంటూ మంచి పేరు తెచ్చుకుని ఫినాలేలోకి సైతం అడుగు పెట్టి స్టామినాను చూపించింది.

బిగ్ బాస్ ఎఫెక్టు.. వరుస అవకాశాలు
బిగ్ బాస్ షో పుణ్యమా అని ఆరియానా లైఫ్ ఒక్కసారిగా మారిపోయింది. ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన ఆమె.. నాలుగో స్థానంలో నిలిచింది. అలాగే, క్రేజ్‌ను కూడా సొంతం చేసుకుంది. వీటితో పాటు సినిమా ఆఫర్లను కూడా దక్కించుకుంటోంది. ఇప్పటికే రాజ్ తరుణ్, కల్యాణ్ దేవ్ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ.. మరికొన్నింటిని ఓకే చేసింది. అలాగే పలు షోలు కూడా చేస్తుంది.

ఆర్జీవీతో ఇంటర్వ్యూ.. బోల్డుగా చేశారు
రాంగోపాల్ వర్మతో ఆరియానా గ్లోరీ చేసిన ఇంటర్వ్యూను ఇటీవల యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఇందులో ఎక్కువగా సెక్స్ గురించిన సంభాషణలే జరిగాయి. ఇద్దరూ పోటాపోటీగా పచ్చిగా మాట్లాడుతూ దీన్ని రక్తి కట్టించారు. దీంతో ఈ వీడియోకు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఈ వీడియోకు ఎన్నో మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దీంతో ఇది సంచలనం అయిపోయింది.

ప్రేమలో ఉన్నట్లు ఆరియానా ప్రకటన
కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆరియానా గ్లోరీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆరియానా గ్లోరీ సోషల్ మీడియా ద్వారా తాను ప్రేమలో ఉన్నట్లు వెల్లడించింది.
Recommended Video

చివర్లో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన భామ
తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆరియానా గ్లోరీ ఓ సెల్ఫీ వీడియోను స్టోరీగా పెట్టుకుంది. అందులో 'నేను ప్రస్తుతం ప్రేమలో ఉన్నా. గతంలో కంటే ఇప్పుడు మరింత ఎక్కువగా ప్రేమిస్తున్నా. మరి మీరు కూడా ఇలానే ప్రేమిస్తున్నారా' అని మాట్లాడింది. ఇంతకీ ఆమె ప్రేమిస్తున్నదే తననేనట. అవును.. నన్ను నేనే ప్రేమిస్తున్నా అంటూ చివర్లో బిగ్ ట్విస్ట్ ఇచ్చిందీ బోల్డ్ బ్యూటీ.


Click it and Unblock the Notifications











