Just In
Don't Miss!
- News
సీఎం జగన్‌ది ఎంత గొప్ప మనసో... సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బిగ్ బాస్ హౌస్‌లో ఊహించని సంఘటన: కోపంతో తనను తాను గాయపరుచుకున్న కంటెస్టెంట్
బిగ్ బాస్ నాలుగో సీజన్ చివరి దశకు చేరుకుంది. మరో రెండు వారాల్లో విజేత ఎవరో కూడా తెలిసిపోనుంది. రేసు టు ఫినాలే టాస్క్ ద్వారా అఖిల్ సార్థక్ ఇప్పటికే ఫైనల్‌లోకి అడుగు పెట్టిన మొదటి కంటెస్టెంట్‌గా నిలిచాడు. ఇక, గ్రాండ్ ఫినాలోకి ఎంటర్ అయ్యే మిగిలిన నలుగురు సభ్యులు ఎవరన్నది త్వరలోనే తేలనుంది. దీంతో హౌస్‌లోని కంటెస్టెంట్లు అందరూ సీరియస్‌గా గేమ్ ఆడేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ హౌస్‌లో ఊహించని సంఘటన జరిగింది. కోపంతో ఓ కంటెస్టెంట్ తనను తాను గాయపరచుకోవడం అంతా షాకయ్యారు. ఆ వివరాలు మీకోసం!

సరికొత్తగా షో... పెరుగుతోన్న ఆసక్తి
ఫినాలేకు సమయం దగ్గర పడడంతో బిగ్ బాస్ షోకు మరింత ఆదరణ లభిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రేటింగ్‌ను మరింతగా పెంచుకోవాలని భావిస్తోన్న నిర్వహకులు సరికొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే టాస్కుల్లో వైవిధ్యం చూపించడంతో పాటు స్నేహితుల మధ్య పుల్లలు పెడుతున్నారు. దీంతో గొడవలు జరుగుతున్నాయి. ఫలితంగా షో హైలైట్ అవుతోంది.

టాప్ -5లో ఆ కంటెస్టెంట్ ఉండాలని
ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఏడుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. వారిలో ఒకరు ఆదివారం ఎపిసోడ్‌లో ఎలిమినేట్ అయిపోతారు. సో.. ఆరుగురు మిగులుతారు. అందులో నుంచి అఖిల్ సార్థక్ ఇప్పటికే ఫినాలేకు చేరుకున్నాడు. ఇక, ఐదుగురిలో నలుగురు మాత్రమే తుది పోరుకు వెళ్తారు. ఈ జాబితాలో ఆరియానా గ్లోరీ తప్పకుండా ఉండాలని బయట చాలా మంది ప్రార్థనలు చేస్తున్నారు.

బిగ్ బాస్‌పై కోపం.. వెంటనే యూటర్న్
ఆరియానా గ్లోరీ హౌస్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచీ ఎంతో చక్కగా ఆడుతోంది. ప్రతి టాస్కులో వందకు వంద శాతం శ్రమను పెడుతూ సక్సెస్ అవుతోంది. ఈ కారణంగానే 13వ వారం వరకూ గేమ్‌లో కొనసాగుతోంది. అయితే, రేస్ టు ఫినాలే టాస్కులో తప్పు జరిగిందని బిగ్ బాస్‌నే ఎదురించి తిట్టేసిందామె. ఆ వెంటనే తప్పు తెలుసుకుని సారీ చెప్పడంతో పాటు ముద్దులిచ్చేసింది.

ఫ్రెండ్‌తో గొడవల వల్ల డిస్సాపాయింట్
బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో సోహెల్‌తో క్లోజ్‌గా ఉన్న ఆరియానా గ్లోరీ.. ఆ తర్వాత జబర్ధస్త్ కమెడియన్ ముక్కు అవినాష్‌కు దగ్గరైంది. ఈ క్రమంలోనే అతడితో ట్రాక్ నడుపుతున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో తరచూ అవినాష్ ఆమెను ఏదో ఒకటి అనడం వల్ల గొడవలు అవుతున్నాయి. దీంతో ఆమె బాగా డిస్సాపాయింట్ అవుతోంది.

బిగ్ బాస్ షోలో ఊహించని సంఘటన
శనివారం జరిగిన ఎపిసోడ్‌లో ఆరియానా గ్లోరీ ఎంతో సరదాగా కనిపించింది. అఖిల్ తనను ఫ్లట్ చేస్తున్నాడని, ఫోన్ నెంబర్ కూడా అడిగాడని చెప్పింది. ఆ తర్వాత అభిజీత్‌తో ఓ డిస్కర్షన్ జరుగుతోన్న సమయంలో ‘నన్ను నేను ఇష్టపడతా' అని చెప్పింది. దీంతో అతడు ‘అవినాష్ ఎలా ఆలోచిస్తాడు' అని అడిగాడు. ఆయనకు ఇలాంటి లాజిక్కులు అర్థం కాదు అని బదులిచ్చింది.

తనను తానే కొట్టుకున్న ఆ కంటెస్టెంట్
ఆరియానా అన్న మాటలకు అవినాష్ ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు. ‘లాజిక్కులు తెలియకపోతే నేనీ స్థాయిలో ఉండను అర్థం అవుతుందా ఆరియానా' అంటూ పదే పదే రెచ్చగొట్టాడు. దీంతో అతడిని సముదాయించలేక.. కోపం పట్టలేక తనను తాను తలపై పలుమార్లు కొట్టుకుందామె. ఈ ఊహించని సంఘటనతో అక్కడే ఉన్న కంటెస్టెంట్లతో పాటు నాగార్జున సైతం షాకయ్యాడు.