»   »  టీవీ నటిని వేధించిన కెమెరామెన్ అరెస్ట్

టీవీ నటిని వేధించిన కెమెరామెన్ అరెస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Alefia Kapadia
టీవీ నటి అలెఫియా కపాడియాను వేధించిన కేసులో ముంబైలోని షాహు నగర్ పోలీసులు కెమెరామెన్ ముత్తుస్వామి అరాసును అరెస్టు చేసారు. ఇటీవల ధారావి ప్రాంతంలో కారు డ్రైవ్ చేసుకుంటూ వెలుతున్న అలెఫియాను ముత్తుస్వామి తన కారుతో ఆమెను వెంబడించడంతో పాటు అసభ్య పదజాలంతో దూషించినట్లు, తన కారుతో ఆమె కారుకు డాష్ ఇస్తూ డ్యామేజ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

తన సెల్ ఫోన్లో అతని తనను వేధించిన వ్యక్తి ఫోటోను, అతని కారు నెంబర్ ప్లేటును చిత్రీకరించిన అలెఫియా కపాడియా....పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు....ఆమెను వేధించిన మోటారిస్టును అరెస్టు చేసారు. అరెస్టుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.

'టీవీ నటి అలెఫియా కపాడియాను వెంబడించి వేదించిన కేసులో ముత్తు స్వామి అరాసు అనే వ్యక్తిని మేం అరెస్టు చేసాం. అతడు ధారావి ప్రాంత నివాసి. ఫిల్మ్ ఇండస్ట్రీలో కెమెరామెన్‌గా పని చేస్తున్నాడు. అయితే అతను అలెఫియా ఎవరో తనకు తెలియదని చెప్పారు. వెంటనే అతన్ని కోర్టులో ప్రవేశ పెట్టాం. రూ. 9000 పూచికత్తుపై అతనికి బెయిల్ లభించింది' అని జోన్ 5 డిప్యూటీ కమీషన్ ఆఫ్ పోలీస్ థనుంజయ కులకర్ణి వెల్లడించారు. తను వేధించిన వ్యక్తిని సెల్ ఫోన్లో చిత్రకరించి ఫిర్యాదు చేసిన అలెఫియా ధైర్యాన్ని పోలీసులు అభినందించారు.

అయితే ముత్తుస్వామి వాదన మరోలా ఉంది. ఆమెను తాను వేధించలేదని స్పష్టం చేసారు. ట్రాఫిక్‌లో తన కారు సైడ్ మిర్రర్ ఆమె కారుకు రాసుకుపోయింది, వెంటనే కారు ఆపి ఆమెకు అపాలజి చెప్పానని...కానీ ఆమె నన్ను అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్‌తో తిట్టింది. నోరు అదుపులో పెట్టుకోమని అన్నాను. కొంత దూరం వెళ్లాక ఆమె నా వెంట పడి నన్ను, కారును ఫోటో తీసింది అనిముత్తు స్వామి వెల్లడించారు.

English summary
The Shahu Nagar police have arrested a cinematographer who allegedly harassed a TV actress and damaging her car in Dharavi last Saturday. The actress had clicked photos of the accused and his car's licence plate. The arrests were made with the help of these pictures.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu