»   » టీవీ 'రాముడి'కి డెంగీ ఫీవర్..

టీవీ 'రాముడి'కి డెంగీ ఫీవర్..

Posted By:
Subscribe to Filmibeat Telugu
Arun Govil
ముంబై : ముంబయిలో డెంగీ ఓ రేంజిలో విజృంభిస్తోంది. రామానంద్‌ సాగర్‌ దర్శకత్వంలో రూపొందించిన 'రామాయణం' ధారావాహికలో నటించిన 'రాముడి' పాత్రధారి అరుణ్‌ గోవిల్‌ డెంగీ బారినపడ్డారు. తీవ్ర జ్వరంతో గోవిల్‌ సోమవారం బాంబే ఆస్పత్రిలో చేరారు. ఆయనకు అక్కడి డాక్టర్ గౌతమ్ బన్సాలీ ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.

బాంబే ఆస్పత్రి వైద్యులు గౌతమ్‌ బన్సాలీ మాట్లాడుతూ.. సోమవారం 12 గంటల ప్రాంతంలో అరుణ్‌ గోవిల్‌ ఆస్పత్రిలో చేరారని, ఆయనలో ప్లేట్‌లెట్స్‌ సంఖ్య తక్కువగా ఉందని తెలిపారు. అరుణ్‌ గోవిల్‌ శరీరంలో ప్లేట్‌లెట్స్‌ సంఖ్య 1.21లక్షలు ఉన్నాయని, ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని చెప్పారు.

ఇక క్రిందటి నెలలో బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ సైతం డెంగ్యూ ఫీవర్ తో ఆస్పత్రిలో చేరాడు. గత కొన్నిరోజులు నుంచి షూటింగ్ లో బిజీగా ఉన్న రణ్ వీర్ కు ఆకస్మికంగా జ్వరం ఎక్కువ కావడంతో టెస్టుల నిమిత్తం ముంబై ఆస్పత్రి వెళ్లాడు. అతనికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అతనికి డెంగ్యూ లక్షణాలు ఉన్నట్లు డాక్టర్లు నిర్దారించారు. దీంతో అతను షూటింగ్ కు కొన్ని రోజులు విరామం ప్రకటించక తప్పలేదు.

ప్రస్తుతం అతను 'గూండే' సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్ర సన్నివేశాలను కలకత్తాకు అతి సమీపంలో ఉన్న దుర్గాపూర్ లో షూట్ చేస్తుండగా తొలుత రణ్ వీర్ కొంత అలసటకు లోనైయ్యాడు. అతనికి ఒంట్లో నలతగా ఉన్నా కూడా సినిమా నిర్మాణానికి ఆటంకం కలగ కూడదనే ఉద్దేశంతో షూటింగ్ పాల్గొంటు వస్తున్నాడు. కాగా, జ్వరం కొద్దిగా ఎక్కువ కావడంతో ముంబైలోని ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించగా డెంగ్యూ ఉన్నట్లు తేలింది. పరీక్షలు నిర్వహించిన అనంతరం అతనికి డెంగ్యూ సోకినట్లు తేలింది. దీంతో రణ్ వీర్ ఎప్పుడు తిరిగి షూటింగ్ లో పాల్గొంటాడు అనే విషయంపై సందిగ్థత నెలకొంది.

English summary
Arun Govil diagnosed with dengue fever. Arun Govil is an award-winning Indian actor, producer and director. He has acted in various Hindi, Bhojpuri, Oriya and Telugu movies. He is best known for playing Rama in Ramanand Sagar's hit television series Ramayan (1986).
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu