Don't Miss!
- News
ఆర్థిక వ్యవస్థ గుట్టుమట్లు బహిర్గతం- కీలక సర్వే: ఇంకొన్ని గంటల్లో..!!
- Sports
INDvsNZ: టీమిండియాకు సంప్రదాయ వెల్ కమ్.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ
- Finance
it news: TCS రికార్డుల మోత.. 22 కంపెనీలను వెనక్కి నెట్టి అగ్రస్థానం కైవసం
- Automobiles
ఎట్టకేలకు హైరైడర్ CNG విడుదల చేసిన టయోటా.. ధర ఎంతంటే?
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
టాటూ ఎపిసోడ్ తో హర్టయిన అషు.. నా కోసం వేయించుకున్నది ఒక్కరే అంటూ!
డబ్
స్మాష్
వీడియోలతో
పాపులర్
అయిన
అశురెడ్డి
తరువాతి
కాలంలో
మంచి
పాపులారిటీ
సంపాదించింది.
ఆ
క్రేజ్
తో
ఏకంగా
సినిమాల్లో
అవకాశం
దక్కించుకున్న
ఈ
భామ
ఆ
సినిమా
తర్వాత
సైలెంట్
అయింది.
అయితే
బిగ్
బాస్
షో
లో
ఎంట్రీ
ఇచ్చిన
ఆమె
అక్కడ
మరింత
పాపులారిటీ
దక్కించుకుంది.
అయితే
ఈ
భామ
తాజాగా
సోషల్
మీడియాలో
షేర్
చేసిన
ఒక
వీడియో
ఆసక్తికరంగా
మారింది.
ఆ
వివరాల్లోకి
వెళితే

రాహుల్ సంథింగ్ సంథింగ్
ఒకానొక సమయంలో పవన్ కళ్యాణ్ టాటూని తన ఎదపై వేయించుకొని సోషల్ మీడియాలో హల్చల్ చేసిన అషు రెడ్డి మొన్నీమధ్య బిగ్ బాస్ హౌస్ మెట్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ఎఫైర్ పెట్టుకున్నట్టు కలరింగ్ ఇస్తూ రచ్చ చేసిన్న్ది. అయితే అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఆ రూమర్స్ ని కూడా తనని తాను ప్రమోట్ చేసుకునే పనిలో పడింది. ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేసే ఈ భామ ఇప్పుడు మా టీవీలో వస్తున్నా 'కామెడీ స్టార్స్' అనే షోలో పాల్గొంటుంది.

హరితో కెమిస్ట్రీ
ఈ షోలో కమెడియన్ పటాస్ హరితో కలిసి ఏదో అఫైర్ ఉన్నట్టు కలరింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక ఈ షోలో తాజా ఎపిసోడ్ లో హరి అషు రెడ్డికి పెద్ద షాకే ఇచ్చాడు. వీరిద్దరి మధ్య ఎక్కువగా కలిసి స్కిట్ లు చేస్తుండడంతో ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందని పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఇక పుకార్లకి ఊతం ఇస్తూ హరి తన గుండెలపై అషురెడ్డి పేరుని టాటూగా వేయించుకుని, రచ్చ చేశారు.

చెంప మీద కొట్టి
ఈ స్కిట్ లో అషు వెంట ప్రేమించమని పడే వ్యక్తిలా నటించిన హరి..కొన్ని ప్రేమ డైలాగులు కొట్టి ''నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానో తెలుసా.. నువ్వు ఎప్పటికీ నా గుండెల్లో ఉండిపోయేంతలా.." అంటూ తన గుండెల మీద ఉన్న అషు అంటూ వేయించిన పచ్చ బొట్టు చూపించాడు. ఇక ఆ పచ్చ బొట్టు చూసి నిజమా అని అడిగితె నిజమే అని అంటాడు. దీంతో ఎమోషనల్ అవుతూ అషురెడ్డి హరి చెంపపై కొట్టింది.

అలా ఒక్కరే
అయితే హరి టాటూ వేయించుకోవడం చూసి షో జడ్జిలు సహా అందరూ షాకైపోయారు. అయితే అదంతా ఒట్టిదే అని తేలడంతో అందరూ చివర్లో నవ్వేస్తాడు. అయితే ఈ విషయం మీద స్పందించిన ఆషూ నా పేరు నిజమైన పచ్చబొట్టు ఉన్న వ్యక్తి ఒకరు మాత్రమే, బేషరతుగా ప్రేమించగల వ్యక్తి అమ్మ మాత్రమే అంటూ వీడియో షేర్ చేసింది. అంటే ఒకరకంగా ఈ భామ హార్ట్ అయిందని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.
Recommended Video

ప్రోమో రిలీజ్ చేసినప్పుడే
నిజానికి ఈ ప్రోమో రిలీజ్ అయినప్పటి నుంచే ట్రోలింగ్ కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇదంతా ప్రోమో కోసమే అని, షో టీఆర్పీ కోసం ఆడుతున్న డ్రామాలని నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. జబర్దస్త్ లో ప్రోమోల లాగానే ఈ ప్రోమో కూడా కట్ చేశారని రచ్చ చేశారు. అన్నట్టుగానే గాలి తీసి పారేశారు నిర్వాహకులు.