Don't Miss!
- News
స్మితా ఇంటికి ప్రమోషన్లపై చర్చించేందుకే వెళ్లా: ఆనంద్ కుమార్, రాత్రే ఎందుకంటే?
- Sports
ఒక్క మ్యాచ్ చూసి డెసిషన్ తీసుకోకూడదు.. ఇషాన్, ధవన్‌పై వెటరన్ కామెంట్స్!
- Finance
Stock Market: వచ్చే వారం మార్కెట్లు ఎలా ఉంటాయ్..? ట్రేడర్స్ గుర్తించాల్సిన విషయాలు..
- Lifestyle
Chanakya Niti: చాణక్యుడు చెప్పినట్లు ఇలా చేస్తే విజయం దాసోహం అంటుంది
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
అషు రెడ్డికి చేదు అనుభవం: ఆమె పేరు పచ్చబొట్టు వేసుకున్న కమెడియన్.. అందరి ముందే అలా చూపించడంతో!
తెలుగు అమ్మాయిలకు మన ఇండస్ట్రీల్లో పెద్దగా అవకాశాలు దక్కవన్న టాక్ ఉంది. అయితే, ఇప్పుడు సోషల్ మీడియా వల్ల ఎంతో మంది యువతులు దాన్ని బ్రేక్ చేస్తున్నారు. తమ అందచందాలతో పాటు టాలెంట్‌ను చూపించుకుంటూ ఎనలేని ఫాలోయింగ్‌ను సంపాదించుకుంటున్నారు. అదే సమయంలో అవకాశాలను సైతం అందుకుంటున్నారు. ఇలా వచ్చిన వారిలో అషు రెడ్డి ఒకరు. చాలా రోజులుగా ఇండస్ట్రీలో సందడి చేస్తోన్న ఈ బ్యూటీకి తాజాగా ఓ కమెడియన్ ఆమె పేరును టాటూ వేయించుకుని షాకిచ్చాడు. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

అలా పరిచయం.. జూనియర్ సమంతగా
అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో డబ్‌స్మాష్ వీడియోలు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. వీటి వల్లే అషు రెడ్డి ఎనలేని క్రేజ్‌ను దక్కించుకుంది. అంతేకాదు, జూనియర్ సమంతగానూ ఆమె పేరును తెచ్చుకుంది. ఆ తర్వాత యూత్ స్టార్ నితిన్ నటించిన 'ఛల్ మోహనరంగ'లో కీలక పాత్రలో కనిపించి మెప్పించింది. దాని తర్వాత బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిందామె.

కామెడీ షోలో భాగమైన బిగ్ బాస్ ఫేమ్
స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'కామెడీ స్టార్స్' ద్వారా బుల్లితెరపైనా అషు రెడ్డి బిజీ అయింది. ఇందులో హీరోయిన్ శ్రీదేవి, శేఖర్ మాస్టర్ జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో ఈ అమ్మడు తన అందచందాలను చూపించడంతో పాటు కామెడీని కూడా పంచుతూ సందడి చేస్తోంది. దీనితో పాటు యాంకర్ రవితో కలిసి 'హ్యాపీడేస్' అనే డైలీ షోతో హోస్టుగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది.

అతడికి ముద్దులు, హగ్గులు ఇవ్వడంతో
కామెడీ స్టార్స్‌లో అషు రెడ్డి ఫుల్ టైమ్ ఆర్టిస్టుగా మారిపోయింది. దీంతో ఆమె కొన్ని స్కిట్లలోనూ నటిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల ఆమె ఎక్స్‌ప్రెస్ హరితో స్కిట్ చేసింది. ఇందులో అతడికి హగ్గులు, ముద్దులు పెట్టి అక్కడున్న వారితో పాటు ప్రేక్షకులను షాక్‌కు గురి చేసింది. ఆ తర్వాత కూడా అదే కంటిన్యూ చేసింది. దీంతో వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ సాగుతోందన్న టాక్ వినిపించింది.

హరితో లవ్ ట్రాకుపై అషు రెడ్డి స్పందన
అషు రెడ్డి.. యాంకర్ రవితో కలిసి 'హ్యాపీ డేస్' అనే షో చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి ఎక్స్‌ప్రెస్ హరి స్క్రిప్టు రైటర్‌గా పని చేస్తుండగా.. ముక్కు అవినాష్ సోదరుడు అజయ్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. వీళ్లంతా కలిసి సోషల్ మీడియాలో లైవ్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరి తనకు అన్నయ్యలాంటి వాడని చెప్పి.. అతడితో ఉన్న రిలేషన్‌పై అషు రెడ్డి క్లారిటీ ఇచ్చింది.

కమెడియన్ గుండెలపై అషు రెడ్డి టాటూ
ఎక్స్‌ప్రెస్ హరి తనకు అన్న లాంటి వాడని చెబుతున్నప్పటికీ.. తరచూ అతడితో ట్రాక్ నడుపుతున్నట్లు కనిపిస్తోంది అషు రెడ్డి. ఇక, తాజాగా విడుదలైన కామెడీ స్టార్స్ ప్రోమోలో అతడు ఏకంగా ఆమెను పేరును ఛాతిపై పచ్చబొట్టుగా వేసుకున్నది చూపించారు. ఇది చెరిపితే చెరిగిపోయేది కాదు.. పర్మినెంట్ టాటూ. ఈ విషయాన్ని స్వయంగా చెప్పడంతో అషు రెడ్డి నోరెళ్లబెట్టేసింది.
Recommended Video

నిజమైన టాటూతో షాక్.. చెంప పగిలింది
స్కిట్‌లో భాగంగా అషును ప్రేమిస్తున్న కుర్రాడిగా నటించాడు హరి. ఇందులో ఆమెను ఇంప్రెస్ చేయడానికి పచ్చబొట్టును చూపించాడు. అప్పుడే ఇది రియల్ అని చెప్పాడు. దీంతో అషు దాన్ని చేతితో పరీక్షించి చూసింది. ఆ వెంటనే అతడి చెంప పగలగొట్టింది. దీని వెనుక జరిగిన కథను కూడా హరి ఈ ప్రోమోలో వివరించాడు. దీంతో వీళ్లిద్దరి వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చినట్లైంది.