»   » పవన్ అండతో జెమెనీ ఛానెల్ ని దెబ్బ కొట్టింది

పవన్ అండతో జెమెనీ ఛానెల్ ని దెబ్బ కొట్టింది

Posted By:
Subscribe to Filmibeat Telugu
Atharintiki Dharedhi registers massive TRP
హైదరాబాద్: ఇన్నాళ్లూ తెలుగు వినోదాత్మక ఛానెల్స్ లో నెంబర్ వన్ గా నిలిచిన జెమినీ టీవీ రెండో స్ధానానికి పడిపోయింది. గత పదేళ్లలో ఇది రెండవ సారి. మొదటి సారి క్రితం సంవత్సరం ఈటీవీ ఆ స్ధానానికి వచ్చింది. ఇప్పుడు మరోసారి మాటీవీ నెంబర్ వన్ స్ధానానికి వచ్చి జెమెనీని పడేసింది. అయితే ఈ సారి జెమెనీ ఛానెల్ పడిపోవటానికి కారణం పవన్ కళ్యాణ్ సినిమా కావటం విశేషం.

వివరాల్లోకి వెళితే...జనవరి నెల 5 నుంచి 11 మధ్య నడిచిన రెండవ వారాంతం టీఆర్పీలలో మాటీవీ ఆధిక్యం చాటుకుంది. టీఆర్పీ లెక్కల ప్రకారం ఎంటర్టైన్మెంట్ విభాగంలో మూడు వర్గాలను పరిగణంలోకి తీసుకుని లెక్కలు వేస్తారు.ఈ మూడు వర్గాల్లో నాలుగేళ్లు పైబడిన అందరూ,నాలుగేళ్లు పై బడిన మహిళలు, 15 ఏళ్లు పై బడిన మహిళలు ఉంటారు. వీటి అన్నిటిలోనూ మాటీవి నెంబర్ వన్ గా నిలిచింది. దానికి కారణం అత్తారింటికి దారేది చిత్రం కావటం విశేషం.

మాటీవి ఛానెల్ ...నాలుగేళ్లు పైబడిన అందరూ(12.03),నాలుగేళ్లు పై బడిన మహిళలు(12.74), 15 ఏళ్లు పై బడిన మహిళలు (12.24) రేటింగ్స్ వచ్చాయి. ఈ శాటిలైట్ రైట్స్ నిమిత్తం కూడా ఛానెల్ వారు దాదాపు తొమ్మిది కోట్లు వరకూ వెచ్చించినట్లు వినపడింది. దాంతో మొదటి సారే మొత్తం రికవరీ అయితే మిగతాదంతా లాభమే అంటున్నారు.

ఈ సినిమాకు వచ్చే టీఆర్పిలు,వాటి ద్వారా వచ్చే యాడ్స్ తో బాగా లాభపడే అవకాసం ఉందని టీవీ వర్గాలల్లో చెప్పుకుంటున్నారు. జనవరి 4 వ తేదికి ఈ చిత్రం వంద రోజులు పూర్తి చేసుకుంటుంది. వంద రోజులు పూర్తి చేసుకున్న పది రోజుల్లోనే టీవీలో ప్రసారం కావటంతో ఓ రేంజిలో టీఆర్పీలు వచ్చాయి.

పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary
Atharintiki Dharedhi was aired on MAA Tv on January 11 and the latest news is that the film got a TRP of 19. It is said to be one of the highest ever TRP for a movie premiere on TV.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu