»   » అవికా గోర్ ఏంటీ దారుణ నిర్ణయం? పవన్ తో చేయవా?

అవికా గోర్ ఏంటీ దారుణ నిర్ణయం? పవన్ తో చేయవా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కల్యాణ్ నా అభిమాన హీరో. అతనితో నటించే అవకాశం లభించాలని ప్రతి రోజు కోరుకుంటున్నాను అని ప్రతీ ఇంటర్వూలో చెప్తూంటుంది అవికా గోర్. మరి ఆ అవకాసం రాకుండానే ఆమె ఓ నిర్ణయం తీసుకుంటే....

ఈ మధ్యకాలంలో తెలుగు ఇళ్లల్లోకి ఇంతలా దూసుకువెళ్లిన నటి మరొకరు లేరంటే అతి శయోక్తి కాదు. కలర్స్ టెలివిజన్, మన ఇక్కడ లోకల్ టెలివిజన్ ఛానెల్స్ లో ప్రసారమైన చిన్నారి పెళ్ళికూతురు టీవీ సీరిస్ ద్వారాఈమె నటన దేశవ్యాప్త ప్రశంసలు పొందింది. తెలుగు లో 2013 లో ఈమె ఉయ్యాల జంపాల చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. అలాంటి ఆమె ఇప్పుడు ఓ సీరియస్ నిర్ణయం తీసుకుందని సమాచారం.

ఉయ్యాల జంపాల చిత్రంలో నటించిన రాజ్ తరుణ్ తోనే ఆమె ఇంకో హిట్ కూడా కొట్టింది. 'సినిమా చూపిస్త మావ'అంటూ వచ్చిన ఈ చిత్రం ఈమెకు మంచి క్రేజే తెచ్చి పెట్టింది. పవన్ తో చెయ్యటమే ఆమె యాంబిషన్ అని చెప్పే ఆమె సినిమాలకు పుల్ స్టాప్ పెట్టాలనుకోవటం భాధాకరమే అంటున్నారు ఫ్యాన్స్. పవన్ వంటి స్టార్స్ తో చేయటానికి రెడీ అవటానికే ఆమె ప్రస్తుతం గ్యాప్ తీసుకుంటోంది అంటున్నారు ఇండస్ట్రీ వాళ్లు.

అయితే అవికా నటించిన లక్ష్మీరావే మా ఇంటికి, తను నేను వంటి సినిమాలు వర్కవుట్ కాలేదు. కానీ ఆమెను హీరోయిన్ గా తీసుకోవటానికి చిన్న నిర్మాతుల ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే ఆమె అనుకున్నట్లుగా పెద్ద లీగ్ లోకి వెళ్లలేకపోయింది. రాజ్ తరుణ్ వంటి హీరోలకే పరిమితమైంది. అందుకు కారణం...ఆమె కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ హీరోయిన్ గా ఎట్రాక్ట్ చేయకపోవటమే అంటారు విశ్లేషకులు.

హఠాత్తుగా అవిక ఈ నిర్ణయం తీసుకోవటం వెనక రీజన్స్..స్లైడ్ షోలో

మిస్సవుతున్నా

మిస్సవుతున్నా

ఆమె సన్నిహితులు మాత్రం ...అవిక అందరిలా టీనేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకుంటోంది. చిన్నప్పటినుంచీ నటిస్తూనే ఉంది. అందుకే బోర్ కొట్టేసి ఇలా అంటున్నారు.

చెప్పుకోదగ్గవి

చెప్పుకోదగ్గవి

అవిక చేతిలో చెప్పుకోతగ్గ సినిమాలు లేకపోవటమే ఆమె ఈ నిర్ణయం తీసుకోవటనికి కారణం అంటున్నారు. ఏవి పడితే అవి చేసి ఫేడ్ అవుట్ అవటం కన్నా తనంతట తానే బ్రేక్ తీసుకుని వస్తే బెస్ట్ అని భావించిందని చెప్తున్నారు.

సంప్రదాయం..

సంప్రదాయం..

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌లో అవికా చాలా సాంప్రదాయంగా కనిపించేది..అదే ట్రెండ్ సినిమాల్లో కూడా కొనసాగించింది. అది ఓ వర్గాన్ని ఆకట్టుకున్నా కమర్షియల్ డైరక్టర్స్ ని ఆకట్టుకోలేకపోయింది.

రూట్ మార్చాలి

రూట్ మార్చాలి

కొద్ది కాలం గ్యాప్ తీసుకుని, సంప్రదాయ పాత్రలకు స్వస్ధి చెప్పేలా తనను తాను మార్చుకుని గ్లామర్ లుక్ ఫొటో షూట్ తో ముందుకు వద్దామనే ఆలోచనలో ఉందని చెప్తున్నారు.

టీవిల్లో బిజీ

టీవిల్లో బిజీ

ఆమెకు హిందీ టీవి సీరియల్ లో ఆఫర్స్ రావటమే ఈ నిర్ణయం తీసుకోవటానికి కారణం అని కొందరు అంటున్నారు. కంటిన్యూ క్యారక్టర్ ఓ పెద్ద సంస్ద నిర్మించే సీరియల్ లో ఒప్పుకుందని చెప్తున్నారు.

 పూర్తి చేసాకే

పూర్తి చేసాకే

తమిళంలో ఆమె జీవి ప్రకాష్ ప్రక్కన ఓ చిత్రం చేస్తోంది. ఆ చిత్రం పూర్తయ్యాక గ్యాప్ ఇస్తానని చెప్పినట్లు సమాచారం.

సీరియల్సే బెస్ట్...

సీరియల్సే బెస్ట్...

సినిమాల వల్ల లభించిన గుర్తింపు కంటే సీరియల్స్‌తో వచ్చిన పేరు ప్రఖ్యాతులే నాకు ఎక్కువ ఆనందాన్నిచ్చాయి అంటోంది అవికా గోర్.

తొలిసారి...

తొలిసారి...


ఎనిమిదేళ్ల వయసులో ఓ వాణిజ్య ప్రకటనలో నటించింది. ముంబైలో పుట్టడం, అమ్మానాన్నలు ఇద్దరూ వ్యాపారవేత్తలు కావటం కలిసివచ్చింది.

సీరియల్స్ తెచ్చిన గుర్తింపు

సీరియల్స్ తెచ్చిన గుర్తింపు

బాలిక వధు సీరియల్‌తో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల వారికి చేరువ కావడం ఆనందాన్నిచ్చింది.

 ఇది ఇండియాతోపాటు

ఇది ఇండియాతోపాటు

ఈ సీరియల్ సూపర్ హిట్ అవటంతో... కజకిస్తాన్, జపాన్, వియత్నాం లాంటి దేశాల్లోనూ అవికాకు అభిమానుల్ని సంపాదించి పెట్టింది.

ఆనందిగా..

ఆనందిగా..

చిన్న వయసులోనే ఆనంది పాత్రతో అక్కడి వారి హృదయాల్లో నిలిచి పోయినందుకు గర్వంగానూ అనిపించిందని చెప్తోంది.

సీరియల్స్ వదులుకోదు...

సీరియల్స్ వదులుకోదు...

ఇప్పటికైతే సినిమాలకంటే సీరియల్స్‌తో వచ్చిన పేరే నాకు ఎక్కువ సంతోషాన్నిస్తోంది. అందుకే, సినిమా అవకాశాలు వచ్చినా సీరియల్స్‌కు మాత్రం దూరం కాలేదు.

ఆ గుర్తింపే తెలుగు సినిమా

ఆ గుర్తింపే తెలుగు సినిమా

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్స్, డ్యాన్స్ రియాలిటీ షోస్ తెచ్చి పెట్టిన గుర్తింపు వల్లే ఉయ్యాల జంపాల చిత్రంలో అవకాశం వచ్చింది. కథ నచ్చడం, అమ్మానాన్నలు ఓకే అనడంతో ఈ సినిమాలో నటించింది.

తెలుగు భాషలో నటించడానికి కారణం

తెలుగు భాషలో నటించడానికి కారణం

అభినయానికి ఆస్కారమున్న, నా వయసుకు తగిన మంచి కథలు రావడంతో తెలుగులో ఆరంగేట్రం చేశాను. నాకున్న పరిమితుల్లో సినిమాలు చేయడానికి తెలుగు ఇండస్ట్రీ మాత్రమే కరెక్ట్ అనుకుంటున్నాను అని చెప్తోంది.

తెలుగు నేర్చుకుందా...

తెలుగు నేర్చుకుందా...

తెలుగులో సినిమాలు చేస్తున్నా ఈ భాషపై పట్టు మాత్రం సాధించలేకపోయాను అంటోది ఈమె.

కష్టమైంది

కష్టమైంది

ఉయ్యాల జంపాల సినిమాలోని కొన్ని సన్నివేశాల్లోని భావోద్వేగాల్ని అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. దర్శకుడి సహకారంతో ఆ ఇబ్బందుల నుంచి బయటపడ్డాను.

ఇతర భాషల్లో సినిమాలు

ఇతర భాషల్లో సినిమాలు

కేరాఫ్ పుట్‌పాత్ అనే కన్నడ చిత్రంలో నటించాను. ఇదే సినిమాతో హిందీలో ఆరంగేట్రం చేశాను

కాకపోతే

కాకపోతే

సినిమాల్లోకి రాకుండా ఉండుంటే కొరియోగ్రాఫర్‌గా స్థిరపడేదాణ్ని.

మొదటి రెమ్యునేషన్

మొదటి రెమ్యునేషన్

డబ్బుకు సంబంధించిన వ్యవహారాలన్నీ నాన్నే చూసుకుంటారు. ప్రస్తుతం చేస్తోన్న సినిమాలకు సంబంధించి నా పారితోషికం ఎంతనేది కూడా నాకు తెలియదు అందామె.

జడ్జిమెంట్

జడ్జిమెంట్

కథలోని కొత్తదనం, నా పాత్ర చిత్రణను అనుసరించి ఓ సినిమాను చేయాలా? వద్దా? అనే నిర్ణయానికి వస్తాను. అంతిమ నిర్ణయం మాత్రం నాదే. నా మనసుకు నచ్చిన విధంగా నడుచుకుంటాను.

డ్రీమ్ రోల్స్

డ్రీమ్ రోల్స్

చాలా ఉన్నాయి. సద్మా చిత్రంలో శ్రీదేవి లాంటి పాత్రను పోషించాలనుంది.

లవ్ ఎట్...

లవ్ ఎట్...


షాహిద్ కపూర్‌ను అతని పెళ్లిలో చూసి ప్రేమలో పడ్డాను. ఇది గతం.

నా మైనస్ పాయింట్

నా మైనస్ పాయింట్

కంఫర్ట్ జోన్‌లో ఉంటూ సినిమాలు చేయడమే నా ప్లస్, మైనస్ పాయింట్స్.

అభిమాన హీరో

అభిమాన హీరో

పవన్ కల్యాణ్. అతనితో నటించే అవకాశం లభించాలని ప్రతి రోజు కోరుకుంటున్నాను.

రోల్ మోడల్

రోల్ మోడల్

కాజల్. రీల్ లైఫ్, రియల్ లైఫ్‌లోను ఆమె ఒకే తీరుగా ఉంటుంది ఆమే నా రోల్ మోడల్ అంటోంది.

English summary
Daily Soap queen turned Silver screen princess Avika Gor had a dream to act with Pawan Kalyan. But She want to quit movies some time.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X