»   » 'బాహుబలి' ఈ ఆదివారం మళ్లీ

'బాహుబలి' ఈ ఆదివారం మళ్లీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : వెండితరపై ఘన విజయం సాధించిన 'బాహుబలి' ఆ మధ్యన బుల్లి తెరపై కూడా టీఆర్పీలు, యాడ్స్ పరంగా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని మరోసారి హక్కులు తీసుకున్న మా టీవి వారు ఈ ఆదివారం ప్రదర్శిస్తున్నారు. ఈ మేరకు మాటీవి టీమ్ పోస్ట్ పెట్టి ..అభిమానులకు తెలియచేసింది.


కలెక్షన్లతో పాటు అవార్డుల విషయంలో కూడా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్న బాహుబలి ఇప్పుడు మరో ఘనత తన ఖాతాలో వేసుకుంది. 2015 గిల్డ్ అవార్డ్స్ లిస్ట్ లో స్థానం సంపాదించి మరోసారి వార్తల్లో నిలిచింది బాహుబలి. ఎవరు ఊహించని స్థాయి భారీచిత్రాన్ని రూపొందించినందుకు గాను ఈ ప్రత్యేక పురస్కారాన్ని ప్రకటించింది గిల్డ్ అవార్డ్స్ జ్యూరీ.ఈ సందర్భంగా అవార్డ్ ప్రధానం చేసిన ముఖేష్ భట్ మాట్లాడుతూ... 'ఎవరు చేయలేని ఓ సాహసం చేసిన నిర్మాత, దర్శకుడు, చిత్రయూనిట్ గురించి మాట్లడటం ఎంతో గర్వంగా ఉంది.రాజమౌళీ.. నువ్వు మరిన్ని చిత్రాలతో మేము గర్వించేలా చేయాలి' అన్నారు.


గూగుల్‌ సెర్చ్ లో కూడా ఇండియాలో నెం.1 మూవీగా బాహుబలి ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం రాజమౌళి ‘బాహుబలి' చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించే పనిలో నిమగ్నం అయ్యారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయింది. ‘బాహుబలి-ది కంక్లూజన్' పేరుతో తెరకెక్కే ఈ చిత్రం 2017లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


English summary
Baahubali team shared in FB.... India's Biggest Blockbuster #Baahubali once again on MAATV ..This Sunday ..Don't Miss
Please Wait while comments are loading...