»   » 'బాహుబలి' దీపావళి కు: టీఆర్పీ లు అదురుతాయి(వీడియో)

'బాహుబలి' దీపావళి కు: టీఆర్పీ లు అదురుతాయి(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌, రానా, రమ్యకృష్ణ, అనుష్క, తమన్నాలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'బాహుబలి'. జులై 10న విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రికార్డుస్థాయిలో వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం దీపావళి సందర్భంగా తమిళంలో జయ టీవిలో ప్రసారం కానుంది. ఈ మేరకు ట్రైలర్ విడుదల కానుంది.


తెలుగుతో పాటు, తమిళం, హిందీ, మళయాలం బాషల్లో గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ సంచలన చిత్రంగా నిలిచింది. రూ. 600 కోట్లకుపైగా వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడువిడుదలవడమే భారీగా విడుదలైన ఈచిత్రం 50 రోజుల పాటు విజయవంతంగా ప్రదర్శితం అయి కలెక్షన్ల సునీమీ సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమా బిజినెస్ దాదాపుగా క్లోజ్ అయింది. దర్శకుడు రాజమౌళి కూడా రికార్డుల కోసం సినిమాను ఎక్కువ రోజులు నడిపించాలనే ఉద్దేశ్యం తమకు లేదని, కలెక్షన్లు వచ్చే కొన్ని చోట్ల మాత్రమే ప్రదర్శిస్తామని గతంలోనే ప్రకటించారు.


Baahubali Tamil TV Premiere on Jaya TV

తెలుగులో ‘బాహుబలి' మూవీ బిజినెస్ పూర్తవడంతో కలెక్షన్ వివరాలు బయటకు వచ్చాయి. ఒక తెలుగు వెర్షన్ చిత్రమే రూ. 172 కోట్లకుపైగా షేర్ వసూలు చేసింది. తెలుగులో సినిమా చరిత్రలో ఈ రేంజిని అందుకునే సత్తా త్వరలో రాబోయే ‘బాహుబలి-2' సినిమాకు తప్ప మరే సినిమాకు లేదని చెప్పడంలో సందహం లేదు.


English summary
Baahubali (Tamil) version satellite rights bagged by #JayaTV channel & it will be premiered for Diwali, this Tuesday. ssrajamouli
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu