For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బిగ్‌బాస్ పిచ్చోళ్ల స్వర్గమా? ఈ ఐటీ యుద్ధం సరికాదు... బయటకొచ్చి బాబు గోగినేని సంచలనం!

  By Bojja Kumar
  |

  బిగ్‌బాస్ హౌస్ నుండి గత వారం బాబు గోగినేని ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. బయటకు వచ్చిన తర్వాత ఈ షో మీద బాబు గోగినేని తనదైన అభిప్రాయాలు వెల్లడించారు. అదే సమయంలో ఇంట్లో వారిని గెలిపించడానికి బయట కొందరు పనిగట్టుకుని చేస్తున్న పనులను ఆయన తప్పుబట్టారు. అదే సమయంలో ఇలాంటి షోలో పాల్గొనే అవకాశం జీవితంలో ఒకేఒకసారి వచ్చే అవకాశమని, ఈ షోలో తన పెర్ఫార్మెన్స్‌కు 85 నుండి 90 మార్కులు వేసుకుంటున్నట్లు వెల్లడించారు.

  Bigg Boss Season 2 Telugu : Babu Gogineni Interview
   బిగ్‌బాస్ ఒక పిచ్చోళ్ల స్వర్గం అని...

  బిగ్‌బాస్ ఒక పిచ్చోళ్ల స్వర్గం అని...

  బిగ్‌బాస్ హౌస్ అంటే ఒక పిచ్చివాళ్ల స్వర్గం అని కొంత మంది అనుకోవడం, అక్కడికి ఈ బాబు ఎందుకెళ్లాడని చాలా మంది నన్ను కోప్పడటం జరిగింది. దీనికి ఒక వివరణ ఇవ్వాలనుకుంటున్నాను అంటూ బాబు గోగినేని ఈ షో మీద తన వెర్షన్ మొదలు పెట్టారు.

  మనం ఏం చేశామనేదే ముఖ్యం

  మనం ఏం చేశామనేదే ముఖ్యం

  బిగ్‌బాస్ హౌస్ ఎలా ఉన్నా.... ఇష్టంగా ఉన్నా, కష్టంగా ఉన్నా అక్కడ మనం ఏం చేశామనేది చాలా ముఖ్యం. బిగ్‌బాస్ చెప్పినవి అన్నీ చేశామా? బిగ్గర్ బాస్‌గా వ్యవహరించామా? ఎవరికీ భయపడకుండా మన విలువల ఆధారంగా ఉండే ప్రయత్నం ఏమైనా చేశామా? అన్ని విధాలా సక్సీడ్ కాక పోయినా ఆ ప్రయత్నం చేయడం జరిగిందా లేదా అనేది ముఖ్యమని బాబు గోగినేని అన్నారు.

  మెంటల్, ఫిజికల్ ఛాలెంజ్

  మెంటల్, ఫిజికల్ ఛాలెంజ్

  ఇంట్లో మెజారీటీ తీరిన 16 మంది సభ్యులు వివిధ రంగాల నుండి వచ్చారు. ఎవరి వ్యక్తిత్వం వారికి ఉంది. వారందరినీ వేరియస్ సైకలాజికల్ ప్రెషర్స్‌లో పెట్టి బయట ఏం జరుగుతుందో తెలియకుండా చేసి, లోపల కూడా ఒకరితో ఒకరు సయోధ్యగా ఉండటానికి వీల్లేకుండా వాళ్లతో వివిధ పనులు చేయించడం, ఒకరికొకరు కోపాలు వచ్చేలా చేయడం, అంతా అయిన తర్వాత మీరెందుకు దెబ్బలాడారని అడగటం ఇదంతా కూడా మన ఫిజికల్, మెంటల్ చాలెంజ్.

  జీవితంలో ఒకసారి వచ్చే అవకాశం

  జీవితంలో ఒకసారి వచ్చే అవకాశం

  మనకు సమయం కూడా తెలియకుండా అన్నం ఏం తినాలి, ఇవాళ ఎంత వస్తుంది ఫుడ్ అనేది అర్థం కాకుండా, స్నానానికి వేడి నీళ్లు ఉంటాయా? ఉండవా... ఇలా మనకు దైనందిత జీవితంలో ఉండే వసతులు ఏవీ లేకుండా వాటికి దూరంగా పెట్టి...రకరకాల ప్రెషర్స్‌కు గురి చేస్తూ అపుడు మన రెస్పాన్స్ ఏమిటి? అనేది మనకు మనం టెస్టు చేసుకునే జీవితంలో ఒకేసారి వచ్చే అవకాశం.

  90 మార్కులు వేసుకుంటా

  90 మార్కులు వేసుకుంటా

  నా పార్టిసిపేషన్‌కు వందకు 85 నుండి 90 మార్కులు వేసుకోవచ్చేమో? ఒక్కోసారి తప్పులు జరుగుతాయి. జరుగకుండా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే మన మెమొరీ ఎఫెక్ట్ అవుతుంది, ఆ ప్రెషర్స్‌లో కొన్ని విషయాలు గుర్తుండవు. పెన్ను, పేపర్ ఏమీ ఉండవు. మన చుట్టూ 90 కెమెరాలు. ఎప్పుడు పడుకుంటున్నామో ఐడియా లేదు. ఎప్పుడు నిద్రలేస్తామో తెలియదు. ఆ రోజు ఏం తింటాం, ఏం చేయబోతున్నాం అనేది కూడా మనకు ముందుగా తెలియదు. ఇదొక ఇంట్రెస్టింగ్ ఎక్స్ పీరియన్స్. ఇలాంటి దాంట్లో నేను 63 రోజలు ఉన్నాను.

  నేను వెళ్లిన పని పూర్తయింది

  నేను వెళ్లిన పని పూర్తయింది

  లాస్ట్ వన్ వీక్ నాలో ఆసక్తి తగ్గిపోయిందని చూసే వారికి కూడా తెలిసిపోయింది. నాని గారు కూడా నువ్వు లైట్ తీసుకుంటున్నావ్ అని అడగటం జరిగింది. అదంతా నిజమే. నేను ఎందుకు అక్కడికి వెళ్లానో ఆ పర్పస్ అచీవ్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదేమో? అనే ఒక నిర్ణయానికి కూడా రావడం జరిగింది.

  బయట ఈ యుద్ధాలు ఏమిటో?

  బయట ఈ యుద్ధాలు ఏమిటో?

  బయటకు వచ్చాక మా గురించి ఏం చూపిస్తున్నారో తెలుసుకోవడానికి ఒకటిన్నరోజు పట్టింది. బయట జరిగే విషయాలు నన్ను ఆశ్చర్య పరిచాయి. ఇదొక ఐటి వార్ లాగా నడుస్తున్నట్లుగా, ఐటి సెల్స్ యుద్ధం లాగా జరుగుతున్నట్లుగా ఉంది. నేను ఇలాంటి వాటిని వెల్ కం చేయను. ఎవరి తరుపున చేసినా, నా తరుపున చేసినా కూడా నేను ఆహ్వానించను. జెన్యూన్ గా ఓటు వేసే వారే వేయాలి. ఇలా యుద్ధం అనుకోవడం కరెక్ట్ కాదు. అందరూ ఒకటి గుర్తుంచుకోవాలి. బిగ్ బాస్ హౌస్ అనేది ఒక గేమ్ షో. రియల్ గేమ్ అనేది మన జీవితం.

  బాబు గోగినేని కామెంట్స్ ఎవరిపై?

  బాబు గోగినేని కామెంట్స్ ఎవరిపై?

  బయట కొందరు లోపల ఉన్న వారిని గెలిపించడానికి చేస్తున్న ఐటీ యుద్ధం చేస్తున్నారు. ఎవరి తరుపున చేసినా, నా తరుపున చేసినా కూడా నేను ఆహ్వానించను. జెన్యూన్ గా ఓటు వేసే వారే వేయాలి. ఇలా యుద్ధం అనుకోవడం కరెక్ట్ కాదు... అనే కామెంట్స్ కౌశల్ ఆర్మీ గురించే చేసినట్లు తెలుస్తోంది.

  English summary
  Babu Gogineni Shocking Reaction in Bigg Boss. Babu Gogineni who has spent 63 days in a Telugu Reality Show Bigg Boss has been eliminated. He said he greately enjoyed being there.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X