»   » బాలకృష్ణ ‘లయన్’ టీవీలో ఎప్పుడంటే...

బాలకృష్ణ ‘లయన్’ టీవీలో ఎప్పుడంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాలకృష్ణ సిబిఐ ఆఫీసర్ గా నటించిన చిత్రం ‘లయన్'. సత్యదేవా దర్శకుడుగా పరిచయమవుతూ చేసిన ఈ సినిమాకి రుద్రపాటి రమణారావు నిర్మాత. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం ఏప్రియల్ లో విడుదల చేసారు. ఈ చిత్రం ప్రీమియర్ షో ని ..ఆగస్టు 15న జెమెనీలో సాయింత్రం ఆరు గంటలకు ప్రసారం చేస్తున్నారు. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్స్ గా నటించారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


బాలకృష్ణ నటించిన సినిమా ‘లయన్' శాటిలైట్ హక్కులు విడుదలకు ముందే అమ్ముడయ్యాయి. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ జెమినీ 6 కోట్లకు ‘లయన్' శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది.


పెయిన్ ('లయన్' రివ్యూ)


https://www.facebook.com/TeluguFilmibeat

త్రిష మరియు రాధిక ఆప్టే హీరోయిన్ లుగా నటించిన ఈ మాస్ ఎంటర్టైనర్ లో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రలు పోషించారు. ఈ సినిమాలో బాలకృష్ణ సిబిఐ ఆఫీసర్ గా, సామాన్యుడిగా ద్విపాత్రాభినయం చేసారు. సత్యదేవ దర్శకత్వం వహించారు. రుద్రపాటి రమణారావు నిర్మాత. యాక్షన్ ఎంటర్టైనర్ గా అభిమానులను అలరించే అన్ని అంశాలతో సినిమాను రూపొందించారు.


నీతి, నిజాయతీలను ప్రాణంగా భావించే ఆయన కథ ఇది. ఆయన సమాజానికి మంచి చేయాలనే సంకల్పంతో ఓ కేసు విషయంలో అవినీతి పరుల కు వ్యతిరేకంగా పోరాడి...నాయకుడిలా మారి అక్రమార్కుల గుండెల్లో గుబులు రేకెత్తిస్తారు. కథలో మలుపులు ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తాయి.


బాలకృష్ణ సరసన త్రిష హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, జయసుధ, అలీ, గీత, చంద్రమోహన్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: వెంకట్‌ ప్రసాద్‌, కూర్పు: గౌతంరాజు

English summary
Balakrishna's previous film ‘Lion’ directed by Satyadeva film's premier will be screened on small screen on Independence Day. ‘Lion’ premiere will be screened on Saturday, Aug,15th, at 6 PM in Gemini TV.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu