BBC's Gaalivaana on ZEE5 తెలుగు ప్రేక్షకుల ప్రేమ వెలకట్టలేనిది.. రాధిక శరత్ కుమార్ ఎమోషనల్
ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ స్టూడియోస్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ భాగస్వామ్యంతో తెలుగు ప్రేక్షకుల అభిరుచి మేరకు గాలివాన అనే ఒరిజినల్ సిరీస్‌ను నిర్మిస్తున్నది. సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్, హీరో సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాలు, సీరియళ్లు చేసిన రాధికా శరత్ కుమార్, ఓటీటీ కోసం షో చేస్తుండటం ఇదే తొలిసారి. ఈ వెబ్ సిరీస్‌తో బిబిసి రీజనల్ ఎంటర్‌టైన్‌మెంట్‌లోకి అడుగు పెడుతోంది అని నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్, 'జీ 5' సంస్థలు తెలిపాయి. 'తిమ్మరుసు' ఫేమ్ శరణ్ కొప్పిశెట్టి ఈ ఒరిజినల్ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తుండగా, సుజాత సిద్ధార్థ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ నెల 14న ZEE5 లో స్ట్రీమింగ్ అవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లోని ZEE5 యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా నటి రాధిక మాట్లాడుతూ..
తెలుగు ప్రజలకు నేను రుణపడి ఉన్నాను ఎందుకంటే ఎప్పటినుంచో నన్ను ఆదరిస్తున్నారు. వాళ్ళ ప్రేమ వెలకట్టలేనిది. నిర్మాత శరత్ నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. తనను చిరంజీవి గారి దగ్గర చూసేదాన్ని. శరత్ మరార్ చెప్పిన కథ నచ్చడంతో ఈ గాలివాన వెబ్ సిరీస్ చేశాను. మంచి ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి చాలా బాగా డీల్ చేశాడు. సాయికుమార్‌గారు కూడా అద్భుతంగా నటించాడు. తనతో చాలా సినిమాలలో నటించే అవకాశం వచ్చి మిస్సయినా.. "గాలివాన" లో నటించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ZEE5, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్, శరత్ మంచి సబ్జెక్ట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇలాంటి మంచి సబ్జెక్ట్ రావడం వల్ల ZEE5 పై వీక్షకులకు రెస్పెక్ట్ పెరుగుతుంది. తెలుగులో వస్తున్న "గాలివాన" వెబ్ సిరీస్ ఒక ల్యాండ్ మార్క్ సిరీస్ అవుతుంది అని అన్నారు.

.
నటుడు సాయికుమార్ మాట్లాడుతూ...అందరూ డైలాగ్ కింగ్ సాయికుమార్ అంటారు. కానీ ఈ స్వరం నాకు నాన్నగారిచ్చారు. సంస్కారం మా అమ్మగారు ఇచ్చింది. అనుగ్రహం ఆ భగవంతుడిది. ఆశీర్వాదం, అభిమానం మీ అందరిదీ. అలా పోలీస్ స్టోరీ ద్వారా నా జర్నే స్టార్ట్ అయ్యింది. కన్నడలో పోలీస్ స్టోరీ సినిమా ద్వారా అక్కడి ప్రజలు నన్ను హీరోని చేశారు. అక్కడి నుంచి ఎన్నో అద్భుతమైన వేషాలు వేయడం జరిగింది. సావిత్రి గారి దగ్గరనుంచి అందరితో వర్క్ చేశాను కానీ.. ఒక రాధికా గారితో మాత్రం మిస్ అయింది. మా నాన్న గారు రాధిక గారు నటించిన న్యాయం కావాలి సినిమాలో జడ్జిగా యాక్ట్ చేశాడు. చివరికి ఇప్పుడు రాధిక గారితో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఓటీటీకి ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. శరణ్ వంటి యంగ్ అండ్ టాలెంటెడ్ టీంతో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ నెల 14న వస్తున్నాం గాలివాన మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది కుటుంబ సమేతంగా అందరూ కలిసి చూసే ఈ గాలివాన ను సక్సెస్ చేయాలని కోరుతున్నాను అన్నారు.
నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ...సరస్వతిగా రాధిక గారు, కోమర్ రాజుగా సాయికుమార్ అద్భుతంగా నటించారు. ZEE5, బిబిసిలతో కొలాబ్రేట్ అయ్యి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ మా నార్త్ స్టార్ ప్రొడక్షన్‌కు వెరీ స్పెషల్. దర్శకుడు శరణ్ కథకు ఏం కావాలో వారి క్యారెక్టర్స్‌ను, ఎమోషన్స్‌తో ఎవరి క్యారెక్టర్ వాళ్లకి అద్భుతంగా వచ్చేలా ఆర్టిస్టుల దగ్గర నుంచి చాలా చక్కగా రాబట్టుకున్నాడు. నా భార్య కీర్తి ప్రాజెక్టు హెడ్‌గా కో ప్రొడ్యూసర్‌గా ఉంటూ ఈ వెబ్ సిరీస్ ను కోఆర్డినేట్ చేసింది. ఏప్రిల్ 14న వీక్షకుల ముందుకు వస్తున్న మా "గాలివాన" వెబ్ సిరీస్ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అన్నారు.
దర్శకుడు శరణ్ గోపిశెట్టి మాట్లాడుతూ...నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నాకు హోమ్ బ్యానర్ లాంటిది. ఇందులో ఇంతకు ముందు నార్త్‌స్టార్‌లోనే 'ది గ్రిల్' అనే వెబ్ సిరీస్ చేశాను. నేను మూవీ చేస్తున్నాను వెబ్ సిరీస్ చేయలేను అని చెప్పడానికి వెళ్లిన నాకు శరత్ గారు ఫోన్ చేసి సీనియర్ నటి రాధిక గారు, సాయి కుమార్ గార్లతో వెబ్ సిరీస్ చేద్దామన్నారు. రాధిక మేడం, సాయి కుమార్ లాంటి పెద్ద ఆర్టిస్టులతో వర్క్ చేయడం అదృష్టంగా భావించాను.
మిక్స్‌డ్ ఎమోషన్స్‌తో ఉండే క్రైం థ్రిల్లర్ అని అన్నారు.
నటీనటులు : సాయికుమార్, రాధిక శరత్‌కుమార్, నందిని రాయ్, చాందిని చౌదరి, చైతన్య కృష్ణ, అశ్రిత వేముగంటి, తాగుబోతు రమేష్, అర్మాన్, శరణ్య ప్రదీప్, ఆర్. రమేష్, శ్రీలక్ష్మి, నిఖిత, చరిత్, సతీష్ సారిపల్లి, నానాజీ, నవీన్, సూర్య శ్రీనివాస్, జయచంద్ర తదితరులు
దర్శకత్వం: శరణ్ కొప్పిశెట్టి
డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ: సుజాత సిద్దార్థ
ప్రొడ్యూసర్: శరత్ మరార్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నీలిమా మరార్
ప్రాజెక్ట్ హెడ్: కీర్తి మన్నె
క్రియేటివ్ హెడ్: ఎ. సాయి సంతోష్
కాస్ట్యూమ్ డిజైనర్: రేఖా బొగ్గరపు
ఆర్ట్ డైరెక్టర్: ప్రణయ్ నయని
ఎడిటర్: సంతోష్ నాయుడు
సంగీతం: శ్రీచరణ్ పాకాల


Click it and Unblock the Notifications











