twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టీవీ సీరియల్లో ఇలాంటి సీన్లేంటి? రాత్రి 10 తర్వాతే ప్రసారం చేయండి

    పెహ్రిదార్ పియాకి అనే టీవీ సీరియల్ వివాదాస్పదం అయింది. ఈ సీరియల్ లో వచ్చే కొన్ని సీన్లు అభ్యంతరకరంగా ఉన్నాయి.

    By Bojja Kumar
    |

    సోనీ టీవీలో ప్రసారం అవుతున్న 'పెహ్రిదార్ పియా కి' అనే హిందీ టీవీ సీరియల్ వివాదాస్పదం అయింది. ఈ సీరియల్ లో కొన్ని సీన్లు వివాదాస్పదంగా ఉండటంతో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఫిర్యాదులపై ప్రసార మాధ్యమాల సంబంధిత విషయాల ఫిర్యాదుల మండలి (బీసీసీసీ) స్పందించింది. ఆ సీరియల్ రాత్రి 10 గంటల తర్వాతే ప్రసారం చేయాలని ఆదేశించింది.

    తొమ్మిదేళ్ల బాలుడు, 18 ఏళ్ల యువతిని ప్రేమ, పెళ్లి లాంటి కాన్సెప్టుతో ఈ సీరియల్‌ ప్రసారం అవుతోంది. ఇలాంటి సీరియల్స్ పిల్లల్లో చెడు ప్రభావాన్ని చూపుతాయని, అందుకే రాత్రి పూట మాత్రమే వీటిని ప్రసారం చేయాలని ఆదేశించారు.

    ఇలాంటి సీన్లేంటి?

    ఇలాంటి సీన్లేంటి?

    బాల్య వివాహాలను ప్రోత్సహించేలా ‘పెహ్రిదార్ పియా కి' సీరియల్‌ సీన్లు ఉండటం ఏమిటని, ఇలాంటి కాన్సెప్టుతో సమాజంలోకి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? అంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తూ చాలా మంది ఫిర్యాదులు చేశారు.

    Recommended Video

    Actresses Dress Slipped Oops Moments
    కాన్సెప్టు కొత్తగా ఉంది కానీ

    కాన్సెప్టు కొత్తగా ఉంది కానీ

    గత నెలలో ప్రారంభమైన ఈ సీరియల్ కాన్సెప్టు కొత్తగా ఉండటంతో మంచి రేటింగ్ వచ్చింది. అయితే బాల్య వివాహాలను ప్రోత్సహించేలా, 9 ఏళ్ల పిల్లాడు తనకంటే రెట్టింపు వయసు ఉన్న యువతిని పెళ్లాడటం లాంటి విరుద్ధమైన పోకడలపై విమర్శలు వచ్చాయి.

    మరిన్ని దారుణాలు జరిగే అవకాశం

    మరిన్ని దారుణాలు జరిగే అవకాశం

    ఈ మధ్య కాలంలో నిజ జీవితంలో కొన్ని సంఘటనలు జరిగాయి. 7వ తరగతి చదువుతున్న కుర్రాడు... టీచర్‌తో లేచి పోయి పెళ్లి చేసుకోవడం, పదవ తరగతి కుర్రాడితో అక్రమ సంబంధం పెట్టుకుని గర్భం దాల్చిన ఉపాధ్యాయురాలు లాంటి సంఘటనలు అందరినీ షాక్ కు గురి చేశాయి. ‘పెహ్రిదార్ పియా కి' సీరియల్స్ ను ప్రోత్సహిస్తే ఇలాంటి దారుణాలు మరిన్ని జరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

    నిషేదించాలని డిమాండ్

    నిషేదించాలని డిమాండ్

    ‘పెహ్రిదార్ పియా కి' సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీన్ని నిషేధించాలంటూ ఫిర్యాదులు వచ్చాయి. సోషల్ మీడియాలోనూ ఈ సీరియల్‌కు వ్యతిరేకంగా పెద్ద చర్చ జరిగింది. ‘చేంజ్.ఆర్గ్' వెబ్‌సైట్‌లో ఉంచిన పిటిషన్‌పై లక్షమందికిపైగా సంతకాలు చేశారు.

    బీసీసీసీ

    బీసీసీసీ

    ఫిర్యాదు నేపథ్యంలో బీసీసీసీ స్పందించి రాత్రి 9 గంటలకు బదులు పది గంటలకు ప్రసారం చేయాలని, అలాగే ఇదంతా కల్పితమని, బాల్య వివాహాలను ప్రోత్సహించడం లేదంటూ సీరియల్‌తోపాటే స్క్రోలింగ్ కూడా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

    English summary
    Pehredaar Piya Ki has become one of the most controversial TV shows in recent times ever since it came under the eye of BCCC. In the latest announcement, BCCC has asked the broadcasting channel, Sony to move the show to the 10 pm slot from its current 8.30 pm, and even run it with a disclaimer scroll that it doesn’t promote child marriage.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X