»   »  అదో స్కామ్...ఫేక్, ఆ ప్రకటన చూసి మోసపోవద్దు

అదో స్కామ్...ఫేక్, ఆ ప్రకటన చూసి మోసపోవద్దు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై :''కేబీసీ 9'కు సంబంధించి ఆ పోగ్రామ్ ని నిర్వహించే ఛానెల్‌ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ రిజిస్ట్రేషన్లంటూ కొన్ని సంస్థలు అమాయకులను మభ్యపెడుతున్నాయి. వాటితో జాగ్రత్త. ఆ ప్రకటనలను నమ్మి మోసపోకండి''అని అమితాబ్‌ తన బ్లాగులో తెలిపారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

బాలీవుడ్ రారాజు సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఎంతో ఇష్టపడి చేసిన రియాల్టీ షో కౌన్ బనేగా కరోడ్‌పతి. ఈ రియాల్టీ షో వల్ల అమితాబ్ తిరిగి కోల్పోయిన పూర్వవైభవం మరలా తిరిగిపోందారు. అంతేకాకుండా తనకంటూమరలా ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్నారు.

 Be cautious of fake KBC 9 registrations, warns Amitabh Bachchan

ఈ కార్యక్రమాన్ని వీక్షించేందు దేశవ్యాప్తంగానే గాక ప్రపంచంలోని బిగ్ బి అభిమానులు సైతం "కోటి" కళ్లతో వేచి చూస్తున్నసంగతి అందరికి తెలిసిందే.


పూర్తి వివరాల్లోకి వెళితే.... టీవి తెరపై 'కౌన్‌ బనేగా కరోడ్‌పతి (కేబీసీ)' ఓ సంచలనం అనే సంగతె తెలిసిందే. ఇప్పటి వరకూ 8 సీజన్లు పూర్తిచేసుకున్న ఈ పోగ్రామ్ లో ఒక్కటి మినహా అన్ని సీజన్లకూ అమితాబ్‌ బచ్చన్‌ యాంకర్ గా వ్యవహరించారు.

అయితే త్వరలో 'కేబీసీ 9' ప్రారంభమవుతుందనీ, అందులో పాల్గొనదలచినవారు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలంటూ కొన్ని సంస్థలు ప్రకటిస్తున్నాయి. అయితే వీటిని నమ్మవద్దని అభిమానులను హెచ్చరించారు అమితాబ్‌.

 Be cautious of fake KBC 9 registrations, warns Amitabh Bachchan

మరో ప్రక్క..... అమితాబ్‌ బచ్చన్‌ మరోసారి గాయకుడి అవతారం ఎత్తారు. ముంబయిలో జరగనున్న అంతర్జాతీయ స్థాయి కబడ్డీ పోటీల (ప్రో కబడ్డీ) ప్రచార గీతాన్ని అమితాబ్‌ ఆలపించారు.

కబడ్డీకి ప్రాచుర్యం కల్పించేందుకే ఆ పాట పాడానని ఆయన చెప్పారు. 'లే పంగా...' అంటూ సాగే ఆ గీతానికి యూట్యూబ్‌లో మంచి స్పందన వస్తోంది. ఆ పాటను మీరూ ఇక్కడ చూడవచ్చు.

English summary
“And yes on another front ... KBC! I get messages that seek registrations for KBC season 9 and so on ... this is a scam...a fake...an effort to fool innocent people...caution all... Sony has not given out any such direction,” Amitabh Bachchan, posted.
Please Wait while comments are loading...