»   »  షాక్...‌:లైవ్‌లోనే రిపోర్టర్ పై లైంగిక దాడి...(వీడియో)

షాక్...‌:లైవ్‌లోనే రిపోర్టర్ పై లైంగిక దాడి...(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొలోన్‌: లైంగిక వేధింపులకు కులంలేదు, మతం లేదు..దేశం,ప్రాంతం వంటి లేదు..ఎక్కడైనా ఎప్పుడైనా జరగవచ్చు అని ప్రపంచం వ్యాప్తంగా రోజువారీ జరుగుతున్న అనేక సంఘటనలు ప్రూవ్ చేస్తున్నాయి. అయితే బరితెగించి..టీవీ ఛానెల్ పై లైంగిక దాడి..లైవ్ లోఇవ్వటం మాత్రం ఇదే తొలిసారేమో..అందుకే ఈ వార్తకు ఇంత ప్రాధాన్యత సంతరించుకుంది.

జర్మనీలోని కొలోన్‌ టౌన్ లో లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయి. ఈ విషయాన్ని అక్కడమీడియా ప్రముఖ వార్తగా ప్రసారం చేస్తోంది. అంతెందుకు ఇటీవల నిర్వహించిన ఓ కార్నివాల్‌లో అమ్మాయిలను వేధించేవారు ఓ రేంజిలో రెచ్చిపోయారు. అక్కడ జరిగిన ఓ సంఘటన గురించే మనం మాట్లాడుకునేది.

Belgian journo molested by 'Europeans' during live report on sex attacks

ఒక బెల్జియన్‌ లేడీ రిపోర్టర్‌ సిటీసెంటర్‌ వద్ద బెర్లిన్ RTBF TV లైవ్‌ కార్యక్రమం నిర్వహిస్తుండగా..లైవ్ గా ఉండగానే అక్కడకు చేరిన ఓ కుర్రాడు ఆమెను పట్టుకొని అసభ్యంగా బిహేవ్ చేసాడు. దీంతో ఆమె షాకైంది.

ఈ సంఘటన మహిళల కార్నివాల్‌లో చోటుచేసుకోవటంతో మరింతగా ప్రదాన్యత సంతరచింతుకుంది. ఆ నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. యూరప్‌కు చెందిన వ్యక్తే ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని ప్రాధమిక విచారణలో తేలింది. ఈ ఘటనకు ముందు మరో ముగ్గురు తప్పతాగి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించం కూడా దారుణమైన విషయం. అందుకు సంభందించిన వీడియోని ఇక్కడ చూడండి.

అనంతరం ఆ రిపోర్టర్ మీడియాతో మాట్లాడుతూ...‘ దీని గురించి మాట్లాడదల్చుకోలేదు.. ఈ దుశ్చతర్యకు పాల్పడిన వ్యక్తి జర్మనీ భాషలో మాట్లాడుతున్నాడు' అని మహిళా రిపోర్టర్‌ తెలిపింది. ఆ మీడియా సంస్థ ఆ వీడియోను మళ్లీ ప్రసారం చేయకూడదని నిర్ణయించుకుంది. కానీ రెండు ఫొటోలను మాత్రం విడుదల చేసింది.

English summary
A Belgian journalist said she was molested while doing a live report on the Cologne carnival. Several men of apparently European appearance were making obscene gestures behind her. They tried to grope her and reportedly asked her to sleep with one of them.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu