»   » హాట్ టాపిక్: నాగార్జున టీఆర్పీలు తెచ్చి పెడతాడా?

హాట్ టాపిక్: నాగార్జున టీఆర్పీలు తెచ్చి పెడతాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కిన 'భాయ్' చిత్రం విడుదలై నెగిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. వీరభధ్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు టీవీల్లో ప్రసారం కానుంది. జీ తెలుగులో ఈ ఆదివారం ఐదు గంటలుకు వేస్తున్నారు. శాటిలైట్ రైట్స్ మంచి రేటుకు అమ్ముడుపోయిన ఈ చిత్రం టీఆర్పీలపైనే అందరి దృష్టీ ఉంది. బయిట ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం బుల్లి తెర ప్రేక్షకులను ఏ మేరకు అలరించనుందనే విషయంపై మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.

పెద్ద హీరోల సినిమాలు శాటిలైట్ రైట్స్ రిలీజ్ కు ముందు ఎక్కువ రేటు కు కొని తర్వాత వాటికి ప్లాఫ్ టాక్ వస్తే అనుకున్న రేంజిలో యాడ్స్ రాక రెవిన్యూలు ఉండటం లేదు. దాంతో ఈ ఎఫెక్టు శాటిలైట్ బిజినెస్ మొత్తంపై పడి చిన్న సినిమాల శాటిలైట్ కు గండికొడుతోంది. సినిమా హిట్ అయితేనే శాటిలైట్ కొందామనే ఆలోచనకు ఛానెల్స్ వారు వచ్చారు.

దాంతో ఇప్పుడు శాటిలైట్ బిజినెస్ మీద ఆధారపడి మొదలెట్టిన చాలా చిన్న సినిమాల పరిస్ధితి ఆగమ్య గోచరంగా మారింది. రిలీజ్ కు ముందు శాటిలైట్ నిమిత్తం అడ్వాన్స్ తెచ్చుకుని సినిమాలు పూర్తి చేసే నిర్మాతలకు ఏం చేయాలో తోచని పరిస్ధితి. దాదాపు ఎనిమిది వందల సినిమాల వరకూ శాటిలైట్ బిజినెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో భాయ్ చిత్రంపై అందరి దృష్టీ ఉంది.

ఈ చిత్రంలో రిచా గంగోపాధ్యాయ్, హంసా నందినీ, నథాలియా కౌర్, కామ్నా జఠ్మలానీ, సోనూసూద్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, షాయాజీ షిండే, ఆదిత్యా మీనన్, సుప్రీత్, అజయ్, ఎం.ఎస్.నారాయణ, రఘుబాబు, జయప్రకాష్‌రెడ్డి, నాగినీడు, జరాషా, చలపతిరావు, రాహుల్‌దేవ్, వెనె్నల కిశోర్, ప్రసన్న, హేమ, రజిత, గీతాంజలి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం:దేవిశ్రీప్రసాద్, కెమెరా:సమీర్‌రెడ్డి, మాటలు:సందీప్ - రత్నబాబు, పాటలు:రామజోగయ్యశాస్ర్తీ, అనంత్ శ్రీరామ్, ఎడిటింగ్:కార్తీక శ్రీనివాస్, నిర్మాత:నాగార్జున, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:వీరభద్రం.

English summary
Nagarjuna's Latest Movie " Bhai " Premieres on Zee Telugu, Sunday 23rd Feb 5:00pm.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu