For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam మోనిత రీ ఎంట్రీ.. నువ్వు బతికే ఉన్నావా అంటూ దీపకు షాక్

  |

  కార్తీక్ బెడ్‌పై నిద్ర పోవడం చూసి డ్రైవర్ అనుమానం వ్యక్తం చేశాడు. ఏంటి కార్తీక్ బాబు ఎన్నడూ లేని విధంగా నిద్ర పోతున్నాడు. ఇంతకు ముందు ఇలా చేయడు కదా. పొద్దు బారెడైనా ఇంకా నిద్రపోవడంపై సందేహాలు వ్యక్తం చేశాడు. చిక్ మంగళూరులో యాక్సిడెంట్ తర్వాత తన భార్య వచ్చి తీసుకెళ్లిందని దీపకు చెప్పడం ట్విస్టుగా మారింది. అయితే డ్రైవర్‌తో సహా చిక్ మంగళూరులో కార్తీక్ దీపకు కనిపించడం.. ఆ తర్వాత మీరు ఎవరు అని దీపను ప్రశ్నించడం సీరియల్‌లో మలుపు తిరిగింది. కార్తీకదీపం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ 1438 లోకి వెళితే..

  మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్

  మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్

  కార్తీక్‌ తనను గుర్తు పట్టకపోవడంతో షాక్‌లో ఉన్న దీపకు చిక్ మంగళూరు డాక్టర్ ఫ్యామిలీ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇంటిని అందంగా ఆలకరించారు. కేక్ తీసుకొచ్చి హ్యాపీ మ్యారేజ్ డే అంటూ విషెస్ తెలిపారు. ప్రత్యేకంగా ఓ వీడియోను కూడా ప్రదర్శించారు. డాక్టర్ కుటుంబం చూపిన ప్రేమను చూసి దీప ఆనందంలో మునిగిపోయింది. కేక్‌ను కట్ చేసి.. ఇంట్లోని పనివాళ్లకు, డాక్టర్ ఫ్యామిలీ మెంబర్స్‌కు తినిపించింది. ఈ సందర్భంగా డాక్టర్ బాబు కమ్ బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

   కార్తీక్‌కు నేనంటే ప్రాణం

  కార్తీక్‌కు నేనంటే ప్రాణం


  తనపై ప్రేమను కురిపిస్తున్న డాక్టర్ కుటుంబానికి ధన్యవాదాలు తెలిపింది. కార్తీక్ లేకుండా నేను ఉండలేను. నన్ను కార్తీక్ విపరీతంగా ప్రేమించే వాడు. నన్ను ఎప్పుడు ఎడమవైపు ఉండమని అడిగే వాడు. ఎడమ వైపే నడవమని చెప్పేవాడు. ఎందుకంటే తన గుండె ఎడమవైపు ఉంది. ఆ స్థానం నీదే అని చెప్పేవాడు అని దీప అంది. అయితే మరీ నీవు కనిపించగానే ఎందుకు గుర్తించలేదంటే.. అదే నాకు తెలియడం లేదు అని సమాధానం చెప్పింది.

  హిమను చెంపదెబ్బ కొట్టిన సౌందర్య

  హిమను చెంపదెబ్బ కొట్టిన సౌందర్య


  అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్న సౌందర్య దంపతులతో హిమ బెట్టు చేసింది. మనమంతా ఇండియాకు వెళ్దాం. శౌర్యను కలుసుకోవాల్సిందే. అమ్మ, నాన్నకు ఇచ్చిన మాటకు కట్టుబడి శౌర్యను తీసుకురావాల్సిందే అని హిమ అంటే.. శౌర్యను బతిమిలాడాం కానీ. అది రానని చెబుతుంటే.. నేను చేయాలి అని సౌందర్య అంది. అయితే శౌర్య మాదరిగానే నేను ఇంటి నుంచి వెళ్లిపోతానని హిమ అంటే.. సౌందర్య లాగి చెంపపై ఒక్కటి కొట్టింది.

  హిమను ఒప్పించిన ఆనందరావు

  హిమను ఒప్పించిన ఆనందరావు


  ఇంట్లో నుంచి వెళ్లిపోతావా? చిన్న పిల్లలన్నీ సహనంతో ఊరుకొంటున్నాను. ఇలా బెట్టు చేస్తావా అని సౌందర్య మందలించింది. అయితే శౌర్య వద్దకు వెళ్లేంత వరకు నేను అన్నం తినను. పచ్చి మంచినీళ్లు కూడా ముట్టను అని హిమ మొండికేసింది. అయితే హిమ మొండితనాన్ని చూసి.. భోజనం చేయకపోతే ఆరోగ్యం పాడవుతుంది. ఇప్పటికే హిమ ఆరోగ్యం బాగాలేదు అని ఆనందరావు.. సరే అని చెప్పాడు. దాంతో హిమ కాస్త శాంతించింది.

   దీపకు ఎదురుపడిన మోనిత

  దీపకు ఎదురుపడిన మోనిత


  కార్తీకదీపం తాజా ప్రోమో మరోసారి ట్విస్టును ఇచ్చింది. కార్తీక్ కోసం వెతుకుతున్న దీప ముఖం ముందు కార్తీక్ ఫోటో ఎవరో పెట్టారు. తీరా ఆ పెట్టిన వ్యక్తి ఎవరని చూడగానే.. ఎదుట మోనిత కనిపించింది. దీపను మోనిత చూసి.. ఇంకా నీవు బతికే ఉన్నావా? అని మోనిత అంటే.. ఆపవే నీ నాటకాలు.. నా భర్తను తీసుకెళ్లింది నీవే కదా అని దీప అంటే.. హాస్పిటల్ నుంచి నేను తీసుకెళ్లడమేమింటి? కార్తీక్ నా వద్ద ఉంటే.. పిచ్చిదానిలా కార్తీక్ ఫోటోను పట్టుకొని తిరుగుతాను. కార్తీక్ కోసం పిచ్చిదాన్ని అయిపోతున్నాను. కార్తీక్‌ను ఎవరు తీసుకెళ్లారు? అని మోనిత చెప్పడంతో దీపకు తల తిరిగినంత పనైంది.

  English summary
  Karthika Deepam 23rd August Episode number 1438.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X