twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam మెడలో కట్టు.. నిరుపమ్ చేతికి తాళి ఇచ్చిన శౌర్య! హిమ ముందు హైడ్రామా!

    |

    సంపన్న కుటుంబంలోకి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆటో నడపటంపై సౌందర్య అభ్యంతరం తెలిపింది. దాంతో నాకు ఆటో నడుపుకోవడం జీవనాధారం. ఆటో నడుపుకోవడం తప్పు కాదు అని శౌర్య అంటే.. కాదు తాతయ్యకు ఒంట్లో బాగా లేదు కదా.. అని సౌందర్య అంటే.. నేను ఏం చేయాలి.. ఇంట్లో ఉన్నారుగా చాలా మంది డాక్టర్లు..అని జ్వాలా సమాధానం ఇచ్చింది. అయితే నీ కోపం తాతయ్య ఆరోగ్యం మీద చూపిస్తున్నావా? నీవు పక్కన ఉండి నాలుగు మంచి మాటలు చెబితే ఆయన సంతోషంగా ఉంటారు అని సౌందర్య అంటే.. సెంటిమెంట్‌తో కొడుతున్నావా? లేదా తాతయ్య మీద ప్రేమ ఉందని ఇలా ఆపుతున్నావో నానమ్మ అని జవాబిస్తూ ఇంటిలోకి వెళ్లింది.

    ఇక వెళ్లిపోదాం పదా అంటూ ప్రేమ్‌తో నిరుపమ్ అంటే.. తాతయ్య ఆరోగ్యం ఇలా ఉంటే వెళ్లిపోతారా అని సౌందర్య అడిగింది. అయితే తాతయ్యకు ఏమీ కాలేదు. మీరు టెన్షన్ పడి.. ఆయనను టెన్షన్ పెట్టవద్దు అని నిరుపమ్ చెప్పేసి ప్రేమ్‌తో కలిసి వెళ్లిపోయాడు. కార్తీకదీపం సీరియల్‌లోని 1413 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

    రేసులో వెనుకబడి ఉన్నాను అంటూ

    రేసులో వెనుకబడి ఉన్నాను అంటూ


    ఇక బ్యాంక్ రికవరీ వాళ్ల నుంచి ఒత్తిడి పెరగడం, నిరుపమ్ పెళ్లి తేదీ సమీపిస్తుండటంతో డాక్టర్ శోభలో కంగారు మరింత పెరిగింది. అమెరికా నుంచి నేను ఎందుకు వచ్చాను. ఏం చేస్తున్నాను. అందరూ తెలివివాళ్లైపోయారు. నేనే ఎందుకు పనికి రాని దానిని అయిపోయాను. నిరుపమ్‌ను పెళ్లి చేసుకోవాలని నేను ఇక్కడికి వస్తే.. నిరుపమ్ వేరే దానిని పెళ్లి చేసుకోవాలనుకొంటే..నేనేమో చూస్తూ ఊరుకొంటున్నాను.

    హిమ, శౌర్య, నిరుపమ్ మధ్య పెళ్లి డ్రామా జోరుగా సాగుతున్నది. ఈ రేసులో నేను వెనుకబడి ఉన్నాను. ఈ విషయంలో నేనేంటో నిరూపించుకోవాలి అని ఆందోళన పడుతుంటే.. ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్‌లో అవతలి వ్యక్తి చెప్పిన విషయాలు విని అలాగే అని సమాధానం ఇచ్చింది.

    నాపై శౌర్య కోపం తగ్గలేదు అని

    నాపై శౌర్య కోపం తగ్గలేదు అని


    కార్తీక్, దీప నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అటు బావ మనసు కరగడం లేదు. శౌర్య కోపం తగ్గడం లేదు. నేను ఏం చేయాలమ్మా.. తన ప్రేమను నేను లాక్కొన్నాని అనుకొంటున్నది. కానీ శౌర్యకు మంచి చేయాలనే చూస్తున్నాను. శౌర్యకు నాపై కోపం ఎందుకు వస్తున్నది. శౌర్య దృష్టిలో నేను చెడ్డదానిగా మిగిలిపోవద్దు. శౌర్య కోసం తాను ఏం చేస్తున్నానో వాస్తవాన్ని చెప్పి చూస్తాను. శౌర్య నమ్మితే నా సగం పని పూర్తి అవుతుంది అని హిమ అంటుండగా.. సడెన్‌గా నిరుపమ్ కనిపించాడు. శౌర్య ఎక్కడున్నది అంటూ ప్రశ్నిస్తే... తన గదిలో ఉంది. ఇప్పుడు శౌర్య ఎందుకు అంటూ సమాధానం చెప్పింది. వచ్చాక చెబుతాను.. అప్పటివరకు ఇక్కడే ఉండు అంటూ శౌర్య గదిలోకి నిరుపమ్ వెళ్లాడు.

    మా కుటుంబం కోసమే పుట్టావు

    మా కుటుంబం కోసమే పుట్టావు


    శౌర్య గదిలోకి నిరుపమ్ వెళ్లడంతో కంగారు పడుతున్న హిమను చూసి సౌందర్య ఎందుకలా ఉన్నావంటే.. నిరుపమ్ గురించి చెప్పింది. దాంతో సౌందర్య కూడా ఆ ఇద్దరి వద్దకు వెళ్లింది. గదిలో రక్తంతో తాను గీసిన నిరుపమ్‌ను చూస్తూ.. నాకు మిగిలింది ఈ మోసమేనా అంటూ శౌర్య ఆందోళన చెందింది. శౌర్యను చూసిన నిరుపమ్.. నీకు ఒక విషయం చెప్పాలి అంటే.. నువ్వు వెళ్లిపో అంటూ హిమ చెప్పింది.

    నీవు వెళ్లిపో అంటే వెళ్లిపోవాలా? నీతో మాట్లాడాలి. శౌర్య.. నీవు ప్రేమించడానికి నాకు తెలియకుండా నేను కారణమయ్యానో అంటే.. జరిగిపోయిన దానికి ఇప్పుడు ఆలోచించడం ఎందుకు? అంటే.. నా చెప్పేది విను.. ఒకప్పుడు నీవు ఏమన్నావు. నీ మనసు చెప్పిందే విను అని చెప్పావు. అందుకే హిమను ధైర్యవంతురాలిని చేశావు. నీవు మా కుటుంబ కోసమే పుట్టావని, నీవు శౌర్యవని తెలియక ముందే చెప్పాను అని అన్నాడు.

    పసుపుతాడు మెడలో కట్టు అని శౌర్య

    పసుపుతాడు మెడలో కట్టు అని శౌర్య

    శౌర్యతో మాట్లాడుతూ.. హిమ అంటే నాకు ప్రేమ. మా అమ్మకు ఇష్టం లేదు. మా అమ్మను ఒప్పించి మా పెళ్లి చేసే బాధ్యత నీదే అని నిరుపమ్ అంటే.. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని హిమ షాకిచ్చింది. దాంతో హిమ ఏం మాట్లాడుతున్నావు అని అంటే.. నిజం మాట్లాడుతున్నాను. నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను. కానీ నీవే వినిపించుకోవడం లేదని నిరుపమ్‌తో హిమ అంటే.. నా మాట వినిపించుకొంటావా అని నిరుపమ్ జవాబిచ్చాడు.

    దాంతో అక్కడి నుంచి శౌర్య వెళ్లిపోయి .. పసుపుతాడు తీసుకొచ్చింది. ఈ పసుపు తాడును హిమ మెడలో కట్టు. చూస్తారేంటి డాక్టర్ సాబ్. దీనిని మెడలో కట్టండి అని శౌర్య అంటే.. దీనిని తీసుకొని హిమ మెడలో కట్టండి అంటూ శౌర్య చెప్పింది.

    నంగనాచి మాటలు వద్దు హిమ

    నంగనాచి మాటలు వద్దు హిమ

    శౌర్య చేసిన పనికి ఏం చేయాలో తెలియక నిరుపమ్ ఉంటే.. మీరు అమర ప్రేమికులు. మీరు ఆడే డ్రామా చూసి విసిగిపోయాను. ఒకరు ప్రేమ అంటారు. ఒకరు ఇష్టం లేదంటారు. ఏం జరుగుతున్నది. తాళిని మీరు హిమ మెడలో కట్టండి. దాంతో ఈ నాటకానికి తెరపడుతుంది డాక్టర్ సాబ్ అని అంటే.. తాళిని తన చేతిలో తీసుకొని ముందుకు కదిలితే.. బావా ఆగు అని హిమ అరిచింది. దాంతో ఎందుకు ఆపాలి.. ఇకనైన ఆపు నీ నంగనాచి మాటలు. అసలు నీకు ఏ ద్రోహం చేశాను. నా జీవితంతో ఆటలు ఆడుతున్నావు. నేను ఎప్పుడైనా అడ్డు వచ్చావా? ఇక ముందు అడ్డు వస్తానని డౌటా? మీరు తెలివైన వాళ్లు.. నేను తెలివి తక్కువ దానిని అని శౌర్య ఘాటుగా స్పందించింది.

    మన పెళ్లిని ఎవరు అడ్డుకోలేరు.. నిరుపమ్

    మన పెళ్లిని ఎవరు అడ్డుకోలేరు.. నిరుపమ్


    శౌర్య ఇచ్చిన పసుపు తాడును చూస్తూ.. హిమ నీకో విషయం చెప్పాలి. మన మధ్య ఎలాంటి సంఘటనలు జరిగినా నా ప్రేమలో మార్పు ఉండదు. నిన్నే పెళ్లి చేసుకొంటాను. చచ్చే వరకు నీతోనే ఉంటాను. క్యాన్సర్ అని చెప్పినా నా మనసు మారదు. నీవేమి చేసినా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. ఇది ఫిక్స్. గుర్తుపెట్టుకో. ఈ పెళ్లి జరుగుతుంది.

    ఎవరు అడ్డుకోలేరు. దీనికి అమ్మమ్మ, తాతయ్య సపోర్ట్ చేస్తున్నారు. అయినా నీవు ఎందుకు బెట్టు చేస్తున్నావు. ఏదో జరిగి నీవు డిస్ట్రబ్ అయ్యావు. కానీ నేను డిస్ట్రబ్ కాలేదు. మన పెళ్లి జరుగుతుంది అని నిరుపమ్ అంటే.. కాదు బావా అని ఏదో చెప్పబోయింది. అయితే నిరుపమ్ ఇంత చెప్పినా ఎందుకు వినడం లేదు. దేవుడు ఇచ్చిన బావను వదిలేసి.. శౌర్యతో పెళ్లి చేస్తానని అంటున్నావు హిమ అని తాత, నానమ్మ నిలదీశారు. ఇదిలా ఉంటే.. నీకు మరో అవకాశం ఇస్తాను అంటూ నిరుపమ్ ఎదో చెప్పడానికి ప్రయత్నించాడు.

    కార్తీకదీపం 25వ తేదీ ప్రోమో

    కార్తీకదీపం 25వ తేదీ ప్రోమో


    కార్తీకదీపం ప్రోమోలో శౌర్యకు జడవేస్తూ నీకు ఏమైనా కోరికలు ఉన్నాయో చెప్పు. నానమ్మగా నేను తీరుస్తాను అంటూ సౌందర్య అడిగింది. దాంతో ఈ ఇంట్లో చాలా నాటకాలు జరుగుతున్నాయి. వాటిని ఆపమని చెప్పు నానమ్మ అంటూ శౌర్య అడిగింది. అంతలోనే హిమ చేయిపట్టుకొని నిరుపమ్ లాక్కొస్తూ.. అమ్మమ్మ.. నేను కొన్నాళ్లు ఇక్కడే ఉంటాను అని నిరుపమ్ చెబితే.. నానమ్మ.. ఈ నాటకాలు ఆపు అంటూ శౌర్య చెప్పింది. దాంతో ఏం హిమ.. నేను ఇక్కడ ఉండటం ఇష్టం లేదా అంటూ నిరుపమ్ చెప్పడం ఈ సీరియల్‌ మరో మలుపు తిరిగేలా కనిపిస్తున్నది.

    English summary
    Karthika Deepam July 18th Episode number 1413.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X