twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam శౌర్య ఆచూకిని పట్టేసిన సౌందర్య.. కానీ నానమ్మకు మనవరాలి షాక్!

    |

    శౌర్య ఆచూకీ తెలిసినప్పటి నుంచి హిమ ప్రపంచమే మారిపోయింది. ఎప్పుడూ హిమను కలిసేందుకు ఆసక్తిని చూపుతూ ఆనందంతో జీవితాన్ని గడుపుతున్నది. శౌర్య కనిపించనప్పటి నా లోకం, నా ప్రపంచం మారిపోయింది. ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. నేనే హిమ అని తెలిస్తే ఎలా ఫీలవుతుందో అని అనుకొంటుండగానే.. శౌర్య ఆటోలో వచ్చింది. ఇక్కడకు ఎందుకు రమ్మన్నావు అంటే.. నిన్ను కలువాలని అనిపించించింది. అందుకే పిలిచాను అని హిమ అంటే.. నీవు డాక్టర్.. ఇక్కడ నీవు ఉంటే.. హాస్పిటల్ ఏమై పోవాలి అని శౌర్య అంటే.. హాస్పిటల్‌లో మీ డాక్టర్ సాబ్ ఉన్నాడు కదా.. అనగానే.. శౌర్య ఆలోచనల్లో పడి ముఖంపై చిరునవ్వు తెచ్చుకొన్నది. అయితే హిమ అన్నమాటలను విని.. మరోసారి చెప్పు అంటే.. నేను బయటకు వస్తే.. మీ డాక్టర్ సాబ్ ఉన్నాడు కదా.. అని హిమ చెప్పింది. మీ డాక్టర్ సాబ్ అనే మాట చాలా హ్యాపీగా ఉంది అని శైర్య అంది. కార్తీకదీపం సీరియల్‌లో 1332 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

    మమ్మీకి నీకు గొడవేంటి? అంటూ నిరుపమ్

    మమ్మీకి నీకు గొడవేంటి? అంటూ నిరుపమ్

    తన తల్లితో వెళ్తుండగా కారు చెడిపోవడం.. మరో వాహనంలో తండ్రి అక్కడకు రావడం జరిగింది. అయితే డాక్టర్ నిరుపమ్‌ను చూసిన తండ్రి.. నిరుపమ్ రా.. నేను డ్రాప్ చేస్తాను అంటూ పిలిస్తే.. భార్య మాత్రం.. నేను ఎవరో కారును ఎక్కను అంటూ మొండికేసింది. దాంతో తండ్రి కారులో నిరుపమ్ ఎక్కడి తన ఇంటి వద్ద దిగాడు. అయితే కారు దిగిన వెంటనే.. మిమ్మల్ని ఒక మాట అడగాలా? అంటూ నిరుపమ్ ప్రశ్నించాడు. మమ్మి మిమ్మల్ని అలా అనడం బాధగానే ఉంది. మమ్మికి నీకు గొడవేంటి డాడీ? మీరు ఒక చోట.. నేను ఒక చోట ఉంటే.. బాధగా ఉంటుంది. మమ్మీకి మీ మీద ఎందుకంత కోపం.. అంత కోపం రావడానికి బలమైన కారణం ఏమిటి అని నిరుపమ్ అడిగితే.. సందర్భం వచ్చినప్పడు నేను చెబుతాను అంటూ సత్యం వెళ్లిపోయాడు.

    ప్రేమతోనే బంధించగలం అంటూ

    ప్రేమతోనే బంధించగలం అంటూ

    స్వప్న కోపంతో ఇంటికి సోఫాలో కూర్చున్నది. డాడీ నేను ఇంత కోపంతో ఉంటే.. మీరు పట్టనట్టు ఉండటం ఏమిటి? అని స్వప్న అంటే.. నీ కోపం ఎవరిపైనా అని తండ్రి ఆనందరావు అడిగాడు. దాంతో అందరిపై నాకు కోపం అని స్వప్న అంటే.. అయితే నీదే తప్పు అయి ఉంటుంది అని ఆనందరావు అన్నాడు. చెప్పేది వినకుండానే తప్పుఒప్పులను నిర్ణయిస్తారేమిటి? అని స్వప్న కోపంగా అరిచింది. మీరు మీ అల్లుడికి దగ్గరవుతున్నారు అని స్వప్న అంటే.. కాదు నీకు దూరం అవుతున్నాను. కొందరిని చిరకాలం ప్రేమతోనే బంధించగలం. ఆ విషయం నీకు అర్ధం కావడం లేదు అని ఆనందరావు అంటే.. నీ ఆవిడ.. నా ఇద్దరి కొడుకుల మనసులను మార్చేస్తున్నది అని స్వప్న చెప్పింది.. నీ వద్ద ప్రూఫ్స్ ఉన్నాయా అని ప్రశ్నించాడు. ఎప్పుడో ఏదో అంటే.. తల్లిని ద్వేషించడం సరికాదు కదా అని ఆనందరావు అన్నాడు.

    నా భార్య కుట్ర అంటూ స్వప్న

    నా భార్య కుట్ర అంటూ స్వప్న

    ఆనందరావు ప్రశ్నలకు ఆవేదన వ్యక్తం చేస్తూ.. నా కూతురును నీ భార్య ఎలాంటి మాటలు అన్నదో తెలుసా? నా తల్లి మాటలకు నా కూతురు ఎలా మానసికంగా చెదిరిపోయింది. తను ఒక డిప్రెషన్‌లో బతుకుతున్నది. ఆమె చేసిన పనికి నా కూతురు చిత్రవధ అనుభవిస్తున్నది. పైగా నా కోడుకుల మనసులను మార్చేస్తున్నది. ఇందంతా కుట్ర ప్రకారమే నీ భార్య చేస్తున్నది. నీ భార్య గురించి నేను ఎలాంటి నిర్ణయం తీసుకొన్నా నీవు బాధపడకూడదు అంటూ స్వప్న వార్నింగ్ ఇచ్చింది.

    యాక్సిడెంట్‌కు గురైన ముసలావిడను

    యాక్సిడెంట్‌కు గురైన ముసలావిడను

    తన చేతిపై హిమ పేరుతో ఉన్న పచ్చబొట్టును చూసి శౌర్య ఎమోషనల్ అయింది. అందరూ నా గురించి మరిచిపోయి ఉంటారు. నన్ను పట్టించుకోకుండా ఉండి ఉంటారు అని శౌర్య ఆవేదన చెందింది. అంతలోనే సౌందర్య అటువైపుగా వచ్చింది. అయితే నాన్నమ్మ కారు వెనుకే శౌర్య ఆటోలో వెళ్తుంటే.. ఓ ముసలావిడ యాక్సిడెంట్‌కు గురై రోడ్డుపై పడి ఉంది. ఆమెను ఆటోలో ఎక్కించుకొని వెళ్తుండగా.. నీళ్లు తాగించమని ముసలావిడ అడిగింది. దాంతో ఓ అబ్బాయి నీళ్ల బాటిల్‌తో కనిపించగా పరుగున వెళ్లి బాటిల్ తెచ్చి నీళ్లు తాగించేందుకు ప్రయత్నించింది. బాటిల్ తీసుకొస్తుండగా.. సౌందర్యను తాకడం తన చేతిలో బాటిల్‌లోని నీళ్లు ఆమెపై పడటంతో కోపంతో ఊగిపోయింది.

    శౌర్యను చెంపపై లాగి కొట్టిన సౌందర్య

    శౌర్యను చెంపపై లాగి కొట్టిన సౌందర్య

    తన ఎదురుగా ఉన్న వ్యక్తిపై నీళ్లు పడ్డాయని చూడగానే.. ఎదుట తన నానమ్మ కనిపించింది. నాన్నమ్మ అంటూ మనసులో అనుకొంటుండగా.. తనపై నీళ్లు పోసిన శౌర్యను చెంపపై లాగిపెట్టి కొట్టింది. తనను కొట్టిన నానమ్మను చూస్తూ చిన్ననాటి గుర్తులను తలచుకొన్నది. అయితే శౌర్యను కోపగించుకొంటూ.. చూసుకోలేవా? డాక్యుమెంట్లు ఎంత విలువైనవో తెలుసా? అంటూ చెడామడా తిట్టేసింది. కిందపడిన పేపర్లు తీసుకొని.. రోడ్డు మీద పరుగులు ఏమిటి? కనీసం బుద్ది ఉందా?.. ఏంటి మిడిగుడ్లు వేసుకొని చూస్తున్నావు అంటూ తిట్టి వెళ్లిపోయింది.

    అయ్యో శౌర్యను ఎందుకు కొట్టానే?

    అయ్యో శౌర్యను ఎందుకు కొట్టానే?

    నానమ్మ ఇక్కడే ఉందంటే.. అందరూ ఇక్కడే ఉండి ఉంటారు. నానమ్మ కారు వెనుకే వెళ్లి అడ్రస్ కనుకొందామని అనుకొంటే.. ముసలావిడ ప్రాణాలకు ప్రమాదం ఉంది.. అయ్యో దేవుడా.. అవకాశం ఇలా ఇచ్చి.. ఇలా ఇరికించావు అంటూ శౌర్య అనుకొన్నది. నాపై వారికి లేని ప్రేమ.. నాకెందుకు అని అనుకొంటుండగా.. సౌందర్య కారు పక్కనే ఆపి.. అయ్యో ముసలావిడకు సాయం చేద్దామని పరుగుపెట్టిందా? అయ్యో అనవసరంగా చేయి చేసుకొన్నాను. ఏంటి.. ఒకరిని కొట్టి ఇలా బాధపడుతున్నాను ఏంటి అని సౌందర్య అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే ఆటోను స్టార్ట్ చేస్తూ.. హిమ నీవు ఇక్కడే ఉన్నావా? అయినా నేను వదిలే ప్రస్తక్తి లేదు అని శౌర్య.. ఆటోలో ముసలావిడను హాస్పిటల్‌కు తీసుకెళ్లింది.

    ముసలావిడకు నిరుపమ్, హిమ చికిత్స

    ముసలావిడకు నిరుపమ్, హిమ చికిత్స

    అయితే గాయపడిన ముసలావిడను హాస్పిటల్‌కు తీసుకొచ్చి.. నిరుపమ్, హిమకు అప్పగించి వైద్యం చేయమని చెప్పింది. అయితే ముసలావిడను చూసి.. మోనిత ఇంటి సంరక్షరాలిగా గుర్తు పట్టింది. ఒకవేళ నన్ను గుర్తుపడితే.. శౌర్యకు చెబుతుందేమోనని భయపడింది. ఈ క్రమంలో నిరుపమ్ రాగానే.. ముసలావిడ బాగానే ఉందా? అని శౌర్య అడిగితే.. ఎందుకులా భయపడుతావు అని నిరుపమ్ అడిగితే.. యాక్సిడెంట్ అంటే నాకు భయం.. ఒక యాక్సిడెంట్ జరిగితే ప్రాణం పోవడమే కాదు.. కొన్ని జీవితాలు రోడ్డున పడుతాయి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

    శౌర్యను గుర్తించిన సౌందర్య

    శౌర్యను గుర్తించిన సౌందర్య

    కార్తీకదీపం తాజా ప్రోమో మరింత ఆసక్తిని పెంచింది. హిమ, శౌర్య ఇద్దరు మాట్లాడుకొంటుంటే.. అక్కడికి సౌందర్య వచ్చింది. నానమ్మ, తాతయ్య ఏంటి? సడెన్‌గా వచ్చారంటి? అని శౌర్య అనుకొంటుండగా.. ఆ రోజు బైక్ మీద వెళ్లింది నీవే కదా.. అసలు నీవు ఎవరే అంటూ సౌందర్య నిలదీసింది. దాంతో శౌర్య చేతిపై ఉన్న పచ్చబొట్టు చూపించి.. జ్వాలానే మన శౌర్య నానమ్మ అంటూ హిమ అసలు విషయం చెప్పింది. దాంతో నువ్వేనా మా శౌర్యవు అంటూ ప్రేమను వ్యక్తం చేసింది. దాంతో ఆపండి మీ నాటకాలు అంటూ శౌర్య కోపగించుకొన్నది.

    కార్తీకదీపం రేటింగ్‌పై ఐపీఎల్ దెబ్బ

    కార్తీకదీపం రేటింగ్‌పై ఐపీఎల్ దెబ్బ


    ఇక కార్తీకదీపం సీరియల్ విషయానికి వస్తే.. కొద్ది వారాలుగా రేటింగ్ పడిపోతు కనిపిస్తున్నది. చాలా కాలం 13 రేటింగ్ పైనే ఉండే ఈ సీరియల్ గత రెండువారాలుగా 11 స్థాయికి పడిపోయింది. ప్రస్తుత ఏడాది 14వ వారంలో అర్బన్ ప్రాంతంలో 12.52 రేటింగ్ నమోదు చేసుకోగా.. 15వ వారంలో 11.89 రేటింగ్‌ను సాధించింది. ఇక రూరల్ ప్రాంతంలో 14వ వారంలో 12.52 రేటింగ్ నమోదు కాగా.. 15వ వారం 12.18 రేటింగ్‌ను నమోదు చేసింది. అయితే రేటింగ్ క్షీణించడానికి ప్రధాన కారణం ఐపీఎల్ టోర్ని అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

    English summary
    Karthika Deepam April 21st Episode number 1332.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X