For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam మోనిత ఆటకట్టు.. తుపాకి ఎక్కుపెట్టిన సౌందర్య.. ఏం జరిగిందంటే?

  |

  శౌర్యను వెతికేందుకు సౌందర్య, ఆనందరావు బయలుదేరారు. సౌందర్యతో మాట్లాడుతూ.. కార్తీక్, దీప ఇద్దరు ప్రాణాలతో లేరా? అంటే.. ఇంద్రుడు కనిపించి పరారయ్యాడు. అయితే నాకు భయపడే కాకుండా.. కార్తీక్, దీపకు భయపడే శౌర్యను వేరే చోటికి తీసుకెళ్లి ఉంటాడు అని సౌందర్య అంటే.. అమ్మ, నాన్న బతికే ఉన్నారా? అని హిమ అంటే.. అది మన అదృష్టం అని సౌందర్య సమాధానం ఇచ్చింది.

  అయితే నాకు అమ్మ, నాన్న బతికే ఉన్నారని అనిపిస్తున్నది. అందుకే శౌర్య పట్టుబట్టి ఇక్కడే ఉందని నాకు అనిపిస్తున్నది అని హిమ చెప్పింది. అయితే మోనితపై దండయాత్ర చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని సౌందర్య చెప్పింది. కార్తీకదీపం సీరియల్ 1523 ఎపిసోడ్‌లో ఇంకా ఏమైందంటే?

  నా భార్యకు నావల్ల చాలా కష్టాలు

  నా భార్యకు నావల్ల చాలా కష్టాలు

  రోడ్డు పక్కన పడి ఉన్న దీపను తీసుకొచ్చి హాస్పిటల్‌లో కార్తీక్ చేర్పించాడు. బెడ్‌పై ఉన్న దీపను చూస్తూ.. నీకు ఇంకా ఎన్ని కష్టాలు.. నా వల్లే నీకు పదేళ్లుగా కష్టాలు వస్తున్నాయి అని కంటతడి పెట్టుకొంటుంటే.. కార్తీక్ వద్దకు డాక్టర్ వచ్చి.. అంతా ఓకేనా అని అడిగింది. దాంతో ఆపరేషన్ కోసం అంతా సిద్దమైనా అని కార్తీక్ అంటే.. లేదు.. రెండు రోజులు ఆగాల్సిందే. ఎందుకంటే.. సర్జరీ చేసేది నువ్వే.. నీ మానసిక పరిస్థితి బాగాలేదు అని డాక్టర్ అంటే...అవును.. నా భార్యకు నావల్ల చాలా కష్టాలు.. అందుకే ఇలా మానసికంగా నేను మానసికంగా కుంగిపోయాను అని కార్తీక్ అన్నాడు.

  దాంతో నీలాంటి భర్త దొరకడం దీప అదృష్టం.. ఆమెను చూస్తే నాకు ఈర్ష్యగా ఉంది అని డాక్టర్ అన్నారు. దాంతో డాక్టర్‌కు తెలియదు.. నావల్ల, మోనిత వల్లే నీకు ఈ కష్టాలు.. ఇక మోనిత రాక్షసి వల్ల ఎలాంటి కష్టం రాకుండా చూసుకొంటాను అని కార్తీక్ అన్నాడు.

  శివలతకు మోనిత ఫోన్

  శివలతకు మోనిత ఫోన్

  కార్తీక్, దీప ఇద్దరు కనిపించకపోవడంతో మోనిత అసహనంతో ఊగిపోయింది. కార్తీక్, దీప ఎక్కడికి వెళ్లి ఉంటారు? కార్తీక్‌కు గతం గుర్తుకు వచ్చిందా? అయితే శౌర్య ఇక్కడే ఉంది కదా.. మరీ వాళ్లిద్దరు ఎక్కడికి వెళ్లారు. గతం గుర్తుకు వస్తే.. కనీసం చెంపదెబ్బ కొట్టేవాడు. ఇక నాకేం పని అని వదిలేసి వెళ్లిపోయాడా? అయినా నేను వదిలేది లేదు. హైదరాబాద్‌కు వెళ్లి కార్తీక్‌ను తీసుకొస్తానని శివలతకు మోనిత ఫోన్ చేసింది.

  నేను హైదరాబాద్‌కు వెళ్తున్నాను. వంటలక్కను తీసుకొని కార్తీక్ హైదరాబాద్‌కు వెళ్లిపోయాడు. అతడిని తీసుకొస్తాను. బోటిక్ అమ్మేస్తున్నా.. లేదా నువ్వే తీసుకొని నడిపించుకో అని అంటే.. కార్తీక్, దీప కచ్చితంగా హైదరాబాద్‌కు వెళ్లారా? నాలుగు రోజులు ఆగితే.. వాళ్లే తిరిగి వస్తారు అని శివలత చెబితే.. నాలుగు రోజులు కాదు..నాలుగు సెకన్లు కనిపించకపోతే.. వారిని చంపేస్తాను అని మోనిత అంది.

  మోనితకు సౌందర్య అడ్డు

  మోనితకు సౌందర్య అడ్డు

  అయితే కార్తీక్, దీపను హైదరాబాద్‌లో వెతికేందుకు బయలు దేరిన మోనితకు సౌందర్య అడ్డుపడింది. ఎవరిని చంపుతావే అని సౌందర్య అంటే.. డ్రస్ మెటీరియల్ తీసుకెళ్లి డబ్బులు ఇవ్వలేదు. అందుకే వాళ్లను చంపేస్తానని అన్నాను అని మోనిత అంటే.. ఇక చాలూ.. కొద్ది రోజుల క్రితం వస్తే నా తలపై కొట్టావు.. ఇంట్లో ఏమున్నది అంటూ ఇళ్లంతా చూసింది. నాకు తెలియనిది ఏదో ఉంది.. నన్ను ఎందుకు చంపాలని చూశావు అని సౌందర్య నిలదీస్తే.. ఆమెను తొసేసి గదిలోకి వెళ్లింది..చేతిలో తుపాకీని సౌందర్య తలకు ఎక్కు పెట్టింది.

   పిచ్చి వేస్తాలు వేస్తే కాల్చిపడేస్తాను

  పిచ్చి వేస్తాలు వేస్తే కాల్చిపడేస్తాను

  కార్తీక్, దీప వేధిస్తున్నానా? వారిద్దరూ లేరు.. నా బతుకేదో నేను బతుకుతున్నాను. మళ్లీ నాకు ఈ అవమానాలు, అనుమానాలు భరించలేకే నీ తలపై కొట్టాను. నా లైఫ్‌లో కలుగజేసుకోవద్ద. మీ లైఫ్‌లో కలుగజేసుకొను. కోపం తప్పిస్తే కాల్చిపడేస్తాను అని మోనిత బెదిరించగానే.. ఒడుపుగా మోనిత చేతి నుంచి సౌందర్య పిస్టల్ లాగేసుకొన్నది. పిచ్చి వేస్తాలు వేస్తే కాల్చిపడేస్తాను.

  బ్యాగ్ తీసుకొని నాతో రా.. అంటూ కారులో బలవంతంగా ఎక్కించుకొని సౌందర్య తీసుకెళ్లింది. ఇదిలా ఉండగా, దీపను రోడ్డుపక్కన పడి ఉండటం చూసి కూడా వదిలేసి రావడంపై పశ్చత్తాపపడ్డారు. ఎంతో డబ్బు ఉన్న వ్యక్తి మాకు సహాయం చేసింది. అలాంటి వారి బిడ్డను ఇవ్వకుండా ఉండటం సరికాదు.. శౌర్యను కార్తీక్, దీపకు ఇద్దామని ఇంద్రుడు ఫ్యామిలీ డిసైడ్ అయ్యారు.

  English summary
  Karthika Deepam November 30th Episode number 1523.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X