For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam శౌర్య ఆచూకీ తెలుసుకొన్న వంటలక్క, డాక్టర్ బాబు.. కానీ మరో ట్విస్టు అలా!

  |

  శౌర్యను ఇంద్రుడు కుటుంబం దాచి పెట్టిందనే అనుమానంతో కార్తీక్ దీప వెతకడం మొదలుపెట్టారు. ఇంద్రుడు ఇంటికి వెళ్లి చూద్దాం అంటూ ఇద్దరు బయలు దేరారు. అదే సమయంలో శౌర్యను కారులో ఎక్కించుకొని వెళ్లిన ఆనందరావును ఇంద్రుడు వెంబడిస్తూ కనిపించాడు. జ్వాలాను పెద్ద మనిషి ఎక్కడికి తీసుకెళ్లి ఉంటాడు అంటూ కారు కోసం వెంటపడ్డాడు. కార్తీకదీపం సీరియల్‌లో తాజా ఎపిసోడ్ 1503 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

  తనను కారులో తీసుకెళ్తున్న సమయంలో తాత ఆనందరావు, సొదరి హిమతో వెళ్లడానికి శౌర్య నిరాకరించింది. తాతయ్య నాకు హైదరాబాద్‌కు రావడం ఇష్టం లేదు. నేను బాబాయ్ వద్దే ఉంటానని మొండికేసింది. వేగంగా వెళ్తున్న కారులో నుంచి దిగడానికి ప్రయత్నించడంతో ఆనందరావు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే ఆనందరావు వెనుక ఫాలో అవుతున్న ఇంద్రుడు కారును దీప గుర్తించింది. అయితే తమ కారును ఫాలో అవుతున్న బాబాయ్ ఇంద్రుడిని చూసి.. బాబాయ్ అంటూ అరిచింది. ఆ అరుపులను దీప.. విని.. వెంటనే శౌర్య కారులో ఉందని పరుగులు పెట్టింది. కార్తీక్, దీప ఇద్దరు కారును వెంబడిస్తూ పరుగులు పెట్టారు. అయితే కారును ఆటోలో వచ్చి ఇంద్రుడు అడ్డగించడంతో శౌర్య దిగేసి.. ఇంద్రుడిని కౌగిలించుకొన్నది.

   Big Twist in November 7th Episode number 1503 in Karthika Deepam serial: Karthik and Deepa found shourya photo

  అయితే తనను వదిలిపెట్టకపోతే నా మీదే ఒట్టే.. నా గురించి వెతికితే.. నేను ఇక మీకు కనిపించను. అంతా హిమ వల్లే.. అమ్మ, నాన్న యాక్సిడెంట్ కారణం నువ్వే. అమ్మ, నాన్న కనిపించిన తర్వాతే ఇంటికి వస్తాను అని తాతయ్యకు స్పష్టం చేసింది. అంతవరకు నేను మీకు కనిపించను. మీరు మళ్లీ ప్రయత్నిస్తే.. మీకు దక్కను అంటూ ఇంద్రుడితో కలిసి వెళ్లింది.

  జ్వాలా అలియాస్ శౌర్య, ఇంద్రుడితో వెళ్తూ.. మళ్లీ తాతయ్య వస్తాడు. ఈసారి నాన్నమ్మతో వచ్చి.. నా కాళ్లు, చేతులు కట్టేసి తీసుకెళ్తారు అని అంది. అయితే ఈ ఊరి నుంచి వెళ్లిపోదామా అని ఇంద్రుడు అంటే.. అమ్మ, నాన్న ఇక్కడే ఉన్నారు అని జ్వాలా అంది. అమ్మా నాన్న ఇక్కడ లేరు. ఉంటే మేము వెంటనే వాళ్ల వద్దకు పంపించేవాళ్లం కదా అని అన్నారు. ఇక్కడ ఉంటే.. ఆనందరావు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు. అందుకే సంగారెడ్డికి వెళ్లి వెతుకుదాం అని ఇంద్రుడు అంటే.. సరే.. సంగారెడ్డికి వెళ్లి వెతుకుదాం అని అన్నారు.

  ఇక వంటలక్క ఇంటికి వెళ్తే.. తాళం వేసి ఉండటంతో మోనిత అసహనానికి గురైంది. ఇంత రాత్రి ఎక్కడికి వెళ్లి ఉంటారు అని మనసులో అనుకొన్నది. నీ బాధ వల్ల లేచిపోయారు అంటూ దుర్గ అన్నాడు. దాంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడకు.. భార్యభర్తలు లేచిపోతారా అంటే.. నీవల్ల చరిత్రలో అలాంటి పని జరిగింది అని అంటే.. వేస్టుగా మాట్లాడకు.. వాళ్లు ఎక్కడికి వెళ్లారో చెప్పు అంటే.. డాక్టర్ బాబుకు గతం గుర్తుకు వచ్చిందంటూ దుర్గ చెబితే.. ఏం మాట్లాడుతున్నావు.. గతం గుర్తుకు రావడం ఏమిటి అని కంగారు పడింది.

  ఇక ఇంద్రుడు ఇంటికి వెళ్లిన కార్తీక్, దీపకు తాళం వేసిన ఇళ్లు కనిపించింది. తాళం వేసి ఉంటే.. ఇళ్లు ఖాళీ చేసినట్టేనా? అంటూ పక్కనే ఉన్న వ్యక్తిని అడిగితే.. ఇప్పుడే ఆటోలో వెళ్లారు అని సమాధానం చెప్పారు. ఇక్కడే ఉంటే.. కలువలేకపోతున్నాం. ఊరి విడిచి వెళితే.. ఇంకా కష్టం అని దీప చెప్పింది.

  తాజా ప్రోమోలో మరోసారి ఇంద్రుడి ఇంటికి వెళ్లిన కార్తీక్, దీపకు టులెట్ బోర్డు కనిపించింది. ఇంటిలో వెతుకుతుండగా.. ఇంద్రుడు, చంద్రమ్మ, శౌర్య ఫోటో కనిపించింది. అది చూసిన వంటలక్క.. డాక్టర్ బాబు అంటూ అరిచింది. దీప చేతితో ఉన్న ఫోటో చూసి కార్తీక్ షాక్ తిన్నాడు.

  English summary
  Karthika Deepam November 7th Episode number 1503.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X