»   »  ‘బిగ్ బాస్ 11’ అపశృతి: ఇన్‌ఆర్బిట్ మాల్‌లో నటి జుట్టుపట్టి లాగిన ఫ్యాన్స్!

‘బిగ్ బాస్ 11’ అపశృతి: ఇన్‌ఆర్బిట్ మాల్‌లో నటి జుట్టుపట్టి లాగిన ఫ్యాన్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హిందీలో ప్రస్తుతం 'బిగ్ బాస్' 11వ సీజన్ రన్ అవుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ షోను హోస్ట్ చేస్తున్నారు. ఈ షోలో పాల్గొన్న వారికి బిగ్ బాస్ ఎప్పటికప్పుడు కొత్త పరీక్షలు పెట్టడం తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ పెట్టిన ఓ పరీక్ష వికటించింది. దీంతో బిగ్ బాస్ పోటీ దారుల్లో ఒకరైన నటి హీనా ఖాన్‌కు చేదు అనుభవం ఎదురైంది.

 బిగ్ బాస్ పెట్టిన పరీక్ష ఏమిటి?

బిగ్ బాస్ పెట్టిన పరీక్ష ఏమిటి?

బిగ్ బాస్ 11షోలో ఈ వారం హీనా ఖాన్, శిల్పా షిండే, వికాస్ గుప్తా, లవ్ త్యాగి ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు. నామినేషన్ నుండి బయట పడేందుకు బిగ్ బాస్ వీరికి సరికొత్త పరీక్ష పెట్టారు. ఈ నలుగురూ ముంబైలోని ఇన్ ఆర్బిట్ మాల్‌కు వెళ్లాలని, అక్కడ లైవ్ ఆడియన్స్ ఎవరు బిగ్ బాస్ షోలో కొనసాగాలనేది నిర్ణయించేలా ప్లాన్ చేశారు.

జైలు లాంటి గదిలో ఉంచి...

జైలు లాంటి గదిలో ఉంచి...

ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన ఈ నలుగురినీ ఇన్ ఆర్బిట్‌మాల్‌లో జైలు లాంటి గదిలో ఉంచారు. బిగ్ బాస్ పోటీదారులను చూసేందుకు మాల్‌కు అభిమానులు పోటెత్తారు. ఎంతలా అంటే సెక్యూరిటీ సిబ్బంది సైతం కంట్రోల్ చేయలేనంత వచ్చారు.

హీనా ఖాన్ జుట్టు లాగారు

భారీగా బిగ్ బాస్ అభిమానులు పోటెత్తడంతో ఇన్ ఆర్బిట్ మాల్ లో గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఓ అభిమాని హీనా ఖాన్ జుట్టుపట్టి లాగారు. అయితే వెంటనే మరో పోటీ దారుడు వికాస్ గుప్తా ఆమెను కాపాడారు.

శిల్పా షిండే మద్దతు దారుడు

హీనా ఖాన్ జుట్టు పట్టి లాగిన వ్యక్తి చేతిలో శిల్పా షిండేను సపోర్టు చేస్తున్న పోస్టర్ ఉండటం గమనార్హం. అతడు కావాలనే హీనా ఖాన్ మీద కోపంతో ఇలా చేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

15 నిమిషాల్లోనే అక్కడి నుండి తరలింపు

తాము ఊహించిన దానికంటే ఎక్కువ మంది బిగ్ బాస్ అభిమానులు రావడం, సెక్యూరిటీ ఇష్యూ ఏర్పడే అవకాశం ఉండటంతో వెంటనే బిగ్ బాస్ పోటీ దారులను అక్కడి నుండి 15 నిమిషాల్లోనే తరలించేశారు.

English summary
Last evening Bigg Boss 11's nominated contestants Hina Khan, Shilpa Shinde, Vikas Gupta and Luv Tyagi stepped out of the BB 11 house to make a vote appeal in Mumbai's Inorbit mall.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X