»   » దారుణంగా పడిపోయిన బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్స్!

దారుణంగా పడిపోయిన బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్స్!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న టీవీ రియాల్టీ షో బిగ్ బాస్ 12 ఇటీవల ప్రారంభమై ఓపెనింగ్ వీకెండ్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అయితే ఈ షో ఇండియన్ ఐడల్ 10 టీఆర్పీ రేటింగ్స్‌ను దాటడంలో ఫెయిల్ అయింది. మరో వైపు రెండో వారంలో బిగ్ బాస్ 12 రేటింగ్స్ దారుణంగా పడిపోయి. టాప్ 20 హిందీ పోగ్రామ్స్ లిస్టులో కూడా స్థానం దక్కించుకోలేక పోయింది. దీంతో సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ఈ షో సత్తా తగ్గిందా? అనే చర్చ మొదలైంది.

  జలోటాకు దిమ్మతిరిగే షాక్.. జస్లీన్‌తో బ్రేకప్.. అలా చేస్తుందా.. రాత్రంతా నిద్రపట్టలేదు!

   ఓపెనింగ్ వీకెండ్ అదరగొట్టింది

  ఓపెనింగ్ వీకెండ్ అదరగొట్టింది

  హిందీ వెర్షన్ గత 11 సీజన్లు విజయవంతంగా రన్ అవ్వడంతో బిగ్ బాస్ 12 సీజన్ సెప్టెంబర్ 16న మొదలైంది. ఓపెనింగ్ వీకెండ్ ఫెంటాస్టిక్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. 74 లక్షలకుపైగా ఇంప్రెషన్స్ సొంతం చేసుకుంది. అంతే కాకుండా టాప్ 20 హిందీ కార్యక్రమాల లిస్టులో 13వ స్థానం దక్కించుకుంది. అదే సమయంలో ఇండియన్ ఐడల్ 10 కార్యక్రమం 12వ స్థానంలో నిలవడంతో పాటు 76 లక్షల ఇంప్రెషన్స్ సొంతం చేసుకుంది.

  సెకండ్ వీక్ నుండి డీలా..

  సెకండ్ వీక్ నుండి డీలా..

  అయితే సెకండ్ వీక్ బిగ్ బాస్ 12 రేటింగ్ దారుణంగా పడిపోయింది. కేవలం 47 లక్షల ఇంప్రెషన్స్ మాత్రమే వచ్చింది. అంతే కాకుండా టాప్ 20 హిందీ కార్యక్రమాల లిస్టులో కూడా స్థానం దక్కించుకోలేక పోయింది.

   బోరింగ్ షో, మసాలా పెంచాల్సిందే?

  బోరింగ్ షో, మసాలా పెంచాల్సిందే?

  బిగ్ బాస్ 12 సెకండ్ వీక్ నుండి మరింత బోరింగ్‌గా సాగడమే ఈ రేటింగ్ తగ్గడానికి కారణం అని తెలుస్తోంది. గత సీజన్లతో పోలిస్తే షో అంత ఆసక్తికరంగా లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ షోలో మరింత మసాలా పెంచే అవకాశం కనిపిస్తోంది.

   అమితాబ్ షోకు భారీ స్పందన

  అమితాబ్ షోకు భారీ స్పందన

  మరో వైపు అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి షోకు బిగ్ బాస్, ఇండియన్ ఐడల్ షోల కంటే మంచి రెస్పాన్స్ వస్తోంది. 39వ వారంలో అమితాబ్ షో 15వ స్థానంలో ఉండగ, ఇండియన్ ఐడల్ 18వ స్థానంలో ఉంది. బిగ్ బాస్ టాప్ 20లో చోటు దక్కించుకోలేక పోయింది.

  English summary
  Bigg Boss 12, which was launched on September 16, received a fantastic response with its viewership reaching 7,469,000 impressions in its opening week. In its second week, Bigg Boss 12 has registered 4,792,000 impressions in urban areas and over 1 million impressions in rural. Many viewers feel that Bigg Boss 12 has turned boring season as the contestants are yet to understand the food of the reality show and viewers' interest.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more