Just In
- 32 min ago
ప్రమోషన్ షురూ చేసిన గోపీచంద్: ‘సీటీమార్’ నుంచి అదిరిపోయే సర్ప్రైజ్
- 42 min ago
డబ్బింగ్ షురూ.. మొదలెట్టేసిన రమ్యకృష్ణ
- 47 min ago
ప్రభాస్ మూవీలో దక్షిణాది స్టార్ హీరోయిన్: ఆమె యూటర్న్ తీసుకున్న ‘ఆదిపురుష్’ టీమ్
- 58 min ago
నాని కొత్త సినిమా నుంచి షాకింగ్ అప్డేట్: ‘టక్ జగదీష్’లో మెయిన్ ట్విస్ట్ అదేనట
Don't Miss!
- Sports
India vs England: టీమిండియాకు భయం ఎందుకు.. ఫెయిర్ పిచ్‌లపై ఫెయిర్‌గా ఆడాలి: అక్తర్
- News
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ .. మార్చి 5న ఏపీ బంద్ కు పిలుపు ,తెలంగాణాలోనూ ఉద్యమం
- Lifestyle
తెల్లజుట్టు ఉందా?ఈ 5 హోం రెమెడీస్ హెయిర్ డైస్ మరియు హెయిర్ కలర్స్ కంటే మెరుగ్గా పనిచేస్తాయి
- Finance
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు, 50,000 పాయింట్ల వద్ద సెన్సెక్స్
- Automobiles
కొత్త టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ డిస్క్ బ్రేక్ వేరియంట్ విడుదల - ధర, ఫీచర్లు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Bigg Boss 14 Winner: హిందీ బిగ్ బాస్‌లో ఊహించని ఫలితం.. విన్నర్‌గా సీరియల్ నటి.. ఆ సింగర్‌కు షాక్
బుల్లితెరపై సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తూ.. దేశ వ్యాప్తంగా సూపర్ డూపర్ హిట్ షోగా నిలుస్తోంది బిగ్ బాస్. బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ రియాలిటీ షో ఆధారంగా రూపొందిన దీనిని మొదటిగా 2006లో హిందీలో ప్రారంభించారు. ఏమాత్రం అంచనాలు లేకుండా మొదలైనప్పటికీ.. చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మన్ననలు అందుకుని సక్సెస్ అయింది. అందుకే ఏకంగా 14వ సీజన్ వరకూ వచ్చింది. ప్రస్తుత సీజన్ కొత్త కొత్త ప్రయోగాలతో సాగింది. ఇక, ఊహించని పరిణామాలతో సాగిన ఈ సీజన్ ఫినాలేలో అనూహ్య ఫలితం వెలువడింది. ఆ వివరాలు మీకోసం!

అనుమానాల ప్రారంభమైన సీజన్ 14
కరోనా ప్రభావంతో ప్రతి ఏడాదిలా ఈ సారి అన్ని భాషల్లోనూ బిగ్ బాస్ ప్రసారం అయ్యే అవకాశాలు లేవని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, ఊహించని విధంగా ఈ షో అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. ఇందుకోసం షో నిర్వహకులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నారు. ముందుగానే కంటెస్టెంట్లను క్వారంటైన్‌లో ఉంచడంతో పాటు వైద్య పరమైన ఎన్నో సదుపాయాలు కల్పించారు.

వాళ్లతో మొదలైన షో.. అన్నీ భారీగానే
ఏకంగా పదమూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది హిందీ బిగ్ బాస్. గత అక్టోబర్ 14వ సీజన్ 11 మంది కంటెస్టెంట్లతోనే ప్రారంభం అయింది. దీనికి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్టుగా చేశాడు. కరోనా ప్రభావంతో పద్నాలుగో సీజన్ కోసం షో యూనిట్ ప్రత్యేకమైన ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే బిగ్ బాస్ సెట్‌ను కూడా సల్మాన్ ఖాన్ ఫాంహౌస్‌లో నిర్మించారు.

ఛాలెంజర్స్.. ఫ్రెషర్స్.. తుఫానీ సీనియర్స్
14వ సీజన్‌లో బిగ్ బాస్ నిర్వహకులు సరికొత్త ప్రయోగాలు చేశారు. ఇందులో భాగంగానే ఫ్రెషర్స్, ఛాలెంజర్స్ అంటూ కొంత మంది కొత్త పాత కంటెస్టెంట్లను హౌస్‌లోకి తీసుకొచ్చారు. వీళ్లలో రాఖీ సావంత్, వికాస్ గుప్తా తదితరులు ఉన్నారు. ఇక, సీజన్ చివర్లో తుఫానీ సీనియర్స్ అని మరికొందరిని దించారు. ఇందులో గత విన్నర్లు సిద్ధార్ద్ శుక్లా, గౌహర్ ఖాన్‌తో పాటు హినా ఖాన్ ఉన్నారు.

ఫినాలేకు చేరిన ఐదుగురు కంటెస్టెంట్లు
143 రోజుల పాటు సాగిన ఈ సీజన్ ఊహించని మలుపులతో ఆసక్తికరంగా సాగింది. ఆరంభంలో 11 మందితో పాటు ఛాలెంజర్స్‌గా కొందరు.. ఫ్రెషర్ వైల్డ్ కార్డ్ మెంబర్లుగా కొందరు.. మొత్తంగా 23 మంది ఈ సీజన్‌లో బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక, ఐదుగురు కంటెస్టెంట్లు రుబీనా దిలైక్, రాఖీ సావంత్, అలీ గోనీ, నిక్కీ తంబోలీ, రాహుల్ వైద్యాలు ఫినాలేకు చేరుకున్నారు.

ఇద్దరు ఎలిమినేట్.. హీరోయిన్ మాత్రం
గత ఆదివారం బిగ్ బాస్ 14వ సీజన్ గ్రాండ్ ఫినాలే అంగరంగ వైభవంగా జరిగింది. సల్మాన్ ఖాన్ అదిరిపోయే హోస్టింగ్‌తో పాటు పలువురు సెలెబ్రిటీల పెర్ఫార్మెన్స్‌ల నడుమ ఇది సందడిగా సాగింది. ఐదుగురు ఫైనలిస్టులలో రాఖీ సావంత్ రూ. 14 లక్షలు తీసుకుని ముందుగా బయటకు వెళ్లిపోయింది. ఆ తర్వాత అలీ గోనీ, నిక్కీ తంబోలీ ఒకరి తర్వాత ఒకరు ఎలిమినేట్ అయిపోయారు.

విన్నర్‌గా సీరియల్ నటి.. ఆ సింగర్‌కు షాక్
ముగ్గురు ఎలిమినేట్ అవడంతో సీరియల్ నటి రుబీనా దిలైక్, ప్రముఖ సింగర్ రాహుల్ వైద్యా టాప్‌లో నిలిచారు. వీరిలో ఎవరు గెలుస్తారన్న దానిపై చాలా సేపు సస్పెన్స్ కొనసాగింది. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ 14వ సీజన్‌కు రుబీనా విన్నర్ అయినట్లు సల్మాన్ ఖాన్ ప్రకటించాడు. దీంతో టైటిల్ ఫేవరెట్లలో ఒకడిగా ఉన్న రాహుల్ రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.