For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  బిగ్ బాస్ 2: ఈ వారం ఎలిమినేట్ అయ్యేదెవరు? ట్రోల్ చేస్తున్న వారికి నాని వార్నింగ్!

  By Bojja Kumar
  |

  బిగ్ బాస్ తెలుగు 2 రియాల్టీ షో చిన్న చిన్న సరదాలు, గొడవలు, కోపాలు, పంతాలు, ఏడుపులు లాంటి ఘటనలతో తొలి ఆరు రోజుల పాటు ఆకట్టుకునే విధంగా సాగింది. 7వ రోజైన శనివారం నాని హోస్ట్ షో మరింత ఆకట్టుకుంది. దాదాపు వారం రోజుల పాటు కేవలం బిగ్ బాస్ ఇంట్లో వారి ముఖాలు మాత్రమే చూస్తూ గడిపిన సభ్యులకు నాని కనిపించడంతో వారిలో మరింత ఉత్సాహం కనిపించింది. తనదైన శైలిలో షోను హోస్ట్ చేస్తూ నాని అదరగొట్టాడు. ఇంటి సభ్యులను నవ్విస్తూ, కవ్విస్తూనే.... ఈ వారం ఇంటి నుండి ఒకరు ఎలిమినేట్ అవ్వడం తప్పదు అన్నకఠిన వాస్తవాన్ని చెప్పి కాస్త టెన్షన్ పెట్టాడు.

  నాకూ ఇదొక అలవాటుగా మారింది: నాని

  నాకూ ఇదొక అలవాటుగా మారింది: నాని


  నేను కూడా రోజూ బిగ్ బాస్ చూస్తున్నాను. చూసేకొద్దీ ఈ షో ఇంట్రెస్టింగ్‌గా తయారైంది. ఇది చూడటం ఒక అలవాటుగా మారింది. రాత్రియితే చాలు 9.30 ఎప్పుడవుతుందా? అని వెయిట్ చేస్తున్నాను. ఈ షో ఎందుకు ఇంత పాపులర్ అయిందో ఇపుడు అర్థమైంది. హోస్ట్‌గా కంటే నేనూ ప్రేక్షకుల్లో ఒకరిగా మారిపోయి షో ఎంజాయ్ చేయడం ప్రారంభించాను.... అని నాని తెలిపారు.

  నన్ను కూడా తిడుతున్నారు

  నన్ను కూడా తిడుతున్నారు

  ఇంటర్నెట్లో బిగ్ బాస్ తెలుగు 2 అని యాష్ ట్యాగ్ కొడితే రకరకాల మేమ్స్ దర్శనమిస్తున్నాయి. అందులో పొగిడేవాళ్లు, తిట్టేవాళ్లు చాలా ఉన్నారు. నన్ను కూడా తిడుతున్నారు. హౌస్‌మేట్స్ అందరికీ సపరేటుగా ఫ్యాన్స్ గ్రూప్స్ ఉన్నాయి. అమిత్ తివారి పేరుతో ఓ ఫ్యాన్ క్లబ్.... దీప్తి సునైనా ఆర్మీ ఇలా రకరకాల గ్రూఫులు ఉన్నాయి. బిగ్ బాస్ 100 రోజులు పూర్తయ్యే సమయానికి అందరూ సూపర్ స్టార్స్ అవుతారేమో? అంటూ నాని చమత్కరించారు.

  తేజస్వి మీద పర్సనల్‌గా కసి ఉందన్న సంజన

  తేజస్వి మీద పర్సనల్‌గా కసి ఉందన్న సంజన

  ఈ సందర్భంగా నాని బిగ్ బాస్ ఇంట్లో జరిగిన కొన్ని సంఘటనలను రివైండ్ చేసి చూపించారు. ఈ సందర్భంగా సంజన.... కౌశల్‍‌తో మాట్లాడుతూ తనకు ఎవరి మీద పర్సనల్ కోపం లేదని... కానీ తేజస్వి మీద ఉంది. బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చాడు కాబట్టి తేజస్వి నాతో బాగా మాట్లాడింది. బిగ్ బాస్ టాస్క్ ఇవ్వపోతే అలా చేసుండేది కాదు. ఈ విషయం నాకు తెలిసినా జనాల ముందు ఎందుకు బ్యాడ్ అవ్వాలని కామ్‌గా కూల్ గా ఉన్నాను... అని తెలిపింది.

  ఇద్దరి పిలిచి ఎందుకు గొడవ పడుతున్నారని అడిగిన నాని

  ఇద్దరి పిలిచి ఎందుకు గొడవ పడుతున్నారని అడిగిన నాని

  ఎందుకు మీ ఇద్దరికీ పడటం లేదని నాని సంజనను అడ్డగా.... ‘తేజస్వికి ఇగో ప్రాబ్లం ఉంది. అది నాకు నచ్చడం లేదు. మా మధ్య గొడవలు ఇప్పటి వరకు లేవు, కాకపోతే కొన్ని విషయాల్లో డిస్క్రషన్స్ జరిగాయి. ఆమె ప్రవర్తన మార్చుకోకపోతే మున్ముందు గొడవ జరుగుతుంది.' అని తెలిపింది. తేజస్వి రియాక్ట్ అవుతూ... ‘సంజన ప్రవర్తన నాకు నచ్చలేదు. నాకు ఈగో ఉందని కూడా ఆవిడే చెబుతోంది. నాకు ఏదైన ఇష్టం లేదని తెలిసి కూడా మళ్లీ మళ్లీ అదే విషయంతో గుచ్చడం నచ్చదు. ఎవరైనా నన్ను అలా గుచ్చితే వెంటనే రియాక్ట్ అయిపోతాను, రియాక్షన్స్ కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కాదు అని వ్యాఖ్యానించింది.

  రంజాన్ స్పెషల్స్

  రంజాన్ స్పెషల్స్

  రంజన్ సందర్భంగా ఇంటి సభ్యులక బిగ్ బాస్ స్వీట్లు, హలీమ్ పంపారు. ఈ సందర్భంగా ఇంటి సభ్యులు ప్రేక్షకులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

  బుడ్డోడు పుట్టాడని చెప్పిన నాని

  బుడ్డోడు పుట్టాడని చెప్పిన నాని


  బిగ్ బాస్ ఇంట్లో ఉన్న వారికి బయట ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి..... నాని వారికి డమ్మీ వార్తలు చెప్పి ఆటపట్టించే ప్రయత్నం చేశారు. ముంబైలో ఇటీవల ఓ పెద్ద స్పేస్ షిప్ ల్యాండ్ అయిందని అబద్దం చెప్పారు. అయితే నాని మాటలను ఇంటి సభ్యలు ఎవరూ నమ్మక పోవడం గమనార్హం. దీంతో పాటు ఎన్టీఆర్‌కు బుడ్డోడు పుట్టిన విషయం కూడా వెల్లడించారు.

  ఫన్నీ డైలాగులు చెప్పించిన నాని

  ఫన్నీ డైలాగులు చెప్పించిన నాని

  ఈ సందర్భంగా బిగ్ బాస్ ఇంటి సభ్యులకు కొన్ని ఎన్వలప్ప్ పంపి వాటిలోని డైలాగ్స్ ఇతర సభ్యుల ముందు చెప్పాలని సూచించారు. అందులోని ఫన్నీ డైలాగులు సభ్యులు చెప్పిన తీరు అందరినీ ఆకట్టుకుంది. తేజస్వి ముందు సంజన... ‘ప్లూటు జింక ముందు ఊదు... సింహం ముందు కాదు' అంటూ చెప్పిన డైలాగుకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

  దీప్తి సునైన మీద ట్రోలింగ్ శృతి మించుతోందన్న నాని

  దీప్తి సునైన మీద ట్రోలింగ్ శృతి మించుతోందన్న నాని


  దీప్తి సునైన మీద కొందరు ఇంటర్నెట్లో అభ్యంతరకరంగా ట్రోల్ చేయడాన్ని ఈ సందర్భంగా నాని తప్పుబట్టారు. ఇంటర్నెట్ బుల్లింగ్ అనేది ఈ రోజుల్లో చాలా పెద్ద సమస్య అయింది. దీని వల్ల నెగిటివిటీ పెరిగిపోయింది. పబ్లిసిటీ కోసం ఇలా చేయడం సరికాదు. కొందరు మరీ భయంకరమైన నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు... అని నాని సూచించారు.

  ఆ వయసులో నేను ఫిల్మ్ నగర్ రోడ్లపై తిరుగుతున్నా

  ఆ వయసులో నేను ఫిల్మ్ నగర్ రోడ్లపై తిరుగుతున్నా

  దీప్తి సునైన ఒక 20 ఏళ్ల పిల్ల.... తనకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుని, షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ, డబ్ స్మాష్ లు చేసుకుంటూ ఈ రోజు అందరికీ తెలిసేంత పాపులర్ అయిన బిగ్ బాస్ లోకి వచ్చేంత క్రేజ్ సంపాదించి... 20 ఏళ్ల వయసులో నేను ఫిల్మ్ నగర్ రోడ్ల మీద తిరుగుతున్నాను. మీరేం చేస్తున్నారు? అంటూ ట్రోలింగ్ చేస్తున్న వారిని నాని ప్రశ్నించాడు. ట్రోలింగ్, జోకులేయడం తప్పు కాదు. కానీ శృతి మించకూడదు.... అని నాని సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చాడు.

  దీప్తి సునైన సేఫ్

  దీప్తి సునైన సేఫ్


  దీప్పి సునైనాకు వచ్చిన ఓట్లు చూసి బిగ్ బాస్ టీం అంతా షాకయింది. ఆమె ఆల్రెడీ ప్రొటెక్టెడ్ జోన్లోకి వెళ్లిపోయింది. ఆమె మీద జోకులు వేసి ట్రోల్ చేసే వారే కాదు, ఆమెను ప్రేమించే వారు కూడా చాలా మంది ఉన్నారని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అని నాని తెలిపారు.

  టెన్షన్ పెట్టిన నాని

  టెన్షన్ పెట్టిన నాని

  ఎలిమినేట్ అయ్యే లిస్టులో ఉన్న గణేష్‌ను నాని కాసేపు టెన్షన్ పెట్టారు. అయితే గణేష్ ఇంకా ప్రొటెక్టివ్ జోన్లోకి రాలేదన్నారు. ఇంట్లో నుండి ఎలిమినేట్ అయ్యేది ఎవరనేది ఆదివారం జరిగే ఎపిసోడ్లో తెలుస్తుందని నాని స్పష్టం చేశారు.

  రోల్ రైడా‌ను క్షమాపణలు కోరిన నాని

  రోల్ రైడా‌ను క్షమాపణలు కోరిన నాని

  బిగ్ బాస్‌లోకి వచ్చే వరకు నాకు రోల్ రైడా ఎవరో తెలియదు. అతడు బిగ్ బాస్‌లో ఎవరినీ పెద్దగా ఎంటర్టెన్ చేయకపోవచ్చు అనుకున్నాను. కానీ అతడు ఇంట్లో చాలా వినోదం పంచుతున్నాడు. అతడి టాలెంట్ సరిగా గుర్తించకుండా తక్కువ అంచనా వేశాను. ఇందుకు రోల్ రైడాను క్షమాపణలు కోరుతున్నాను అని నాని తెలిపారు.

  English summary
  Bigg Boss Day six in the House details. Nani asks each of the contestants to pick up an envelope and read out the dialogues inside them to the most suitable person in the house. He berates Samrat's captaincy in front of the housemates.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more