బిగ్ బాస్ తెలుగు 2లో మరింత గ్లామర్? మరో హీరోయిన్ ఎంట్రీ?
Recommended Video

బిగ్ బాస్ తెలుగు 2 రియాల్టీ షోకు మరింత గ్లామర్ అద్దేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారా? మరో హీరోయిన్‌ను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పంపే ఆలోచనలో ఉన్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కుమారి 21ఎఫ్ ద్వారా కుర్రాళ్ల గుండెలను కొల్లగొట్టిన హెబ్బా పటేల్‌ను షోలోకి ఎంటర్ చేయాలనేది నిర్వాహకుల ఆలోచనగా కనపిస్తోంది. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అంతా మామూలు స్థాయి సెలబ్రిటీలు కావడంతో షోను మరింత రక్తికట్టించడంలో భాగంగా హెబ్బాను రంగంలోకి దింపనున్నట్లు సమాచారం.

హెబ్బా పటేల్‌తో సంప్రదింపులు
ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం హీరోయిన్ హెబ్బ పటేల్‌తో నిర్వాహకులు సంప్రదింపులు జరుపుతున్నారని, వచ్చే వారం ఆమె బిగ్ బాస్ 2లోకి ఎంటరయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

గ్లామర్ పరంగా తేజస్వికి పోటీగా..
ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సెలబ్రిటీలను పరిశీలిస్తే గ్లామర్ పరంగా, ఎనర్జీ లెవల్స్ పరంగా తేజస్వి మదివాడకు మంచి గుర్తింపు వచ్చింది. ఆమెకు పోటీగా హెబ్బాను రంగంలోకి దింపితే షోను మరింత రక్తికట్టించవచ్చని భావిస్తున్నారట.

ఈ వారం బయటకు వచ్చేది ఎవరు?
ఈ వారం బిగ్‌బాస్ 2 నామినేషన్లలో సామాన్యుడు గణేష్‌తో పాటు దీప్తి నల్లమోతు, భానుశ్రీ ఉన్నారు. సామాన్యుడైన గణేష్‌కు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ఈ వారం దీప్తి లేదా భానుశ్రీ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

హెబ్బ ఎంట్రీతో రేటింగ్స్ పెరిగే అవకాశం?
ఇప్పటికే బిగ్ బాస్ ఇంట్లోకి రెండో వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హీరోయిన్ నందినీ రాయ్ ఎంటరయ్యారు. అయితే ఆమె ఎంట్రీ ద్వారా ఆశించిన స్థాయిలో రేటింగ్స్ పెరగలేదట. హెబ్బ పటేల్ పాపులర్ హీరోయిన్ కావడంతో రేటింగ్ పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











