»   » 110వ రోజు హైలెట్స్... దీప్తి, సామ్రాట్, తనీష్ చరిత్ర బయట పెట్టిన బిగ్‌బాస్!

110వ రోజు హైలెట్స్... దీప్తి, సామ్రాట్, తనీష్ చరిత్ర బయట పెట్టిన బిగ్‌బాస్!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Bigg Boss Season 2 Telugu : 110 Day Highlights

  బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2 మరో మూడు రోజుల్లో గ్రాండ్ ఫినాలేకు చేరబోతోంది. ఆదివారం జరిగే ఫైనల్‌లో విన్నర్ ఎవరో తేలిపోనుంది. ఈ నేపథ్యంలో ఈ వారం అంతా గొడవలు పడే టాస్కులకు చోటు లేకుండా షోను చాలా సరదాగా రన్ చేస్తున్నారు బిగ్ బాస్. ఐదురుగురు ఇంటి సభ్యులు గడిచిన వందరోజుల్లో ఇంట్లో ఎలా ఉన్నారు, ఎలా ప్రవర్తించారు, వారి వ్యక్తిత్వం ఏమిటో విశ్లేషిస్తూ... వారి గురించి ప్రోమోలు ప్రదర్శించారు. గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్లో దీప్తి, సామ్రాట్, తనీష్ గురించిన బిగ్ బాస్ ఇంటి చరిత్రను చూపించే ప్రయత్నం చేశారు. అయితే ఇందులో వారి గురించి మొత్తం పాజిటివ్‌గా చూపించడంతో హ్యాపీగా ఫీలయ్యారు. గీత, కౌశల్ గురించి శుక్రవారం చూపించే అవకాశం ఉంది.

  పోల్: బిగ్‌బాస్ తెలుగు 2 విజేతను మీరే తేల్చేయండి.. మీ ఓటు వేసేందుకు లింక్ క్లిక్ చేయండి!

  దీప్తి సాధారణ యువతిగా, పెద్ద కోరికలతో...

  దీప్తి సాధారణ యువతిగా, పెద్ద కోరికలతో...

  ముందుగా దీప్తి గురించి వెల్లడిస్తూ... బిగ్ బాస్ ఇంట్లోకి సాధారణ యువతి వచ్చింది. ఆమెకు చాలా పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి. ఒక చిన్న అమ్మాయి ఇలాంటి పెద్ద ఇంట్లో తన కలలను, కోరికలను సాకారం చేసుకోగలదా అనిపింది. ఆ అమ్మాయి చక్కగా మాట్లాడుతుంది. చాలా నవ్వుతుంది. ఏడుస్తుంది. అందరికంటే ఎక్కువగా అందరినీ ప్రేమిస్తుంది. ఆమె మీరే దీప్తి. ఇంట్లో అడుగుపెట్టి తక్కువ సమయంలో అందరికీ ప్రియమైన వ్యక్తిలా మారిపోయారు. ఇంటి సభ్యులను అమ్మలా చూసుకోవడం, ఫ్రెండుగా సపోర్ట్ ఇవ్వడం, మరికొన్ని సార్లు మీ అమాయకత్వంతో ఇంటి సభ్యులను నవ్వించడం బిగ్ బాస్ గమనించారని తెలిపారు.

  మీలో అడవి గుర్రానికి ఉన్నంత సత్తువ ఉంది

  మీలో అడవి గుర్రానికి ఉన్నంత సత్తువ ఉంది

  మీరు అమాయకమైన అమ్మాయిలా బయటకు కనిపించినా మీ లోపల అడవి గుర్రానికి ఉన్నంత సత్తువ ఉందని, దానికి కేవలం గెలవడం మాత్రమే తెలుసు అని మీకు మీరు వారం వారం నిరూపించుకోవాల్సి వచ్చింది. ప్రతి టాస్క్‌ల్లో, కష్టతరమైన సందర్భాల్లో కూడా వెనుకంజ వేయలేదు. మీ పట్టుదలకు బిగ్ బాస్ సెల్యూట్ చేస్తున్నాడు. గాయాలైనా తట్టుకున్నారు, హృదయం ముక్కలైనా మీరు మీ పట్టుదలను కోల్పోవడం బిగ్ బాస్ ఎప్పుడూ చూడలేదు. మీరు ఎంతో మందికి ప్రేరణగా నిలిచారు.. అంటూ బిగ్‌బాస్ దీప్తిని ప్రశంసించాడు.

  సామ్రాట్ సున్నితమైన వ్యక్తిగా వచ్చి...

  సామ్రాట్ సున్నితమైన వ్యక్తిగా వచ్చి...


  సామ్రాట్‌ గురించి చెబుతూ.. మీరు బిగ్ బాస్ ఇంట్లోకి అత్యంత సున్నితమైన వ్యక్తిగా వచ్చి తొందరగా అందరితో కలిసి పోయారు. ఎంతో మంది ఇంటి సభ్యులకు ప్రియమైన వ్యక్తిగా మారిపోయారు. మీ స్నేహ భావం వల్ల ఇంటి సభ్యులందరూ మీరో ఒక స్నేహితుడిని చూశారు. మీ అభిమానం, ప్రకాశవంతమైన చిరునవ్వుతో అందరూ మిమ్మల్ని బిగ్ బాస్ ఇంటి మొదటి కెప్టెన్ గా ఎంపిక చేసుకున్నారు.... అని బిగ్ బాస్ అన్నారు.

  మీ బాధలను పక్కన పెట్టి బాగా ఆడారు

  మీ బాధలను పక్కన పెట్టి బాగా ఆడారు

  ఇంట్లో జరిగే తప్పులను మీ మీద వేసుకుని ఫిర్యాదు చేయని వినయంతో పాటు నాయకత్వం వహించేంత మనోదైర్యం మీకు ఉంది. మీకు ఉన్న బాధలను పక్కన పెట్టి మీ ఆటను మనస్ఫూర్తిగా ఆడుతూ.. దానికి మీ ధృడ సంకల్పాన్ని జోడిస్తూ చాలా బాగా ఆడారు. మీరు టాస్కుల్లో ఎంత బాగా ఒదిగిపోయారంటే ఒకానొక సమయంలో బిగ్ బాస్ మిమ్మల్ని శిక్షించేంత. మిమ్మల్ని ప్రతి ఒక్క సభ్యుడు ఇష్టపడే సమయంలో కొన్ని అందమైన బంధాన్ని కనుగొన్నారు. తనీష్, తేజస్వితో అలాంటి అందమైన బంధాన్ని ఏర్పరుచుకుంటూ స్నేహం అనే పదానికి ఒక కొత్త అర్థాన్ని ఇచ్చారని... సామ్రాట్ గురించి బిగ్ బాస్ చెప్పారు.

  అపుడు మీరు బాధపడ్డారు

  అపుడు మీరు బాధపడ్డారు

  బిగ్ బాస్ ఇంట్లో మీరు ఏర్పరుచుకున్న బంధాల వల్ల ఎంతో మంది మిమ్మల్ని విమర్శించారు. కానీ మీరు ఎల్లప్పుడూ మీరు నమ్మిన దానికే కట్టుబడి ఉన్నారు. దాన్ని బట్టి మీ ధృమైన వ్యక్తిత్వం ఏమిటో అర్థం అవుతుంది. మీకు ఇష్టమైన వ్యక్తులు ఇంటి నుండి వెళ్లిపోవడంతో మీరు బాధగా ఉండటం బిగ్ బాస్ గమనించాడు. అయినా మీరు ఆటలో తిరిగి ఉత్సాహంగా పాల్గొన్నారు. మీరు అద్భుతమైన ప్రయాణాన్ని కొనసాగించారు... అని సామ్రాట్ అన్నారు.

  అది లవ్ కాదన్న గీత మాధురి

  అది లవ్ కాదన్న గీత మాధురి

  ఏవీ అనంతరం బయటకు వచ్చిన సామ్రాట్ తన గురించి బిగ్ బాస్ చెప్పిన వివరాలను ఇంటి సభ్యులతో పంచుకున్నారు. తేజస్వీతో లవ్ స్టోరీ కూడా చూపించాడని చెప్పగానే గీత మాధురి కలుగజేసుకుని అది లవ్ కాదు' అని వ్యాఖ్యానించగా...సామ్రాట్ రియాక్ట్ అవుతూ బిగ్‌బాస్ మా రిలేషన్‌ను లవ్‌స్టోరీలా చూపించాడని తెలిపాడు.

  తనీష్ గురించి....

  తనీష్ గురించి....


  తనీష్ గురించి బిగ్‌బాస్ చెబుతూ.. తనీష్ మీకు ఇంట్లోకి ఎంటరవ్వగానే యాంగ్రీ యంగ్ మ్యాన్ అనే పేరు వచ్చింది. కానీ మీరు వాత్సల్యం, సంరక్షించే ఇంటి సభ్యుడిలా అందరికీ కనిపించారు. మొదటి నుంచి మీకు కొన్ని బంధాలు ఏర్పడ్డాయి. అవి ఎలాంటివంటే స్నేహానికి ఉత్తమమైన ఉదాహరణగా నిలుస్తాయి. స్నేహానికి కట్టుబడి ఉండటం ఈ ఇంట్లో ఇంకెవరికీ తెలీదేమో. బయట ఎంతో సులువుగా వాగ్విదాలకు దిగే తనీష్ లోపల ఎంతో ప్రేమను పంచేవ్యక్తి అని బిగ్‌బాస్ గమనించారు... అని బిగ్ బాస్ చెప్పుకొచ్చారు.

   తనీష్ భావోద్వేగం

  తనీష్ భావోద్వేగం

  బిగ్ బాస్ తన గురించి గొప్పగా చెప్పడంతో తనీష్ భావోద్వేగానికి గురయ్యాడు. ఓ టాస్క్‌లో సామ్రాట్‌ను నామినేషన్ నుంచి గట్టెక్కించేందుకు రంగు నీటిలో ముంచిన తన ఫేవరెట్ జాకెట్‌ను తీసుకెళ్లమని బిగ్‌బాస్ చెప్పాడు. తన జాకెట్ బయటకు తసుకెళ్లి ఇతర సభ్యులకు చూపించిన తనీష్.... బిగ్ బాస్ ఇట్లు తనకు ఎంతో నచ్చింది అననారు.

  ఎలిమినేట్ అయిన వారంతా ఇంట్లోకి...

  ఎలిమినేట్ అయిన వారంతా ఇంట్లోకి...

  బిగ్‌బాస్ హౌస్‌ నుండి ఎలిమినేట్ అయిన బయటకు వెళ్లిన వారంతా.... తిరిగి హౌస్‌లోకి రానున్నారు. ఐదుగురు ఫైనలిస్టులతో కలిసి వారు సరదాగా గడపనునున్నారు. శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఇందుకు సంబంధించిన దృశ్యాలు చూపించనున్నారు.

  English summary
  Bigg Boss 2 Telugu Episode 110 highlights. The episode is filled with sentiments as Bigg Boss talks to each and every individual, and takes them on an emotional roller coaster.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more