For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాషాగా అదరగొట్టిన బాబా.. ఓవరాక్షన్‌తో విసిగించిన శ్రీముఖి.. కాంచనగా దుమ్ములేపిన రాహుల్

  |
  Bigg Boss Telugu 3 : Episode 90 Highlights || బిగ్ బాస్ హౌస్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్

  బిగ్‌బాస్ ఈ పదమూడో వారాన్ని ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ముగించాడు. లైఫ్ ఆఫ్ గ్రాఫ్, డే ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అంటూ ఫుల్ ఫన్ క్రియేట్ అయ్యేలా చేశాడు. ఇక వీకెండ్‌లో నాగార్జున వచ్చి.. తన వాటాలో ఇవ్వాల్సిన ఫన్‌ను ఇవ్వాల్సి ఉంది.

  యాంకర్ కావాలంటూ...

  యాంకర్ కావాలంటూ...

  లైఫ్ గ్రాఫ్ అనే టాస్క్.. ఓ టాస్క్‌ను ఇచ్చిన వారి జీవితంలో చూసిన ఎత్తుపల్లాలను పంచుకోమన్నాడు. దీనిలో భాగంగా వితకా తన కెరీర్‌ను ఎలా మొదలు పెట్టింది? కన్నడ, తమిళంలో అవకాశం ఎలా వచ్చింది? వరుణ్ సందేశ్‌తో పెళ్లి..? బిగ్‌బాస్ హౌస్‌కు రావడం.. యాంకర్ కావాలనే తన కోరిక ఇలా ప్రతీది చెప్పుకొచ్చింది.

  మొదటి అవకాశమిచ్చిన ధనుష్

  మొదటి అవకాశమిచ్చిన ధనుష్

  బాబా భాస్కర్ తన లైఫ్ గ్రాఫ్‌ను చెబుతూ.. చిన్నతనం నుంచి తన తండ్రి ప్రోత్సహించేవాడని తెలిపాడు. ధనుష్, తాను క్లాస్ మేట్స్ అని.. ఓ సినిమాకు నేను అసిస్టెంట్ డ్యాన్స్ మాస్టర్‌గా చేస్తూ ఉంటే.. అప్పుడు ఆ సినిమాకు హీరో ధనుష్ అని.. సినిమాకు కొరియోగ్రాఫ్ చేస్తావా? అని అడిగాడని.. అలా ధనుష్ తనకు మొదటి అవకాశమిచ్చాడని తెలిపాడు. డైరెక్టర్ శంకర్ 2.ఓ సినిమాకు పిలిచాడని, రజినీ పేట్టాకు కూడా చేశాడని.. ఇలా తన లైఫ్ గురించి చెప్పుకొచ్చాడు.

  మొదటి సక్సెస్ పెళ్లి..

  మొదటి సక్సెస్ పెళ్లి..

  శివజ్యోతి తన గురించి చెబుతూ.. తన పెళ్లే మొదటి విజయం అని.. తన కెరీర్ ఎలా మొదలైందని, యాంకర్‌గా ఎంత ఫేమస్ అయిందన్న విషయాలు చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ వల్ల తానెంటో ప్రపంచానికి కూడా తెలిసిందంటూ ఇదే తన విజయం అని తెలిపింది.

  డే ఆఫ్ ఎంటర్టైన్మెంట్

  డే ఆఫ్ ఎంటర్టైన్మెంట్


  డే ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అంటూ బిగ్‌బాస్ మరో టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో భాగంగా అందరికీ కొన్ని పాత్రలను ఇచ్చాడు. ఇక ఆ రోజంతా అవే పాత్రల్లో జీవించాల్సి ఉంటుందని తెలిపాడు. దీంతో బాబా భాస్కర్‌కు బాషా, అలీకి గజిని, రాహుల్‌కు కాంచన, శివజ్యోతికి చంద్రముఖి, వితికా దేవసేనగా, వరుణ్ బాహుబలిగా.. శ్రీముఖి మహానటిగా ఈ రోజంతా ఎంటర్టైన్ చేయాలని తెలిపాడు.

  ఎక్స్‌ప్రెషన్స్ చెండాలంగా ఉన్నాయంటూ బాబా భాస్కర్ కౌంటర్

  ఎక్స్‌ప్రెషన్స్ చెండాలంగా ఉన్నాయంటూ బాబా భాస్కర్ కౌంటర్

  బాబా భాస్కర్‌ తన క్యారెక్టర్‌లో జీవించేశాడు. బాషాగా, మాణిక్యంగా అదరగొట్టేశాడు. బాహుబలి పాత్రలో వరుణ్ సందేశ్ ఖాళీగా కూర్చున్నాడు. దేవసేన పాత్రలో వితికా బాగానే ట్రై చేసింది. గజినీగా అలీ, కాంచనగా రాహుల్ వాళ్ల క్యారెక్టర్‌కు తగ్గట్లు బాగానే చేశారు. ఇక శివజ్యోతి వాయిస్‌లో అంతగా బేస్ లేకపోవడంతో ఆమె చెప్పిన డైలాగ్‌లు అంతగా పేలలేదు. మహానటి సినిమాలో కీర్తి సురేష్‌లా నచించే క్రమంలో పెట్టిన ఎక్స్‌ప్రెషన్స్ చెండాలంగా ఉన్నాయంటూ బాబా భాస్కర్ కౌంటర్ వేయగా.. తాను ఏ ఎక్స్‌ప్రెషన్స్ పెట్టినా బాగానే ఉంటుందని రివర్స్ కౌంటర్ వేసింది.

  బెడిసి కొట్టిన శ్రీముఖి ఐడియా..

  బెడిసి కొట్టిన శ్రీముఖి ఐడియా..

  బాహుబలిలోని సీన్‌ను స్పూఫ్ చేయండని శ్రీముఖి ఐడియా.. కోర్ట్ యార్డ్‌లోని రెండు బేంచీలను దగ్గరకు లాగింది. అయితే మొదటిసారి మామూలుగానే నడిచేసి వెళ్లిన వితికాను భుజాలపై బాగానే మోశాడు. రెండో సారి వితికా నడించేందుకు సిద్దపడగా.. ఠీవీగా నడువంటూ శ్రీముఖి చెప్పింది. ఈ సారి వరుణ్ మోయలేకపోయాడు. నడ్డి విరిగిందని అరిచాడు. దీంతో తనకు ఈ దేవసేన నచ్చలేదు వద్దంటూ చెప్పేశాడు. అయితే తానొకసారి ట్రై చేయాలా అని శ్రీముఖి అడిగింది. వద్దమ్మ అంటూ దండం పెట్టాడు.

  చివర్లో నటన, డ్యాన్సులతో అదరగొట్టేశారు

  చివర్లో నటన, డ్యాన్సులతో అదరగొట్టేశారు

  మహానటి పాటలో శ్రీముఖి, చంద్రముఖి సాంగ్‌లో బాబా భాస్కర్, శివజ్యోతి.. బాషాలోని నే ఆటోవాడ్ని సాంగ్‌కు బాబా తన డ్యాన్స్‌తో అదరగొట్టేశారు. కాంచన పాటకు రాహుల్ అదిరిపోయేలా డ్యాన్స్ చేశాడు. గజినిలోని ఒకమారు కలిసిన అందం పాటకు అలీ, బాహుబలిలోని ఓరోరి రాజా.. పాటకు వరుణ్, వితికా డ్యాన్సులు వేశారు.

  English summary
  Bigg Boss 3 telugu 13th Week Updates, Baba Bhaskar As Baba, Rahul As Kanchana, Ali As Gajini, Sivajyothi As Chandramukhi, Srimukhi As Mahanati Keerthy Suresh, Varun And Vithika Bahubali Devasena Characted Palyed.. All Housemates Entertained Very Well.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X