For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బిగ్‌బాస్ 3 తెలుగు ఫినాలె అప్‌డేట్స్..రూ.25 లక్షల ఆఫర్ తిరస్కరించేశారు.. బాబా అవుట్

  |
  Bigg Boss Telugu 3 : Baba Bhaskar Eviction Announced By Actress Anjali

  జూలై 21న మొదలైన బిగ్‌బాస్ మూడో సీజన్ నవంబర్ 3న ముగిసేందుకు వచ్చింది. పదిహేను మంది కంటెస్టెంట్లు, రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, ఎవ్వరూ ఊహించని రీ ఎంట్రీ, ఈ మూడో సీజన్‌కు హైలెట్‌గా నిలిచిన స్పెషల్ హోస్ట్ రమ్యకృష్ణ, తనస్టైల్లో సీజన్‌ను విజయవంతం చేసిన నాగార్జున ఇలా ఎన్నో విశిష్టతలతో కూడిన బిగ్‌బాస్ మూడో సీజన్‌కు వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది.

  ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు మొదలైన ఈ ఫినాలే ఎపిసోడ్‌లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఎంతో మంది వెండితెర తారలు, బుల్లితెర నటీనటులు తమ ఆటపాటలతో అలరిస్తున్నారు. ఈసీజన్‌కు విన్నర్‌గా నిలిచే కంటెస్టెంట్‌కు ఓ ప్రత్యేకమైన అతిథి చేతుల మీదుగా టైటిల్, కప్పును అందజేయనున్నారు. అంతకంటే ముందు బిగ్‌బాస్ వీక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు అతిరథమహారథులు వారి ఆటపాటలతో అందర్నీ మెప్పించేందుకు సిద్దమయ్యారు. ఈ ఫినాలె ఎపిసోడ్ కార్యక్రమానికి సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ మీకోసం..

  రూ.25 లక్షల ఆఫర్ తిరస్కరించేశారు..

  రూ.25 లక్షల ఆఫర్ తిరస్కరించేశారు..

  అనంతరం బిగ్‌బాస్ కంటెస్టెంట్లు, సీరియల్ యాక్టర్స్‌ కలిసి చేసిన డ్యాన్స్ పర్ఫామెన్స్ ఆకట్టుకుంది. వితికా- అగ్ని సాక్షి ఫేమ్ అర్జున్, పునర్నవి- సిరిసిరి మువ్వలు ఫేమ్ అశ్విన్.. రవికృష్ణ-నవ్య స్వామి..శిల్పా చక్రవర్తి-కార్తీక దీపం ఫేమ్ నిరుపమ్ డ్యాన్సులు అదిరిపోయాయి. మూడో ఎలిమినేషన్ కోసం అంజలి గెస్ట్‌గా వచ్చేసింది. పది లక్షలు, ఇరవై లక్షలు, ఇరవైదు లక్షలను హౌస్‌మేట్స్ అందరూ కాదనుకున్నారు. మూడో ఎలిమినేషన్‌లో భాగంగా బాబా భాస్కర్ ఎలిమినేట్ అయినట్లు అంజలి ప్రకటించేసింది.

  రాహుల్ విన్నర్..

  రాహుల్ విన్నర్..

  తరువాతి ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు శ్రీకాంత్‌ను దింపారు. ప్లాన్ ఏ, ప్లాన్ బీ, ప్లాన్ సీ అంటూ శ్రీకాంత్‌ను బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపించాడు. పది లక్షలున్నాయని ఎవరైనా తీసుకుని వెళ్లిపోవచ్చు అని ఆఫర్ ఇచ్చాడు. కానీ ఆ ఆఫర్‌ను అందరూ తిరస్కరించారు. 20లక్షల ఆఫర్‌కు కూడా ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో ప్లాన్ సీ ని అమలు చేసేందుకు నాగ్ సిద్దమయ్యాడు. ఈ మేరకు టాప్4లో నిలిచిన కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేసేందుకు క్యాథరిన్ ఎంట్రీ ఇచ్చింది. దీంతో వరుణ్ సందేశ్ ఎలిమినేట్ అయినట్లు వారిద్దరు కలిసి ప్రకటించారు. నాల్గో పొజిషన్‌లో ఉండి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన వరుణ్ సందేశ్.. రాహుల్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలిపాడు. మేము నలుగురం చాలా మంచి స్నేహితులమయ్యామని తెలిపాడు. శ్రీ ముఖి చాలా మంచి ఫైటర్.. ఆమె గెలిస్తే.. ఫస్ట్ మహిళ అవుతుందని తెలిపాడు.

  నాలుగో స్థానంలో వరుణ్..

  నాలుగో స్థానంలో వరుణ్..

  క్యాథరిన్ స్టెప్పులు, అలీ రెజా ఎలిమినేషన్, అనురాగ్ కులకర్ణి పాటలు, అంజలి ఐటెమ్ సాంగ్ స్టెప్పుల అనంతరం తరువాతి ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు శ్రీకాంత్‌ను దింపారు. ప్లాన్ ఏ, ప్లాన్ బీ, ప్లాన్ సీ అంటూ శ్రీకాంత్‌ను బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపించాడు. పది లక్షలున్నాయని ఎవరైనా తీసుకుని వెళ్లిపోవచ్చు అని ఆఫర్ ఇచ్చాడు. కానీ ఆ ఆఫర్‌ను అందరూ తిరస్కరించారు. 20లక్షల ఆఫర్‌కు కూడా ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో ప్లాన్ సీ ని అమలు చేసేందుకు నాగ్ సిద్దమయ్యాడు. ఈ మేరకు టాప్4లో నిలిచిన కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేసేందుకు క్యాథరిన్ ఎంట్రీ ఇచ్చింది.

  ఐటెం సాంగ్‌లతో అదరగొట్టిన అంజలి

  ఐటెం సాంగ్‌లతో అదరగొట్టిన అంజలి

  కంటెస్టెంట్ల ఆటపాటలు, క్యాథరిన్ స్టెప్పులు, హీరోయిన్ రాశీ ఖన్నా ఎంట్రీ ఇలా కాసేపు ఎంటర్టైన్ చేసిన నాగ్.. ఎలిమినేషన్ ప్రక్రియకు తెరలేపాడు. టాప్5లో తక్కువ ఓట్లతో ఐదో స్థానంలో అలీ రెజా ఎలిమినేట్ అయినట్లు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రతిరోజు పండగే టీమ్‌ను దింపేసింది బిగ్‌బాస్ బృందం. అనంతరం అనురాగ్ కులకర్ణితో పాటలు పాడించారు. అతను పాడిన ఫేమస్ సాంగ్‌లను స్టేజ్‌పై పాడి అందర్నీ ఆకట్టుకున్నాడు. లేటెస్ట్ సెన్సేషన్ రాములో రాముల సాంగ్‌తో ఒక్కసారిగా వేరే లెవెల్‌కు తీసుకెళ్లాడు. అనంతరం సరైనోడు బ్లాక్ బస్టర్ సాంగ్‌కు, ఖైదీ నెంబర్ 150 ఐటెమ్ సాంగ్‌కు, జైలవకుశ సినిమాలోంచి స్వింగ్ జరా పాటకు స్టెప్పులేసి అంజలి అదరగొట్టేసింది.

  నెంబర్ వన్ రాహుల్..

  నెంబర్ వన్ రాహుల్..

  టాప్5లో ఉన్న అలీ రెజాకు అతి తక్కువ ఓట్లు రావడంతో అందరి కంటే ముందుగా ఎలిమినేట్ అయ్యాడు. ఈ విషయాన్ని ప్రకటించేందుకు ప్రతిరోజూ పండుగ చిత్రబృందంలోంచి దర్శకుడు మారుతి, హీరోయిన్ రాశీ ఖన్నా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అలీ ఎలిమినేట్ అయ్యాడని ప్రకటించి.. స్టేజ్ మీదకు పట్టుకొచ్చారు. అనంతరం రాశీ ఖన్నా మాట్లాడుతూ.. ఇంత మంచి వాడిని మాతో ఎందుకు ఎలిమినేట్ చేయించారని అనగా.. అలా ఏం లేదులే.. ఓ దేవత వచ్చి నన్ను తీసుకెళ్లినట్లు అనిపించిందని అలీ సరదాగా కామెంట్ చేశాడు. అలీకి ఓ టాస్క్ ఇచ్చిన నాగ్.. అందులో రాహుల్ గెలుస్తాడని నెంబర్ 1 పొజిషిన్‌ను ఇచ్చాడు.

   అతి తక్కువ ఓట్లతో అలీ రెజా ఎలిమినేట్

  అతి తక్కువ ఓట్లతో అలీ రెజా ఎలిమినేట్

  ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడించడం, పాటలు పాడించడం, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇలా కొంత ఎంటర్టైన్ చేసిన తరువాత ఎలిమినేషన్ విషయాన్ని గుర్తు చేశాడు నాగ్. టాప్5లోంచి ఒకరు ఎలిమినేట్ అయ్యే సమయం వచ్చేసిందని తెలిపాడు. ఐదో స్థానంలో నిలిచిన కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేయబోతోన్నట్లు ప్రకటించాడు. దీనికోసం ప్రత్యేకంగా మారుతి, రాశీ ఖన్నాను ఆహ్వానించాడు. తెలుసా తెలుసా అంటూ పాట పాడి రాశీ ఖన్నా అందరినీ ఆకట్టుకుంది. శ్రీముఖి నోరేసుకుని పడిపోతుందని మారుతి ఫన్నీగా కామెంట్ చేశాడు. బిగ్‌బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిన ఇద్దరితో అదిరిపోయే స్టెప్పులు వేయించాడు. అతి తక్కువ ఓట్లతో అలీ రెజా ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు.

  టాప్ లేపిన క్యాథరిన్

  టాప్ లేపిన క్యాథరిన్

  తన అమ్మ కోర్ట్ యార్డ్ నుంచి ఎంట్రీ ఇవ్వడంతో తనకు ఇష్టమైన స్థలం అదేనని, ఏ ఫీలింగ్ వచ్చినా ఇక్కడికే వస్తానని శ్రీముఖి తెలిపింది. బాబాకు వంటగది, అలీకి జిమి ఏరియా.. వరుణ్‌కు గార్డెన్ ఏరియాలో ఉన్న సోఫాలు, రాహుల్‌కు బాత్రూమ్ ఏరియా అంటే ఇష్టమని తెలిపారు. అటుపై కంటెస్టెంట్లందరికీ వంద రోజుల జర్నీని ప్లే చేసి చూపించాడు. అన్ని రకాల ఎమోషన్స్‌తోనిండిన ఈ వీడియోను చూసి అందరూ కంటతడి పెట్టారు. నవ్వులు, ఏడ్పులు, గొడవలు, ప్రేమలు, ఇలా అన్నింటినీ కలిసి అద్భుతంగా చూపించాడు. వాటిని ఎడిట్ చేసిన విధానం కూడా అందర్నీ ఆకట్టుకుంది. జయ జానకీ నాయక పాటకు అదరిపోయే స్టెప్పులు వేస్తూ ఎంట్రీ ఇచ్చింది క్యాథరిన్. గ్రూప్ డ్యాన్స్‌తో చేసిన ఈ పర్ఫామెన్స్‌లో మిక్స్డ్ సాంగ్స్‌తో ఆకట్టుకుంది. రేసుగుర్రంలోంచి గల్లపట్టి గుంజుతాంది దీని సూపు.. ఇద్దరమ్మాయిలతో చిత్రంలోని టాపు లేసిపోద్ది అనే పాటకు డ్యాన్సులు వేసి నిజంగానే టాపు లేపేసింది.

  పాట పాడరా అంటూ పునర్నవి ఆర్డర్

  పాట పాడరా అంటూ పునర్నవి ఆర్డర్

  ఈ వందరోజుల జర్నీని ఓ పాటగా మలిచి పాడాలని నాగార్జున తెలిపాడు. ఈ విషయాన్ని పునర్నవి చేత రాహుల్‌కు చెప్పించాడు. పాడరా రాహుల్ అంటూ పునర్నవి ఆర్డర్ వేసింది. దీంతో అందరూ నవ్వేశారు. ఇక ఆ టాప్ 5 మెంబర్స్‌కు సంబంధించి, హౌస్‌లో వారు చేసిన టాస్కులు, గొడవలు ఇలా ప్రతీ విషయాన్ని టచ్ చేస్తూ ఓ పాటను అల్లారు. దానికి రాహుల్ ట్యూన్ కట్టేసి అద్భుతంగా పాడుతూ ఉండగా.. మిగతా నలుగురు స్టెప్పులేసారు.

  బామ్మకు ఐ లవ్యూ చెప్పిన నాగ్

  బామ్మకు ఐ లవ్యూ చెప్పిన నాగ్

  కంటెస్టెంట్లందరితో మాట్లాడుకొచ్చిన నాగ్ .. వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. అలీ రెజా ఫ్యామిలీ మెంబర్స్, వరుణ్ సందేశ్ బామ్మ, రాహుల్ అమ్మ, శ్రీముఖి తమ్ముడు, బాబా ఫ్యామిలీ ఇలా అందరినీ టచ్ చేశాడు. ఇక అందరిలో బామ్మ చేసిన కామెడీ భలే ఆకట్టుకుంది. మనం సినిమాలోని నాగ్ డైలాగ్ తనకు ఇష్టమని చెప్పింది. ఇాలా ఇవ్వు (ఐ లవ్యూ) అంటూ బామ్మకు ఐ లవ్యూ అని చెప్పాడు. గతంలో బిగ్‌బాస్ హోటల్ టాస్క్‌లో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బామ్మ ఎంతగా ఫేమస్ అయిందో తెలిసిందే. బిగ్‌బాస్‌ను ఇంటికి పిలిచి అందర్నీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

  మా సంబంధం అలాంటిందే

  మా సంబంధం అలాంటిందే

  బిగ్‌బాస్ కంటెస్టంట్లందరిని పలకరిస్తూ నాగ్.. వారి మనోభావాలను అడిగి తెలుసుకున్నాడు. ఎలిమినేట్ అయి బయటకు వెళ్లాక తమ జీవితం ఎలా ఉందని అందరిని అడిగారు. సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నానని హిమజ, లేడీ ఫాలోయింగ్ పెరిగిందని జాఫర్, తనను తోపు అంటున్నారని హేమ, పెళ్లి సంబంధాలు పెరిగాయని రవికృష్ణ, బిగ్‌బాస్‌తో గుర్తింపు పెరిగిందని రోహిణి, వరుణ్‌కు సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటూ బిజీగా ఉన్నానని వితికా చెప్పుకొచ్చింది. లోపలికి వెళ్లాక కూడా రాహుల్‌ను తిట్టడం అవసరమా? అని నాగ్ ప్రశ్నించగా.. మా సంబంధం అలాంటిదేనని చెప్పుకొచ్చింది.

  కింగ్‌లా ఎంట్రీ ఇచ్చిన నాగ్..

  కింగ్‌లా ఎంట్రీ ఇచ్చిన నాగ్..

  కంటెస్టెంట్ల వంద రోజుల కష్టం నేటితో తీరింది. పదిహేను మంది కంటెస్టెంట్లు, ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హోరాహోరిగా పోటీపడగా చివరకు ఐదుగురు మిగిలారు. వీరిలో విజేత ఎవరన్నది ఇంకాసేపట్లో తేలనుంది. ఈ ఫినాలె ఎపిసోడ్ కాసేపటి క్రితమే అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.

  రాములో రాముల పాటకు శివజ్యోతి, రవికృష్ణ కలిసి వేసిన స్టెప్పులు, వాల్మీకి సినిమాలోని సూపర్ హిట్టు సాంగ్‌కు రోహిణి, ఆట సినిమాలోన ఏలా ఏలా సాంగ్‌కు హేమ, ఎఫ్2 లోని గిర్రా గిర్రా సాంగ్‌కు హిమజ, శిల్పా కలిసి వేసిన స్టెప్పులు, జీన్స్ సినిమాలోని కన్నులతో చూసేది సాంగ్‌కు వితికా, పునర్నవి.. అత్తారింటికి దారేది ఇట్స్ టైమ్ టు పార్టీ సాంగ్‌కు మహేష్, జాఫర్, తమన్నా.. డ్యాన్సుల వేశారు. అనంతరం కింగ్‌లా నాగ్ ఎంట్రీ ఇచ్చాడు. బిగ్‌బాస్ కంటెస్టెంట్లందరితో కలిసి చివరకు నువ్వురెడీ నేను రెడీ పాటకు డ్యాన్సులు వేశారు.

  English summary
  Bigg Boss 3 Telugu Finale Episode Highlights. Anjali, Nidhi Aggarwal, Raashi Khanna, Maruthi, Srikanth Are Attending This Grand event.It Is Going To Most Prestigious Event. Lets see Who Is Going To Won Bigg Boss 3 Telugu Title.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X