For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దుమ్మురేపిన బిగ్‌బాస్‌3 ఫైనల్.. ఇండియాలోనే టాప్.. అదరగొట్టిన నాగ్

  By Manoj
  |

  బిగ్‌బాస్ షో ముగిసింది కానీ దానికి సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. విన్నర్‌గా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉండగా, హిమజ-శివజ్యోతి-అషూ-రోహిణి తమ ఫ్రెండ్‌షిప్‌ను కంటిన్యూ పిక్స్‌ను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. ఇక పునర్నవి,వరుణ్, వితికా వీరంతా బయట తమకు వచ్చిన ఫేమ్‌ను చూస్తూ ఎంజాయ్ చేసేస్తున్నారు.అయితే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది తెలిస్తే.. మీరు కూడా 'బిగ్‌బాస్' అనేస్తారు.

   అంగరంగవైభవంగా ప్రారంభమైన బిగ్‌బాస్

  అంగరంగవైభవంగా ప్రారంభమైన బిగ్‌బాస్

  బిగ్‌బాస్ రెండు సీజన్లు ముగిశాక.. మూడో సీజన్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూశారు ప్రేక్షకులు. మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ అద్భుతంగా నడిపించగా.. నాని తన రేంజ్‌లో పర్వాలేదనిపించాడు. అయితే మూడో సీజన్‌కు కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించబోతోన్నాడని తెలిశాక అంచనాలు రెట్టింపయ్యాయి. ఎందుకంటే అంతకుముందే మీలో ఎవరు కోటీశ్వరుడుతో బుల్లితెర ప్రేక్షకులను మెప్పించిన నాగ్.. బిగ్‌బాస్‌ను నడిపిస్తాడని అందరూ భావించారు. ఈ క్రమంలో జూన్ 21న ప్రారంభమైన బిగ్‌బాస్.. టీఆర్పీలో టాప్ ప్లేస్‌లో దూసుకుపోయింది.

   అదే రేంజ్‌లో ఫినాలె..

  అదే రేంజ్‌లో ఫినాలె..

  బిగ్‌బాస్ ఫినాలె వేడుకలు కూడా అంతే అట్టహాసంగా ముగిశాయి. ఎంతో మంది అందాల తారల తళకుబెళుకులతో ఫినాలె ఈవెంట్ అదిరిపోయింది. అంజలి, నిధి అగర్వాల్ లాంటి తారల డ్యాన్సులతో స్టేజ్ షేక్ అయింది. దాదాపు నాలుగున్నర గంటల పాటు కొనసాగిన ఈ ఎపిసోడ్ ఏ క్షణంలో కూడా విసుగుపుట్టించకుండా సాగుతూ పోయింది.

  గ్రాండ్‌గా చిరు ఎంట్రీ

  ఈ ఫినాలె వేడుకలకు మరిన్ని హంగులు అద్దేందుకు మెగాస్టార్ చిరంజీవి ఎంటర్ అయ్యాడు. ఆయన రాకతో ఒక్కసారిగా ఫినాలె స్టేజ్ ఊగిపోయింది. అభిమానుల, కంటెస్టెంట్ల హర్షద్వానాలతో హోరెత్తిపోయింది. చిరు తన స్టైల్లో వేసిన పంచ్‌లు ఇప్పటికీ మార్మోగుతూనే ఉన్నాయి. హెస్ట్‌గా ఉన్ననాగ్‌కు, ప్రతీ ఒక్క కంటెస్టెంట్‌కు తనదైన శైలిలో చురకలు అంటించాడు. అలా వచ్చీ రావడంతోనే స్టేజ్‌ను అల్లాడించాడు.

  టీఆర్‌పీలో టాప్..

  టీఆర్‌పీలో టాప్..

  అయితే ఫినాలె ఎపిసోడ్‌కు సంబంధించిన టీఆర్పీ లెక్కలు బయటకు వచ్చాయి. నాలుగున్నర గంటల పాటు కొనసాగిన ఈ షో 18.29 రేటింగ్‌తో టాప్‌లో నిలిచింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నిజంగానే బిగ్‌బాస్ అనిపించుకున్నాడని అందరూ కామెంట్లు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ కన్నా ఇదే అత్యధికమని ప్రకటించింది. నాగ్ తనదైన శైలిలో షోను నడిపించిన తీరుకు అందరూ ఫిదా అయ్యారు.

  ఉత్కంఠగా మారిన ఫలితం..

  ఉత్కంఠగా మారిన ఫలితం..

  బిగ్‌బాస్ ఫినాలె ఎపిసోడ్ వరకు రాహుల్, శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్, అలీరెజాలు టాప్ 5లో ఉన్నారు. అయితే పోటీలో ఐదుగురు ఉన్నా.. అందరి దృష్టి ఓ ఇద్దరి మీదే ఉంది. గెలిచేది కూడా ఆ ఇద్దరిలో ఒక్కరేనని అందరికీ తెలిసినా.. ఎవరు టైటిల్ గెలుస్తారనేది ఉత్కంఠగా మారడంతో తెలుగు ప్రేక్షకులందరూ టీవీలకు అతుక్కుపోయారు. దాదాపు 8 కోట్లకు పైగా ఓట్లు వచ్చాయంటేనే.. జనాల్లోకి ఏ రేంజ్‌లో చొచ్చుకుపోయిందో తెలుస్తోంది.

  English summary
  Bigg Boss 3 Telugu Highest TRP For Finale Episode. BiggBossTelugu Season 3 Finale scores a TRP of 18.29 for 4.5 hours. Congratulations team BBTelugu, StarMaa.The highest ever TRP of any BB across India.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X