For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  శ్రీముఖి భిక్ష వల్లే.. బిగ్‌బాస్ షో పరువుపోయింది.. రాహుల్‌పై ట్రోలింగ్

  |

  వంద రోజుల నిరీక్షణకు తెరపడింది. పదిహేను మంది కంటెస్టెంట్లు, రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, ఒక రీ ఎంట్రీతో బిగ్‌బాస్ షో హైప్ పెంచుకుంటూ పోయింది. చివరకు టాప్5 లో రాహుల్, శ్రీముఖి, బాబా భాస్కర్, అలీ రెజా, వరుణ్‌లు ఉండగా.. ఎవరు గెలుస్తారనే అంశంపై అందరూ ఓ అంచనాకు రాగా.. వారి వారి ఫ్యాన్స్ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. టైటిల్ గెలిచే అర్హత తమ అభిమాన కంటెస్టెంట్‌కు ఉందంటే కాదు కాదు.. మా కంటెస్టెంట్‌కే ఆ అర్హత ఉందని వాదనలకు దిగుతున్నారు.

  టైటిల్ గెలిచిన రాహుల్..

  టైటిల్ గెలిచిన రాహుల్..

  ఏ మాత్రం అంచనాలు లేకుండా, ఎలాంటి స్ట్రాటజీలు వాడకుండా అంతకంతకూ మాస్ ఫాలోయింగ్ పెంచుకుంటూ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఎదుగుతూ వచ్చాడు హైద్రాబాద్ గల్లీ పోరడు రాహుల్ సిప్లిగంజ్. టాప్5లో ఫస్ట్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి అందరి అంచనాలు తలకిందులు చేసేశాడు. అటుపై ఓటింగ్ పోరులో రాహుల్ సైన్యం భీకరంగా శ్రమించి విజయాన్ని అందజేసినట్టు తెలుస్తోంది. బిగ్‌బాస్3 టైటిల్‌ను రాహుల్ గెలిచేశాడంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది.

   గెలవడానికి కారణాలివే..

  గెలవడానికి కారణాలివే..

  కొందరికి తన మాట చేదుగా అనిపిస్తే.. అది మా గల్లీ భాష అంటూ మరి కొందరు సమర్థించుకున్నారు. భాష తీరు ఎలా ఉన్నా.. మనసులో ఏది పెట్టుకోకుండా.. ఎవ్వరికీ భయపడకుండా ఉన్న మనస్తత్వమే అందరికీ దగ్గరయ్యేలా చేసింది. టాస్క్‌లు సరిగా ఆడకపోయినా.. ముక్కుసూటిగా వ్యవహరించడమే తన విజయానికి కారణమైందని అతని ఫాలోవర్స్ అంటున్నారు. స్నేహానికి విలువ ఇవ్వడం.. స్నేహం కోసం టాస్క్‌లో ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకోవడం లాంటివే రాహుల్‌ను విజయ తీరాలకు చేర్చాయని కామెంట్లు చేస్తున్నారు.

  రన్నర్‌గా మిగిలిన శ్రీముఖి..

  రన్నర్‌గా మిగిలిన శ్రీముఖి..

  ఇప్పటి వరకు లీకు వీరుల సమచారం వృథా అయినట్లు ఎక్కడా కనిపించలేదు. మొదటి నుంచి ఎలిమినేషన్లు, రీఎంట్రీ, వైల్డ్ కార్డ్, స్పెషల్ హోస్ట్ ఇలా ప్రతీ విషయంలో లీకు వీరుల సమాచారం ఎంతో పర్ఫెక్ట్‌గా ఉంది. నామినేషన్‌లోకి రాబోయే కంటెస్టెంట్ల పేర్లు కూడా ముందుగానే లీకులు చెప్పేశారంటే వారి నెట్వర్క్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి లీకువీరులే.. రాహుల్ విజేత అయ్యాడని ప్రకటించేశారు. శనివారం రాత్రి నుంచే ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ల యుద్దం మొదలైంది. శ్రీముఖికి రన్నర్‌గా నిలవడంతో ఆమె అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

  శ్రీముఖి భిక్ష వల్లే..

  శ్రీముఖి భిక్ష వల్లే..

  శ్రీముఖి భిక్ష వల్లే రాహుల్ గెలిచాడని, ఆమె టార్గెట్ చేయడం వల్లే రాహుల్‌కు సింపతి పెరిగిందని అందుకే విన్నర్ అయ్యాడని ఏకిపారేస్తున్నారు. ఒక్క టాస్క్ కూడా సరిగ్గా చేయలేదని ఎందుకు విన్నర్‌ను చేశారని ప్రశ్నిస్తున్నారు. పులి హోర కలపినందుకు టైటిల్ ఇచ్చారా? అంటూ రాహుల్‌ను ఆట ఆడేసుకుంటున్నారు. అలాంటి వారిని విన్నర్‌ చేసి బిగ్‌బాస్ పరువు తీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  మెగా సర్ప్రైజ్..

  మెగా సర్ప్రైజ్..

  నేటి (నవంబర్ 3) సాయంత్రం అట్టహాసంగా మొదలు కానున్న ఫినాలే ఎపిసోడ్‌లో ఎంతో మంది సెలబ్రిటీలు అతిథులుగా విచ్చేయనున్నారు. ఈ ఈవెంట్‌లో మెగా సర్ప్రైజ్ కూడా ఉండబోతోంది. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ప్రకారం రాహుల్ బిగ్‌బాస్ కప్పును చేజిక్కించుకున్నాడా..? లేదా ఏదైనా మ్యాజిక్ జరగనుందా? అన్నది చూడాలి.

  English summary
  Bigg Boss 3 Telugu Buzz Is That Rahul Sipligunj Won Title. Sree Mukhi Got Second Place And Become Runner. Bigg Boss 3 Telugu Negative Trolling on Rahul Winning Title.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X