For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అదేమైనా బ్రాందీ విస్కీ అనుకుంటున్నావా.. ఈ గలీజోడు నాకొద్దు అంటూ పునర్నవి ఫైర్

|
Bigg Boss 3 Telugu : Episode 75 Highlights || ఈ గలీజోడు నా కొద్దు అంటూ పునర్నవి ఫైర్

బిగ్ బాస్ హౌస్లో రాహుల్, పునర్నవి మధ్య ఏదో జరగుుతోందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. అయితే తమ మధ్య ఉన్నది స్నేహమే అంటోన్న వారి వ్యవహారం ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుంది. ఎన్నో సందర్భాల్లో నాగార్జున కూడా ఈ విషయంపై వారిని ప్రశ్నించాడు. అయితే తమది కాంప్లికేటెడ్ ఫ్రెండ్ షిప్ అంటూ అర్థం కాని విధంగా చెబుతూ దాటవేస్తుంది.ఇక నేటి ఎపిసోడ్లో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ హైలెట్ గా నిలిచింది.

బ్రాందీ విస్కీ అనుకుంటున్నావా?

బ్రాందీ విస్కీ అనుకుంటున్నావా?

డెటాల్ ను ఎక్కువగా వాడుతున్నాడని రాహుల్ పై పునర్నవి ఫైర్ అయింది. అదేమైనా బ్రాందీ విస్కీ అనుకుంటున్నావా? అంటూ రెచ్చిపోయింది. దాన్ని ఒక్కరోజులో అయిపోయేలా వాడాడంటూ కెప్టెన్ శ్రీముఖికి ఫిర్యాదు చేసింది. అయితే ఈ సంభాషణ తిరిగి తిరిగి ఎక్కడికో వెళ్లిపోయింది.

ఈ గలీజోడు నాకొద్దు..

ఈ గలీజోడు నాకొద్దు..

పునర్నవి తిట్ల దండకంపై గత వారమే నాగ్ క్లాస్ పీకిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే పున్ను ఏ మాత్రం తగ్గడం లేదు. రాహుల్ ను చెడామడా తిట్టేస్తుంది. ఇదే విషయమై వరుణ్ తో చెబితే.. అది ప్రేమా అని అనేశాడు. మరి నాకేంటి అలా అనిపించడం లేదంటూ రాహుల్ సైతం కామెడీ చేశాడు. డెటాల్ విషయమై ఫైర్ అయిన పునర్నవి కూల్ చేసే ప్రయత్నం చేశాడు రాహుల్.

పునర్నవి అభిమాన సంఘం..

పునర్నవి అభిమాన సంఘం..

పునర్నవి అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు, అందులో పాల్గొంటావా? అంటూ శివజ్యోతి రాహుల్ ను అడిగింది. తాను పీఏ, పీఆర్ గా పనిచేస్తానని రాహుల్ చెప్పాడు.. అయితే ఈ గలీజోడు నాకొద్దు అంటూ ముఖం మీదే చెప్పేసింది. ఇక పునర్నవిని కూల్ చేసేందుకు ఆమె చేతులను నొక్కుతూ మాసాజ్ చేశాడు.

 టాస్క్లో నెగ్గిన బాబా..

టాస్క్లో నెగ్గిన బాబా..

ప్రిజ్మా బ్యాలెన్స్ ఫ్రేమ్ అంటూ ఆడించిన ఈ టాస్క్లో.. తలపై బ్లాక్ ను పెట్టుకుని బ్యాలెన్స్ చేస్తూ నిలబడాలి. అయితే ఈ టాస్క్లో శ్రీముఖి ఫస్ట్ అవుట్ అయి బయటకు వచ్చేసింది. అలీ కూడా తొందరగానే అవుటయ్యాడు. ఇక చివరి వరకు బాబా, శివజ్యోతి నిలబడ్డారు. అయితే చివరి క్షణం వరకు పట్టు వదలని విక్రమార్కుడిలా ఉండి.. విజయం సాధించాడు. నా విజయాన్ని ఆడియన్స్కు అంకితం చేస్తున్నాను అంటూ బాబా తెలిపాడు.

తిలకం.. కోడిగుడ్డుతో టాస్క్..

తిలకం.. కోడిగుడ్డుతో టాస్క్..

ఫైనల్ రౌండ్ వరకు వచ్చిన వితికా, బాబా భాస్కర్ మధ్య ఈ పోటీ జరగుతుందని బిగ్ బాస్ తెలిపాడు. అయితే మిగతా హౌస్ మేట్స్ తమకు నచ్చిన వారికి తిలకం దిద్దాలని, నచ్చని వారి తలపై కోడి గుడ్డు పగలగొట్టాలని తెలిపాడు. దీంతో శ్రీముఖి, మహేష్, శివజ్యోతి బాబాకు తిలకం దిద్ది, వితికా తలపై కోడి గుడ్డును పగలగొట్టారు. అలీ, వితికా, రాహుల్, పున్ను, వరుణ్ వితికాకు తిలకం దిద్ది.. బాబా తలపై కోడి గుడ్డును పగలగొట్టారు.

వరుణ్ బ్యాచ్ గురించి శ్రీముఖి

వరుణ్ బ్యాచ్ గురించి శ్రీముఖి

గత వారం చూపించిన వీడియోలకు బాబా భాగానే ఫీలైనట్లు కనిపిస్తోంది. వరుణ్ బ్యాచ్ గురించి శ్రీముఖి దగ్గర చెప్పుకొచ్చాడు. తన ముందుకు వచ్చే సరికి బాగా నటిస్తారంటూ మహేష్ చెప్పుకొచ్చాడు. పడుకునే సమయంలో రాహుల్, పునర్నవిలు టాస్క్ గురించి, బాబా ప్రవర్తన గురించి ముచ్చటించుకున్నారు. శ్రీముఖి మీద ఉన్న ఇంప్రెషన్ బాబా మీద చూపిస్తున్నామోనని అనిపిస్తోందంటూ పునర్నవితో చెప్పుకొచ్చాడు.

English summary
Bigg Boss 3 Telusu Eleventh Week Updates, In Battle Of Madel Second level Baba Bhaskar Won The Task, Rahul And Punarnvi Fight Each Other. Later They Become Normal. At End Of The Episode Mahesh Bitches About VarunBatch In Front Of Srimukhi.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more