twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓటింగ్‌లో దూసుకుపోతున్న రాహుల్.. హోరాహోరిగా ఫ్యాన్స్ ప్రచారం

    |

    వంద రోజుల ఆట.. పదిహేను మంది వేటగాళ్లతో మొదలవ్వగా.. మధ్యలో ఇద్దరు వచ్చినట్టే వచ్చి వెళ్లిపోగా.. చివరకు ఐదుగారు మాత్రమే మిగిలారు. బిగ్‌బాస్ టైటిల్ గెలిచే పోరులో చివరకు ఐదుగురు మిగిలారు. నామినేషన్ స్టార్ అయిన రాహుల్ అందరి కంటే ముందుగా ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు. రీసెంట్‌గా శివజ్యోతి ఎలిమినేట్ అవడంతో మిగిలిన ఐదుగురు టైటిల్ కోసం తలపడనున్నారు.

     అలీకి విన్నర్ అయ్యే అవకాశాలు అతి తక్కువ..

    అలీకి విన్నర్ అయ్యే అవకాశాలు అతి తక్కువ..

    ఒకసారి ఎలిమినేట్ అయి మళ్లీ రీఎంట్రీ ఇవ్వడం, అది కూడా ప్రేక్షకుల అనుమతి తీసుకోకుండా అలీని రీఎంట్రీలో రప్పించడం వంటి కారణాలతో అలీ ఎట్టిపరిస్థితిలోనూ విన్నర్ అయ్యే అవకాశం లేనట్టు కనిపిస్తోంది. రీఎంట్రీ ఇచ్చాక అలీ వ్యవహారం చాలా మంది గుర్రుగా ఉన్నారు. అంతకుముందు ఉన్న అలీ కావాలని అడిగితే.. అమ్మలక్కల ముచ్చట్లు పెడుతున్నాడని నాగ్ గడ్డి పెట్టాడు. ఇదే విషయమై అతని భార్య కూడా మందలించింది.

    మిగిలిన నలుగురికి పోటాపోటీ..

    మిగిలిన నలుగురికి పోటాపోటీ..

    అలీని మినహాయిస్తే మిగిలిన నలుగురు (రాహుల్, శ్రీముఖి, వరుణ్, బాబా) బలమైన కంటెస్టెంట్లు. ఎవరు గెలుస్తారన్నది ఇప్పుడే చెప్పడం కష్టమే. అసలైన పోరు మాత్రం రాహుల్, శ్రీముఖి హోరాహోరీగా జరుగుతున్నట్లు సమాచారం. ఓటింగ్‌లో వీరిద్దరి మధ్యే అసలైన రణరంగం జరుగుతున్నట్లు సమాచారం. ఇద్దరి అభిమానులు తమ కంటెస్టెంట్ల గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.

    చివరి క్షణం వరకు ఉత్కంఠే..

    చివరి క్షణం వరకు ఉత్కంఠే..

    అయితే చివరి క్షణం వరకు చివరి ఓటు లెక్క తేలే వరకు పరిస్థితిని అంచనా వేయలేం. ఇదంతా ఓ వైపు నడుస్తోంటే.. తమ అభిమాను కంటెస్టెంట్ల తరపును ర్యాలీలు, సేవా కార్యక్రమాలు, సెలబ్రిటీల చేత ప్రకటనలు చెప్పించడం ఇలా ఏదోకటి చేస్తూనే ఉన్నారు. మిగిలిన ఈ రెండు మూడు రోజులు విజయం కోసం అహర్నిశలు కష్టపడేందుకు సిద్దమయ్యారు.

    జోష్ మీదున్న రాహుల్ ఆర్మీ..

    జోష్ మీదున్న రాహుల్ ఆర్మీ..


    హైదరాబాద్‌లో ముఖ్యంగా ఓల్డ్ సిటీలో రాహుల్ ప్రభావం కాస్త గట్టిగానే కనిపిస్తోంది. రాహుల్ తన ప్రవర్తనతో, మనసులో ఏది పెట్టుకోకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే తన మనస్తత్వంతో ఎంతో మంది అభిమానులను గెలుచుకున్నాడని అతని ఫాలోవర్స్ చెబుతున్నారు. ఈ క్రమంలో రాహుల్ బిగ్‌బాస్ విన్నర్‌గా నిలవాలని పలు సేవా కార్యక్రమాలను చేపట్టినట్టు తెలిపారు.

    మరో వైపు రాములమ్మ టీమ్...

    మరో వైపు రాములమ్మ టీమ్...


    బిగ్‌బాస్ షోలో నిరంతరం ఆట కోసం మాత్రమే ఆలోచించే శ్రీముఖికి గట్టి ఫాలోయింగే ఏర్పడింది. అయితే ఆట వరకు, ఎంటర్టైన్మెంట్ వరకు శ్రీముఖికి మద్దతుగా చాలా మంది నిలుస్తున్నా.. ప్రవర్తన పరంగా కాస్త నెగెటివిటీ కూడా పెరిగింది. దీంతో శ్రీముఖి తరుపున ఆమె అభిమానులు కూడా సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఇక చివరకు ఎవరు గెలుస్తారో చూడాలి.

    English summary
    Bigg Boss 3 Telugu Final Race. Rahul Sipligunj ANd Sreemukhi Are In Leading. These Two Contestants Are in Top As per Now. Rahul Fans Are Doing Huge Campaingn For His Winning.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X