For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  శ్రీముఖి నెంబర్ వన్ కాదు.. బాబాది ఓవర్ కాన్ఫిడెంట్.. టాప్ 5కి అనర్హులు వారే

  |
  Bigg Boss Telugu 3 : Episode 91 Highlights| వితికాను ఏడ్పించిన వరుణ్

  బిగ్‌బాస్ ఈ వారం అంతా ఫ్యామిలీ టచ్ ఇవ్వగా.. వీకెండ్‌లో నాగ్ కూడా అలాంటి టచ్చే ఇచ్చాడు. కంటెస్టెంట్లకు సంబంధించిన ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్‌ను వారి ముందుకు తీసుకొచ్చాడు. నెంబర్లతో మొదలైన ఈ వారం నామినేషన్ ప్రక్రియను.. మళ్లీ నంబర్ల గేమ్‌తో ముగించేశాడు. అయితే ఈసారి ఆడియెన్స్ అభిప్రాయాన్ని కూడా తీసుకున్నారు. దీంట్లో అనూహ్యంగా శ్రీముఖి, శివజ్యోతిలను నెంబర్ 1 కాదంటూ తీర్పునిచ్చారు.

  బాబా ఓవర్ కాన్ఫిడెంట్..

  బాబా ఓవర్ కాన్ఫిడెంట్..

  వీకెండ్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలీదు కాబట్టి ప్రతీ శుక్రవారం ఇంటిసభ్యులందరూ సూట్‌కేసులను సర్ది.. స్టోర్‌రూమ్‌లో పెట్టడం ఆనవాయితీగా వస్తుందని అందరికీ తెలిసిందే. ప్రతీ వారం ఖాళీ సూట్‌కేసులను పంపుతాడన్న విషయం తెలిసిందే. ఈ వారం కూడా అదే చేశాడు. ఇదే విషయంపై శ్రీముఖి పేరడీ సాంగ్ కూడా పాడింది. బాబాకు బాగానే కాన్ఫిడెన్స్ పెరిగిందని నాగార్జున కూడా అన్నాడు.

  వితికాను ఏడ్పించిన వరుణ్

  వితికాను ఏడ్పించిన వరుణ్

  నేను వెళ్తే ఉండగలవా అంటూ వరుణ్‌ను వితికా ప్రశ్నించింది. రెండు వారాలే కదా అని వరుణ్ సమాధానమిచ్చాడు. ఒకవేళ తాను వెళ్లిపోతే.. జాగ్రత్తగా ఉండు అని.. తన ఆట కూడా ఆడి అంటూ వరుణ్‌కు సలహా ఇచ్చింది. రాహుల్‌కు ఆకలి వేయడంతో.. శివజ్యోతిని దోషలు తీసుకుని రావా అని అడిగాడు. ఇక ఆ సమయంలో పునర్నవిని గుర్తుకు తెచ్చుకున్నాడు. నీకు ఒకరు తెచ్చివ్వాలరా? అని తిట్టేదని అలీతో చెప్పుకొచ్చాడు. లివింగ్ ఏరియాలో కూర్చున్న వితికాను వరుణ్ సరదాగా ఏడ్పించాడు. పాటలు పాడుతూ విసిగించేసరికి.. ఇరిటేట్ చేయకంటూ ఫైర్ అయింది.

  నెంబర్లతో ఆట..

  నెంబర్లతో ఆట..

  ఈ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా నెంబర్ల కోసం పోట్లాడిన ఇంటి సభ్యులకు అలాంటి టాస్క్‌నే నాగార్జున ఇచ్చాడు. వారి ఓ నంబర్‌ను తీసుకుని.. ఆ ప్లేస్‌లో ఎందుకు అర్హులో చెప్పాలని తెలిపాడు. దీంతో మొదటగా రాహుల్ నాల్గో పొజిషన్‌కు అర్హుడని పేర్కొంటే..ఆడియెన్స్ మాత్రం కాదని జవాబిచ్చారు. వితికా నెంబర్ 3 సెలెక్ట్ చేసుకుంటే ఆడియెన్స్ కాదని తమ నిర్ణయాన్ని ప్రకటించారు.

  శ్రీముఖి, శివజ్యోతి నెంబర్ 1 కాదు..

  శ్రీముఖి, శివజ్యోతి నెంబర్ 1 కాదు..

  బాబా భాస్కర్ కూడా మూడో నెంబర్‌ను సెలెక్ట్ చేసుకోగా.. ఆడియెన్స్ బాబా నిర్ణయంతో ఏకీభవించారు. అలీ రెండో నెంబర్‌ను సెలెక్ట్ చేసుకోగా.. ఆడియెన్స్ కాదని జవాబిచ్చారు. వరుణ్ ఏడో నెంబర్‌ను ఎంచుకోగా.. కాదని జవాబిచ్చారు. శివజ్యోతి, శ్రీముఖి నెంబర్ 1 అని సెలెక్ట్ చేసుకోగా కాదని ఆడియెన్స్ తేల్చిపడేశారు.

  ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో ఆట..

  ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో ఆట..

  బిగ్‌బాస్ ఈ వారం అంతా ఫ్యామిలీ టచ్ ఇవ్వగా.. వీకెండ్‌లో నాగ్ కూడా అలాంటి టచ్చే ఇచ్చాడు. కంటెస్టెంట్లకు సంబంధించిన ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్‌ను వారి ముందుకు తీసుకొచ్చాడు. అయితే దానికంటే ముందుగా వారు ఓ టాస్క్ చేయాల్సి ఉంటుందని తెలిపాడు. వచ్చిన గెస్ట్‌లు హౌస్‌లోపల ఉన్న వారిలో 6, 7 పొజిషన్లలో ఎవరుంటారోనన్న విషయాన్ని తెలపాలి. అయితే వీరు ఈ టాస్క్ ఆడుతుండగా.. హౌస్మేట్స్ మాట్లాడటానికి వీల్లేదని తెలిపాడు. వీరు మాట్లాడుతున్నది కంటెస్టెంట్లు వింటున్నట్టుగా వారికి తెలియదని చెప్పాడు.

  వితికా, అలీలు టాప్ 5 కాదు..

  వితికా, అలీలు టాప్ 5 కాదు..

  మొదటగా వచ్చిన వరుణ్ సోదరి పూజ.. శివజ్యోతి, అలీని ఆరు, ఏడు పొజిషన్లకు పరిమితం చేసింది. శ్రీముఖి నాన్న రామకృష్ణ రాథోడ్.. అలీ, వితికాలను ఆరు, ఏడు పొజిషన్లలో పెట్టాడు. శివజ్యోతి బంధువు స్వప్న.. వితికా, అలీని ఆరు, ఏడు పొజిషన్లలో పెట్టేసింది. వితిక అమ్మ అనంత లక్ష్మీ వచ్చి.. శివజ్యోతి, అలీని పేర్కొంది. అలీ తరుపున యాంకర్ రవ వచ్చి శివజ్యోతి, వితికల పేర్లను తెలిపాడు. రాహుల్ కోసం అతని ఫ్రెండ్ నోయెల్ వచ్చి.. వితిక, బాబాలను పేర్లను తెలిపాడు. మెజార్టీ సభ్యులు వితికా, అలీలను టాప్ 5 కంటెస్టెంట్లుగా గుర్తించలేదు.

  సేవ్ అయిన ముగ్గురు సభ్యులు..

  సేవ్ అయిన ముగ్గురు సభ్యులు..

  నామినేషన్‌లో భాగంగా ముగ్గురు సభ్యుల సేవ్ అయ్యారు. వారి తరుపున వచ్చిన వారు తెచ్చిన గిఫ్ట్‌లోనే కంటెస్టెంట్ల భవిష్యత్తును బిగ్‌బాస్ దాచి పెట్టాడు. ఈ క్రమంలో శ్రీముఖి, రాహుల్, బాబా సేవ్ కాగా.. మిగిలిన వారు డేంజర్ జోన్‌లో ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అయ్యారన్నది తెలియాలంటే ఆదివారం ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఆగాలి.

  English summary
  Bigg Boss 3 Telugu 13th Week Updates. Rahul Srimukhi Baba Bhaskar Saved In 13th Week. Siva Jyothi, Varun, ali Reza, Vithika Sheru Are In danger Zone.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X