For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వరుణ్ బామ్మకు ఓట్లు.. శ్రీముఖి అమ్మకు తిట్లు.. బాబా భాస్కర్‌కు చీవాట్లు..

  |
  Bigg Boss Telugu 3| Sreemukhi's Mom Sweet Warning To Rahul Sipligunj| వరుణ్ బామ్మకు ప్రేక్షకుల ఓట్లు

  నిన్నటి ఎపిసోడ్‌తో బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్.. పూర్తైంది. ఏడుగురు కంటెస్టెంట్లు.. ఏడుగురు అతిథులు.. ఏడు స్టార్లు.. పడిపోయిన బిగ్‌బాస్ హోటల్‌ను వచ్చిన ఏడుమంది అతిథులు ఇచ్చిన స్టార్లతో తిరిగి సెవెన్ స్టార్ హోటల్‌గా మారింది. దీంతో టాస్క్ పూర్తయినట్లు బిగ్‌బాస్ తెలిపాడు. అయితే ఈ ఏడుగురు అతిథుల్లో వరుణ్ బామ్మకు మాత్రమే ఎక్కువ ఓట్లు పడుతున్నాయి.

  టైమింగ్‌తో పడేసిన బామ్మ..

  టైమింగ్‌తో పడేసిన బామ్మ..

  వరుణ్ బామ్మ ఎంట్రీ ఇవ్వడంతో వితికా సంబరపడిపోయింది. లోపలికి తీసుకెళ్లి అతిథి మర్యాదలు చేశారు. అనంతరం లివింగ్ ఏరియాలో కూర్చోబెట్టి మాట్లాడసాగారు. అయితే బామ్మ వేసిన కౌంటర్‌లకు హౌస్మేట్స్ అందరూ పగలబడి నవ్వారు. టైమ్ ఎంత అంటే చెప్పలేదు.. దీపావళి వస్తుంది అని చెబితే.. ఎప్పుడు అని కంటెస్టెంట్లందరూ ఆసక్తిగా అడగ్గా.. ఎప్పుడొకప్పుడు వస్తుందిలే అంటూ కౌంటర్ వేసింది. బిగ్‌బాస్‌ను ఇంటికి పిలవడం, కనీసం ఫోటో అయిన పంపించడంటూ అడగడం హైలెట్‌గా మారింది. దీంతో బామ్మ హ్యుమరస్‌కు నెటిజన్లందరూ ఫిదా అయ్యారు. బామ్మ సూపర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

  శ్రీముఖి అమ్మకు తిట్లు..

  శ్రీముఖి అమ్మకు తిట్లు..

  శ్రీముఖి వాళ్ల అమ్మ ఎంట్రీ ఇచ్చి.. మళ్లీ వెళ్లిపోవడంతో శ్రీముఖి వెక్కి వెక్కి ఏడ్చింది. అయితే మళ్లీ తిరిగి ఎంట్ర ఇచ్చేసరకి ఆనందంలో మునిగిపోయింది. ఎవ్వరినీ లోనికి రావొద్దని చెప్పు అంటూ వితికాకు ఆర్డర్ వేసింది. తల్లీ కూతుళ్లిద్దరూ కోర్ట్ యార్డ్‌లో షో గురించి, శ్రీ ముఖి పాపులారిటీ గురించి, రాహుల్ తనను తిట్టడం ఇలా ప్రతీ విషయాన్ని చర్చించుకున్నారు. బయటకు వచ్చి.. రాహుల్‌కు స్వీట్ వార్నింగ్ లాంటిది ఇచ్చింది.

   రాహుల్‌ను పాయింట్ అవుట్ చేయడంపై కామెంట్స్..

  రాహుల్‌ను పాయింట్ అవుట్ చేయడంపై కామెంట్స్..

  రాహుల్‌ను అలా పాయింట్ అవుట్ చేసి మాట్లాడటం కొంతమంది ఫైర్ అవుతున్నారు. వచ్చిన ఏ అతిథి కూడా మిగతా వారెవ్వరినీ వేలెత్తి చూపలేదు. అందరితో మంచిగానే మాట్లాడారు. వారికి సంబంధించిన వారితో కొంత ప్రైవసీగా మాట్లాడారు. కానీ శ్రీముఖి వాళ్ల అమ్మ మాత్రమే రాహుల్‌ను కావాలని టార్గెట్ చేసిందని ఆరోపిస్తున్నారు. శ్రీముఖి అల్లరి నచ్చుతుందని చెప్పిందే తప్పా.. రాహుల్ వాళ్ల అమ్మ ఎలాంటి నెగిటివ్ చెప్పలేదని అంటున్నారు.

  మిగిలింది రెండు వారాలే...

  మిగిలింది రెండు వారాలే...

  వచ్చిన అతిథులు తమ తమ కంటెస్టెంట్లకు చెప్పింది ఒక్కటే ఉన్నవి రెండు వారాలే. బాగా ఆడండి.. అందరూ బాగానే ఆడుతున్నారు.. ఇంకా ఆడండి.. టాస్కులు బాగా చేయండి.. అంటూ చెప్పుకొచ్చారు. విన్నర్ అయ్యే అర్హత బాబాకే ఉందని అతని భార్య, టైటిల్ మనదే అని శివజ్యోతి భర్త, అందరూ నీకే ఓట్లు వేస్తున్నారని శ్రీముఖి అమ్మ.. ఇలా చెప్పుకొచ్చి వాళ్లలో ధైర్యాన్ని నింపారు.

   లతా లతా అంటూ పరిగెత్తడం

  లతా లతా అంటూ పరిగెత్తడం

  శ్రీముఖి అమ్మను చూసి బాగుందని చెప్పడం, హగ్ చేసుకునేందుకు వెళ్తున్నట్లుగా ఉండటం.. వెంటనే శివజ్యోతి పక్కకు లాగడం, ఆ విషయాన్ని బాబా సమర్థించుకోవడం.. కిచెన్‌లో వంట చేసుకుంటూ.. ఆమెను తలుచుకుంటూ పాటలు పాడటం.. రామకృష్ణ జిరాక్స్ అంటూ ఇద్దరూ సేమ్ అని అనడం.. మోకాళ్లపై కూర్చొని కాఫీ అందించడం.. చివరకు వెళ్లిన తరువాత లతా అంటూ పరిగెత్తడం లాంటి వాటితో నెటిజన్లు బాబాపై ఫైర్ అవుతున్నారు. కాస్త ఎక్కువైందంటూ బాబాను ఏకిపారేస్తున్నారు. వీటిపై నాగార్జున ఏమైనా ప్రశ్నిస్తాడో లేదో చూడాలి.

  English summary
  Bigg Boss 3 Telugu 13th Week updates. All housemates Family Members Visiting Bigg Boss House. In Yesterday Episode Sivajyothi, Baba Bhaskar Families Entered Into House. Today Episode Varun, rahul And Srimukhi Families Enters Into House. Netizens Fires On Srimukhi Mother. varun Grand Mother Stoles Netizens Hearts.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X