For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బిగ్‌బాస్ విన్నర్ శ్రీముఖి .. కొట్టిపారేసిన ఆమె సోదరుడు

  |

  బిగ్‌బాస్ హౌస్ ఇక ఈ పదం వినపడదు. బిగ్‌బాస్ గొంతును కూడా మనం వినలేము. పదిహేను మంది కంటెస్టెంట్లు, ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు.. భీకరమైన పోరు.. అలకలు, అరుపులు, ప్రేమలు, ద్వేషాలు, కోపాలు, తాపాలు ఇలా ఎన్నింటినో దాటుకుని చివరకు ఐదుగురు మిగిలారు. ఆఖరకు ఒక్కరే గెలుస్తారు. ఆ ఒక్కరు ఎవరన్నది తేలడానికి సమయం దగ్గరపడింది. టాప్5లో నిలిచిన శ్రీ ముఖి, రాహుల్, బాబాభాస్కర్, వరుణ్ సందేశ్, అలీ రెజాల తరుపును వారి వారి ఫాలోవర్స్ ఉదృతంగా ప్రచారం చేస్తున్నారు.

   ఓట్లేయండంటూ ర్యాలీలు, ఫ్లెక్సీలు

  ఓట్లేయండంటూ ర్యాలీలు, ఫ్లెక్సీలు

  టికెట్ టు ఫినాలే అందుకుని రాహుల్ నేరుగా ఫైనల్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. బాబా భాస్కర్ రెండో ఫైనలిస్ట్‌గా రావడం.. శివజ్యోతి ఎలిమినేట్ కావడం గత వారం చూశాం. ప్రస్తుతం టాప్5లో ఉన్న కంటెస్టెంట్ల తరుపున వారి పీఆర్ టీమ్స్ గట్టిగానే ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. అభిమానులు కూడా స్వచ్ఛందంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు కట్టి ఓట్లు వేయమని కోరుతున్నారు.

   దూసుకుపోతోన్న కంటెస్టెంట్లు..

  దూసుకుపోతోన్న కంటెస్టెంట్లు..

  ఓటింగ్ లైన్లు తెరిచిన క్షణం నుంచి భారీ ఎత్తున ఓట్లు నమోదు అవుతోన్నట్లు సమాచారం. ఈ మేరకు కంటెస్టెంట్ల తరుపున సెలెబ్రిటీలు సైతం రంగంలోకి దిగారు. సీరియల్ యాక్టర్స్, సింగర్స్ తమకు ఇష్టమైన కంటెస్టెంట్లకు మద్దతు ప్రకటించి ఓట్లను అర్థిస్తున్నారు. ఇప్పటివరకు వినిపిస్తున్న టాక్ ప్రకారం రాహుల్, శ్రీముఖి మధ్యే అసలైన పోరు నడుస్తోంది. ఓటింగ్ శాతంలో వీరిద్దరికీ పెద్ద తేడా కూడా కనిపించడం లేదని సమాచారం.

  కాస్త వెనుకబడిన ఆ ముగ్గురు..

  కాస్త వెనుకబడిన ఆ ముగ్గురు..

  బాబా భాస్కర్, వరుణ్, అలీ రెజాలు ఓటింగ్‌లో కాస్త వెనుకబడ్డట్లు తెలుస్తోంది. నిజాయితీగా ఉండటం, అందర్నీ ఎంటర్టైన్ చేయడంతో ఇంత వరకు సేవ్ అవుతూ వచ్చిన బాబా భాస్కర్‌కు బాగానే ఫాలోయింగ్ ఏర్పడింది. ఎలాంటి పీఆర్ టీమ్ లేకపోయినా.. అందరికీ గట్టి పోటి ఇస్తున్నాడు. వరుణ్ సందేశ్ మిస్టర్ కూల్‌గా పేరు సంపాదించి బాగానే క్రేజ్ ఏర్పరుచుకున్నా.. ఓట్లు మాత్రం అదే రేంజ్‌లో రావడం లేదని తెలుస్తోంది. మిస్టర్ అగ్రెసివ్‌గా పాపులర్ అయిన అలీకి రీఎంట్రీ శాపమైనట్లు కనిపిస్తోంది.

  శ్రీముఖి విన్నర్ అంటూ

  అయితే బిగ్‌బాస్ విన్నర్ శ్రీముఖి అంటూ కప్పు పట్టుకుని, నాగార్జునను హత్తుకుని ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దీనిపై భిన్న రకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు. ఇంకా షూటింగే మొదలుకాలేదు.. విన్నర్‌ను ఎలా ప్రకటిస్తారంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.. ఎలాగైనా శ్రీముఖే విన్నర్ కదా ఎప్పుడు ప్రకటిస్తే ఏంటని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. అది ఎడిట్ చేసిన పిక్ అని నెటిజన్లు కొట్టిపారేస్తున్నారు. ఇదే విషయాన్ని శ్రీముఖి సోదరుడు శుశ్రుత్ కూడా ఖండించాడు.

  మిగిలింది ఒక్క రోజే అంటూ..

  మిగిలింది ఒక్క రోజే అంటూ..

  ఓట్లు వేయడానికి మిగిలింది ఒక్క రోజే అంటూ అందరూ ప్రచారాన్ని పెంచేశారు. శ్రీముఖి తమ్ముడు శుశ్రుత్, రాహుల్ స్నేహితుడు నోయెల్, వరుణ్ సందేశ్, అలీ పీఆర్ టీమ్‌లు ప్రచారాన్ని మరో లెవెల్‌కు తీసుకెళ్తున్నారు. చివరి క్షణం వరకు ఆగకుండా ఓట్లు వేయండంటూ అభిమానులను కోరుతున్నారు.

  మెగా ఈవెంట్..

  మెగా ఈవెంట్..

  బిగ్‌బాస్ విన్నర్‌ను ప్రకటించే ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా రానున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇస్మార్ట్ బ్యూటీలను దింపి స్టేజ్‌పై దుమ్ములేపేందుకు బిగ్‌బాస్ బృందం రంగం సిద్దం చేస్తోందట. గతంలో లాగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లతో ఆటపాటల కార్యక్రమాలు ఉంటాయో లేదో చూడాలి.

  English summary
  Bigg Boss 3 Telugu Updates. Top 5 Contestants Rahul, Sreemukhi, Baba Bhaskar, Varun Sandesh, Ali Reza Are Doing Well In Voting. Sushruth Condemns Fake News On Sreemukhi
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X