Just In
- 1 hr ago
మెగా హీరోయిన్ ప్రాణాలకు ముప్పు: ఏకంగా పోలీసులకే వార్నింగ్ కాల్స్.. షాక్‌లో సినీ పరిశ్రమ!
- 1 hr ago
నరాలు కట్ అయ్యే రూమర్.. అగ్ర దర్శకుడితో రామ్ చరణ్, యష్, ఇక ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే!
- 1 hr ago
ప్రభాస్ ‘సలార్’లో విలన్‌గా సౌతిండియన్ స్టార్ హీరో: ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ యూటర్న్
- 2 hrs ago
సావిత్రి మంచిదే అయితే ఎందుకలా చచ్చింది.. అలా చేయడమే తప్పా: షకీలా సంచలన వ్యాఖ్యలు
Don't Miss!
- News
జగన్‌కు కేసీఆర్ మరో సవాల్- తేనెతుట్టెను కదుపుతూ-బీజేపీ నుంచీ తప్పని ఒత్తిడి
- Sports
స్మిత్‌ను ఎందుకు వదిలేశారు?.. వార్నర్ కన్నా స్టీవ్ పెద్ద నేరస్థుడు: ఇయాన్ చాపెల్
- Automobiles
ఒక ఛార్జ్‌తో 130 కి.మీ.. డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేని కొత్త ఒకినవ స్కూటర్
- Finance
హీరో మోటోకార్ప్ అరుదైన ఘనత, షారూక్ ఖాన్ చేత 10కోట్లవ యూనిట్
- Lifestyle
మ్యారెజ్ లైఫ్ లో మీ భాగస్వామి ఇష్టపడే గాసిప్స్ ఏంటో తెలుసా...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అరియానా, అవినాష్.. బిగ్ బాస్ తరువాత కూడా అదే కెమిస్ట్రీ.. అలా క్యాష్ చేసుకుంటున్నారు
బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా కొన్ని జంటలకు ఈ సారి మంచి క్రేజ్ దక్కింది. ముందుగా మోనాల్ గజ్జర్ ట్రయాంగిల్ లవ్ స్టోరీతో ఏ స్థాయిలో క్రేజ్ అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక మధ్యలో అభిజిత్, హారిక జోడి కూడా బాగానే హైలెట్ అయ్యింది గాని షో ఎండ్ అయిన తరువాత ఆమె నా చెల్లి అంటూ అభి పెద్ద షాక్ ఇచ్చాడు. ఇక వారి తరువాత హడావిడి చేసిన జోడి అరియానా, అవినాష్. హౌజ్ నుంచి వచ్చిన తరువాత కూడా వీళ్ళ హడావుడి ఏ మాత్రం తగ్గడం లేదు.

సరికొత్త వాతావరణం క్రియేట్ చేసిన జోడి
జబర్దస్త్ ద్వారా అప్పటికే మంచి క్రేజ్ ఉన్న అవినాష్ బిగ్ బాస్ లో వైడ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ అరియానా ఎంట్రీ ఇచ్చినప్పుడు మాత్రం ఆమె ఎక్కువగా తెలియని కంటెస్టెంట్ అనే చెప్పాలి. ఒక్క RGV ఇంటర్వ్యూ ద్వారానే మంచి క్రేజ్ అందుకుంది. ఇక హౌజ్ లో ఉన్నన్ని రోజులు కూడా అవినాష్ అరియానా వారి అల్లరితో కోపాలతో సరికొత్త వాతావరణం క్రియేట్ చేశారు.

కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయ్యింది
ముఖ్యంగా హౌజ్ లో ఇద్దరి మధ్య ఒక రకమైన కెమిస్ట్రీ అయితే బాగానే వర్కౌట్ అయ్యింది. అప్పుడప్పుడు అవినాష్ ఆమెతో రొమాంటిక్ గా మాట్లాడడం అలాగే అరియానా అప్పుడప్పుడు ఎమోషన్ అయిన ముమేంట్స్ కూడా అందరిని ఎట్రాక్ట్ చేశాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా బిగ్ బాస్ లో ఒక స్పెషల్ జోడి కనిపించింది అనేలా కామెంట్స్ అందుకున్నారు.

ఎమోషనల్ గా కూధక్ టచ్ చేశారు
కేవలం గేమ్ లో హడావుడి చేయడమే కాకుండా అల్లరి చేయడంలో కూడా నెంబర్ వవ్ అనిపించుకున్నారు. అవినాష్ ఎక్కువగా అరియానాపై జోకులు వేస్తూ ఆమెను ఎంతగానో ఎట్రాక్ట్ చేశాడు. ఇక అవినాష్ ఎలిమినేట్ అవుతున్న సమయంలో బయటకు వచ్చాక నేను కూడా కలుస్తాను అంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడింది.

కన్ఫ్యూజన్ లో పడిన అవినాష్
మొత్తానికి బిగ్ బాస్ ద్వారా ఇద్దరికి మంచి ఆదాయంతో పాటు క్రేజ్ కూడా దక్కింది. ఇక బయటకు వచ్చిన తరువాత వీరు ఏ విధంగా అడుగులు వేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. అరియానా ఒక విధంగా మళ్ళీ యంకర్ గా బిజీ అవుతున్నప్పటికి అవినాష్ పరిస్థితి మాత్రం కాస్త కన్ఫ్యూజన్ లో పడింది.

బిగ్ బాస్ కోసమని.. జబర్దస్త్ కు ఎండ్ కార్డ్
అవినాష్ రెగ్యులర్ జాబ్ జబర్దస్త్ కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ 4కోసమని అవినాష్ జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి అగ్రిమెంట్ వలన 10లక్షలు కట్టాల్సి వచ్చింది. అందుకు అతను అప్పులు కూడా చేయాల్సి వచ్చింది. శ్రీముఖి, చమ్మక్ చంద్ర, యాంకర్ రవి వంటి వాళ్ళు సహాయం చేయడం వలన ఆ డబ్బు కట్టి జబర్దస్త్ లోకి వచ్చినట్లు ఇంటర్వ్యూలో చెప్పాడు.

టీవీ ప్రోగ్రామ్ కోసం అరియానా, అవినాష్
బిగ్ బాస్ వల్ల మొత్తానికి అప్పులన్ని తీర్చేసిన అవినాష్ ఇప్పుడు అరియానాతో కలిసి వర్క్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. వీరికి ఇప్పుడు క్రేజ్ మాములుగా లేదు. #Aviyana అనే హ్యాష్ ట్యాగ్ కూడా బాగానే వైరల్ అయ్యింది. ఇక ఆ క్రేజ్ వల్ల ఇప్పుడు బయట నుంచి ఈ జోడికి కొన్ని ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు కలిసి ఒక టీవీ ప్రోగ్రామ్ చేయబోతున్నారట. అంటే యాంకర్స్ జోడి అన్నమాట. ప్రస్తుతం అందుకు సంబంధించిన గాసిప్స్ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయు. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.