Just In
- 54 min ago
RRR యూనిట్‌కు భారీ షాకిచ్చిన నటి: కొత్త రిలీజ్ డేట్‌ను అలా లీక్ చేసింది.. డిలీట్ చేసే లోపే పట్టేశారుగా!
- 11 hrs ago
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్‌లో నలుగురు దర్శకులు!
- 11 hrs ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 12 hrs ago
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
Don't Miss!
- Finance
భారత్ V షేప్ రికవరీ, నాలుగింట ఒకవంతు తుడిచి పెట్టుకుపోయాయి: RBI
- News
ప్రొద్దుటూరులో ప్రేమోన్మాది దాడి... 3 నెలలుగా యువతికి టార్చర్... వాడిని వదలొద్దు సార్ అంటూ...
- Lifestyle
శనివారం దినఫలాలు : వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అదృష్టం కలిసి వస్తుంది...!
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సొంత ఇంటిపై మరోసారి క్లారిటీ ఇచ్చిన గంగవ్వ.. ఆ రేటుకే ఇంటి నిర్మాణం
బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా గంగవ్వ ఏ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మై విలేజ్ షో నుంచి బిగ్ బాస్ వరకు ఆమె ప్రయణంతో జనాలకు మరింత దగ్గరయ్యారు. ఇక ఆమె బిగ్ బాస్ ద్వారా గెలుచుకున్న డబ్బుతో ఆమె సొంత ఇంటి కలను నిజం చేసుకోబోతోంది. ఇక ఇటీవల తన యూ యూబ్ ఛానెల్ ద్వారా గంగవ్వ ఇంటి పనులపై అలాగే అయ్యే ఖర్చుపై మరో వివరణ ఇచ్చింది.

మంచి క్రేజ్ అందుకున్న గంగవ్వ
ఇక బిగ్ బాస్ షోలో ఆమె గెలుచుకున్న కొన్ని చేక్ లను ఉపయోగించుకొని ఇటీవల గంగవ్వ షాపింగ్స్ చేసింది. బిగ్ బాస్ ఫైనల్ లో కూడా ఆమె స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. బిగ్ బాస్ షోలో కొన్ని రోజుల వరకు బాగానే ఉన్నా గంగవ్వ సడన్ గా సొంత నిర్ణయంతో తప్పుకున్న విషయం తెలిసిందే. ఆమె షోలో ఉన్నన్ని రోజులు మంచి పోటీని ఇచ్చింది. మంచి గుర్తింపు కూడా అందుకుంది. ఓట్లు కూడా బాగానే పడ్డాయి.

బిగ్ బాస్ ఫైనల్ కు ముందే షాపింగ్
షోలో ఒకసారి గంగవ్వ ఫ్యాషన్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే అప్పుడు గెలిచిన చెక్కులు ఇటీవల అందడంతో బంగారం హైదరాబాద్ లోనే బిగ్ బాస్ ఫైనల్ కు ముందే షాపింగ్ చేసింది. అందుకు సంబంధించిన వీడియోను కూడా గంగవ్వ తన ఛానెల్ లో పోస్ట్ చేసింది. స్పెషల్ గా లక్ష రూపాయల బంగారంను కూడా కొనుగోలు చేసింది.

ఇంటిపై క్లారిటీ ఇచ్చిన గంగవ్వ
ఇక బిగ్ బాస్ నుంచి వచ్చేటప్పుడు గంగవ్వ ఇంటి కోసం నాగార్జునను రిక్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తప్పకుండా ఇల్లు కట్టిస్తామని హామీ కూడా ఇవ్వడంతో అప్పటి నుంచి ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఇక మొత్తానికి బిగ్ బాస్ ఆధ్వర్యంలో నాగార్జున కట్టిస్తున్న ఇల్లుపై కూడా గంగవ్వ ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది.

సొంత ఇంటి కోసం.. ఖర్చు ఎంతంటే?
ప్రస్తుతం ఇంటి పనులు వేగంగా జరుగుతున్నాయని అంటూ మరో రెండు మూడు నెలల్లో రెడీ అవుతుందని అన్నారు. ఇక 18లక్షల ఖర్చుతో ఇంటిని నిర్మిస్తున్నట్లు చెప్పిన గంగవ్వ పక్క ఊరికి చెందిన కాంట్రాక్టర్ కు ఇంటి నిర్మాణ బాద్యతలు అప్పగించినట్లు తెలిపింది. ఫైనల్ గా అనుకున్న రేటుకు వారు ఇంటి నిర్మాణం కోసం పనులు మొదలు పెట్టినట్లు చెబుతూ కుదిరితే ఇంటి నిర్మాణం అనంతరం ఒక కారు కూడా కొంటానని వివరణ ఇచ్చింది.