For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడే అభిజిత్.. బిగ్‌బాస్‌కే షాక్ ఇచ్చాడు

  |

  బిగ్ బాస్ హౌజ్ లో ప్రతి రోజు ఒకేలా ఉండదు. హౌజ్ లో ఎంత సన్నిహితులు అయినా కూడా ఏదో ఒకరోజు వెన్నుపోటు పొడిచే సమయం వస్తుంది. ఇక గొడవలకు, అపార్దాలకు అంతే ఉండదు. అయితే పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఒకే తరహాలో ఉండడం చాలా కష్టం. అలా ఉన్న వారు ఆడియెన్స్ మనసుకు బాగా దగ్గరవుతారు. ప్రస్తుతం అభిజిత్ అదే తరహాలో ఆడియెన్స్ కి మరింత దగ్గరవుతున్నాడు. అతని ఫాలోయింగ్ గట్టిగానే ఉంది. ఇక సోమవారం ఎపిసోడ్ లో అభిజిత్ తీసుకున్న నిర్ణయం అతని వాల్యుని మరింత పెంచింది.

  అభికి బ్యాడ్ ట్యాగ్ ఇవ్వాలని..

  అభికి బ్యాడ్ ట్యాగ్ ఇవ్వాలని..

  అభిజిత్ హౌజ్ లోకి అడుగు పెట్టినప్పటి నుంచి కూడా ప్రతి వారం నామినేషన్ లో ఉంటూ వస్తున్నాడు. లాస్య, హారిక, నోయల్ తప్పితే అతనికి పెద్దగా ఎవరు సపోర్ట్ చేయలేదు. తప్పు చేయకపోయినా కూడా కొన్నిసార్లు నిందలు భరించాడు. ముఖ్యంగా ముందు ఒకటి వెనుక మాట్లాడుతాడు అని శత్రువులు ఒక బ్యాడ్ ట్యాగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు కానీ వర్కౌట్ కాలేదు.

   పరువుపోయేలా గొడవలు

  పరువుపోయేలా గొడవలు

  ఏది ఏమైనా కూడా బిగ్ బాస్ ద్వారా అభిజిత్ తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ అందుకుంటున్నాడు. ఇక సోమవారం ఎపిసోడ్ లో అయితే కంటెస్టెంట్స్ తమని తాము ఎలిమినేషన్ లో సేవ్ చేసుకోవటానికి తంటాలు పడుతుంటే.. అవినాష్ మాత్రం చాలా స్థిరంగా ఉన్నాడు. అవినాష్, అఖిల్ అయితే స్వాపింగ్ కోసం పరువు పోయేలా అడుక్కున్నారు, వాదించారు. వాళ్ళు చేసిన హడావుడి వల్ల ఏమి ఉపయోగం లేకుండా పోయింది.

  బిగ్ బాస్ కు కౌంటర్ ఇచ్చిన అభిజిత్

  బిగ్ బాస్ కు కౌంటర్ ఇచ్చిన అభిజిత్

  ఇక అబిజిత్ మాత్రం ఎలిమినేషన్ లో తీసుకున్న నిర్ణయం అందరిని ఆశ్చర్యపరిచింది. నాకు స్వాప్ వద్దు అంటూ ఏకంగా బిగ్ బాస్ కు కౌంటర్ ఇచ్చాడు. అందుకు వివరణ ఇస్తూ మోనాల్ ను మదర్ సెంటిమెంట్ తో టచ్ చేశాడు. మన ఇద్దరి మధ్య ఎన్ని విబేధాలు వచ్చినా కూడా మీ అమ్మ నేను తన పేవరేట్ అని చెప్పడంతో చాలా కనెక్ట్ అయ్యాను. నాకు మదర్ సెంటిమెంట్ చాలా ఎక్కువ. అందుకే నిన్ను ఎలాంటి సహాయం అడగడం లేదని ఆన్సర్ ఇచ్చాడు అభిజిత్.

  Bigg Boss Telugu 4 : Abijeet Getting Support From Pawan Kalyan Fans
  ఎక్కడ తగ్గాలో తెలిసినోడు అభిజిత్

  ఎక్కడ తగ్గాలో తెలిసినోడు అభిజిత్

  మొత్తానికి కెప్టెన్ హారికకు పవర్స్ ద్వారా స్వాప్ అయిన అభిజిత్ ఒక విధంగా వివాదాలకు వెళ్లకుండా జనాలను మరోసారి ఎట్రాక్ట్ చేశాడు. నిజంగా ఎక్కడ నెగ్గలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు అభిజిత్ అనేలా పాజిటివ్ కామెంట్స్ అందుకుంటున్నాడు. ఇక ఈ వారం నామినేషన్స్ లో అవినాష్, అఖిల్, మోనాల్, అరియానా డేంజర్ జోన్ లోకి వచ్చేశారు. ఈ నలుగురు భవిష్యత్తుపై ఇప్పుడు అభిమానుల సపోర్ట్ కీలకం కానుంది. మరి వారి ఓట్లు ఎవరిని ఎలిమినెట్ అయ్యేలా చేస్తాయో చూడాలి.

  English summary
  Whether or not she received such a craze as an anchor, Ariana gave herself the title of Bold Girl. The hustle and bustle in this young girl's house, which was seen with the entry of Bigg Boss 4th season, is not normal. Trying to impress with the daily comedy task is not going to be a workout in the range as expected either.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X