మోనాల్ ఎఫెక్ట్.. నాకు పిచ్చి లేస్తోంది.. ఎవరైనా కొట్టాలని అనిపోస్తోంది: అఖిల్ ఓవరాక్షన్

బిగ్ బాస్ ఆల్ మోస్ట్ తుది దశకు చేరుకుంది. ఆదివారం నాగార్జున ఇచ్చిన ట్విస్టుతో మోనాల్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. డేంజర్ జోన్ లో ఉన్న ప్రతిసారి కన్నీళ్లు పెట్టుకునే ఆమె ఈ సారి మాత్రం గుండెను రాయి చేసుకుంది. నవ్వుతూనే హౌజ్ లో నుంచి బయటకు వెళ్లిపోయింది. ఇక సోమవారం నుంచి హౌజ్ లో అసలైన గేమ్ మొదలయినట్లు అర్ధమయ్యింది. ఇక మోనాల్ లేకపోవడంతో అఖిల్ చాలానే బాధపడుతున్నాడు.

 ఆఖరి పోరాటం..

ఆఖరి పోరాటం..

మొన్నటి వరకు సూపర్ సిక్స్ కంటెస్టెంట్స్ కాస్త ఇప్పుడు ఫైనాలలిస్ట్స్ లోకి వచ్చేశారు. అరియానా, అభిజిత్, అఖిల్, హారిక, సోహెల్.. అందరూ చాలా బలంగా గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి చూపు ఫైనల్స్ లోకి వెళ్లి టైటిల్ గెలవాలని ఆశపడుతున్నారు. ఇక ఈ వారాం ఆఖరి వరకు పోరాడితేనే గేమ్ లో విజయం సాధించినట్లు లెక్క.

కాస్త ఓవరాక్షన్ చేసేశాడు

కాస్త ఓవరాక్షన్ చేసేశాడు

హౌజ్ లో ఇక నామినేషన్ ఉండవని నాగార్జున, బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చేశారు. ఇక ఫిజికల్ టాస్క్ లు మైండ్ గేమ్స్ చాలా ఉంటాయి. పైగా ఆడియెన్స్ ను కూడా ఎట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక అఖిల్ చాలా రోజుల తరువాత కెమెరా ముందుకు వచ్చి తన పెర్ఫెమెన్స్ ను చూపించే ప్రయత్నం చేశాడు. మోనాల్ పై ప్రేమను కురిపిస్తూ కాస్త ఓవరాక్షన్ చేసినట్లుగా కామెంట్స్ అయితే వస్తున్నాయి.

నా గుండె చాలా భారంగా ఉంది

నా గుండె చాలా భారంగా ఉంది

ఇక గతంలో ఎప్పుడు లేనంత విరహంతో రగిలిపోయాడు అఖిల్. నాతో మాట్లాడు, నాతో మాట్లాడు అని చెప్పే టైప్ కాదు నేను. నా గుండె చాలా భారంగా ఉంది. ఎక్కువగా ఆలోచిస్తున్నాను కదా నేను. ఆలోచింవద్దని ఎంత ట్రై చేసినా నా వల్ల కావట్లేదు. అన్ని లోపల ఉంటే హార్ట్ బ్రేక్ అవుతుందనే బయంతో బయటకు మాట్లాడుతున్నాను. వద్దు వద్దు అని కంట్రోల్ చేసుకుంటున్నాను అంటూ అఖిల్ మాట్లాడాడు.

మోనాల్ ను మిస్ అవుతున్నావ్ కదా: హారిక

మోనాల్ ను మిస్ అవుతున్నావ్ కదా: హారిక

అనంతరం హారిక దగ్గరకు వెళ్లిన అఖిల్ ఈ విధంగా మాట్లాడాడు.. కొన్నిసార్లు ఏమనిపిస్తుందో తెలుసా? ఆ పర్సన్ మాట్లాడకపోయినా.. ఆ పర్సన్ పక్కనే ఉంటే బావుండని అనిపిస్తుందని అఖిల్ చెప్పడంతో నువ్ మోనాల్ ను బాగా మిస్ అవుతున్నావ్ కదా అంటూ చిల్ హ్యాపీ అంటూ సపోర్ట్ చేసే ప్రయత్నం చేసింది.

Recommended Video

Bigg Boss Telugu 4 : Rahul Sipligunj Slams Trollers
ఎవరినైనా కొట్టాలని అనిపిస్తోంది

ఎవరినైనా కొట్టాలని అనిపిస్తోంది

ఇక అఖిల్ ఈ సారి తన మాటలతో మరింత డోస్ పెంచాడు. నో నాకు పిచ్చిలేస్తుంది. ఎవరినైనా కొట్టాలని కూడా అనిపిస్తుంది. ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావడం లేదు. ఇలా ఎప్పుడు అనిపించలేదు. అసలేమి అర్థం కావడం లేదు. దినమ్మా.. అంటూ బాధను వ్యక్తం చేశాడు అఖిల్. హారిక కూడా అదే తరహాలో కొంటెగా ఎదో జరుగుతోంది అంటూ అంశర ఇచ్చింది. కానీ అఖిల్ మళ్ళీ తను నా ఫ్రెండ్ అంటూ ఎప్పటిలానే సోది చెప్పేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X