Just In
- 37 min ago
తెలుగులో ఆ హీరో అంటేనే ఇష్టమన్న రోజా: అలాంటి వాళ్ల వల్లే సినిమాలు చేయట్లేదంటూ!
- 1 hr ago
యంగ్ హీరో అమర్‌పై ఆరియానా ఆరోపణలు: ఏకంగా ఆమె ఇంటికెళ్లి రచ్చ.. నా ప్రాణం అంటూ అలా!
- 1 hr ago
ప్రముఖ నిర్మాతకు భారీ షాకిచ్చిన నమ్రత శిరోద్కర్: మీ భార్య మిస్టేక్ చేసిందంటూ మహేశ్ బాబుకు ట్వీట్
- 2 hrs ago
పోర్న్ స్టార్‌గా మారిన నోయల్ మాజీ భార్య: ఎస్తర్ నిర్ణయానికి షాకౌతోన్న సినీ ప్రియులు
Don't Miss!
- News
ఏపీ దెబ్బకు దిగొచ్చిన తమిళనాడు ... సంక్రాంతి సమయంలో బస్సుల వివాదం .. తెరపడిందిలా !!
- Automobiles
షూటింగ్ స్పాట్‌కి 12 కి.మీ సైకిల్‌పై వెళ్లిన రకుల్ ప్రీత్ సింగ్.. ఎందుకో మరి
- Sports
India vs Australia: భారీ షాక్.. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా!!
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బిగ్ బాస్ అలా చూపించడంతో తట్టుకోలేకపోయిన హారిక.. మై ఫైట్ ఈజ్ ఓవర్ అంటూ..
బిగ్ బాస్ ప్రయాణం మొత్తానికి తుది దశకు చేరుకుంటోంది. లాక్ డౌన్ లో ఎంతో జాగ్రత్తలతో రిస్క్ చేసి మరీ మొదలు పెట్టారు. అయితే ఇప్పుడు ఫైనల్ దశ వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకొచ్చారు. ఒక విదంగా నాగార్జున ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. ఇక గురువారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ కంటెస్టెంట్స్ హార్ట్ నీ టచ్ చేశాడు. హారిక కూడా ఎంతగానో ఎమోషనల్ అయ్యింది.

హౌజ్ పై కంటెస్టెంట్స్ ఎమోషనల్
బిగ్ బాస్ కు ఇదే ఫైనల్ వీక్ కావడంతో ఎమోషనల్ మూమెంట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. హౌజ్ పై ఒక ఎఫెక్షన్ పెట్టుకున్న కంటెస్టెంట్స్ కంటతడి పెట్టుకుంటున్నారు. మొన్న వచ్చిన సీనియర్ కంటెస్టెంట్స్ కూడా అదే చెప్పారు. హౌజ్ లో ప్రతి మూమెంట్ ని ఫీల్ అవ్వండి లేకుండా చాలా బాధగా ఉంటుందని అంటూ వివరణ ఇవ్వడంతో కంటెస్టెంట్స్ అదే తరహాలో ఫీల్ అవుతున్నారు.

ఒక సూర్యకాంతిలా ఛేదించుకుంటూ..
ఇక బిగ్ బాస్ కూడా కంటెస్టెంట్స్ ఇన్ని రోజులు గడిపిన ప్రయాణాన్ని ఎమోషనల్ గా ప్రజెంట్ చేస్తున్నాడు. హారిక వంతు రావడంతో ఆమె ప్రతిభకు బిగ్ బాస్ ఫిదా అవుతున్నట్లు వీడియో రిలీజ్ చేశాడు. ఎన్నో మేఘాలు కప్పడానికి ప్రయత్నించినప్పటికీ మీరు ఒక సూర్యకాంతిలా ఛేదించుకుంటూ ఫైనల్ వరకు వచ్చారు. చిన్న ప్యాకెట్ పెద్ద ధమాకా అనే వ్యాఖ్యాన్ని నిజమయ్యేలా చేశారు. మొత్తానికి ఫైనలిస్ట్‌గా నిలిచారని వివరణ ఇచ్చారు బిగ్ బాస్.

కన్నీరు పెట్టుకున్న హారిక
అనంతరం బిగ్ బాస్ హౌస్‌లో దేత్తడి హారిక చేసిన హంగామాతో పాటు టాస్కులతో ఆమె చూపించిన తెగువ, కొట్లాట ఇలా అన్ని విజువల్స్ చూసేసరికి కన్నీరు పెట్టుకుంది హారిక. మాటలు రావడం లేదు బిగ్ బాస్ ఎలా చెప్పాలో కూడా నాకు తెలియడం లేదని ఎంతగానో ఎమోషనల్ అయ్యింది హారిక.

మై ఫైట్ ఈజ్ ఓవర్
అసలు ఈ 14 వారాలు ఎలా గడిచాయో అర్థం కావడం లేదు. హౌజ్ లో గడిచిన ప్రతిరోజు ఎదో ఒకటి నేర్చుకున్నా.. నా జీవితానికి అవి చాలా ఉపయోగపడతాయి. రేపటి రోజున నేను ఉన్నా లేకపోయినా అలేఖ్య హారిక లైఫ్ హిస్టరీ తీస్తే బిగ్ బాస్ అనేది మేజర్ రోల్ నిజంగా ఉంటుంది. ఇది మాత్రం పక్కా నిజం బిగ్ బాస్. గర్వంగా ఉంది. కానీ మై ఫైట్ ఈజ్ ఓవర్ అనిపిస్తోంది ఈ వీడియో చూశాక అంటూ ఎమోషనల్ అయ్యింది హారిక.