నువ్ సోహెల్‌కి సపోర్ట్ చేస్తావని నాకు తెలుసు.. అరియానాకు అఖిల్ స్వీట్ కౌంటర్

బిగ్ బాస్ హౌజ్ లో గొడవల డోస్ నెవర్ బిఫోర్ అనేలా కొనసాగుతున్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా కోపాలు హద్దులు దాటుతున్నాయి. ఇది పోరాటం అనుకోవాలా లేక ఓవరాక్షన్ అనుకోవాలా అనే విషయం ఎవరికి అర్థం కావడం లేదు. అరియానా, సోహెల్ అయితే టాప్ లేచిపోయేలా అరుచుకున్నారు. గతంలో అమ్మా రాజశేఖర్ ని మైమరిపించి సిగ్గు లేదా అనేంతగా తిట్టుకున్నారు. ఇక అఖిల్ అతి ముఖ్యమైన సమయంలో తన స్నేహితుడికి మద్దతు ఇచ్చాడు.

అదుపులో పెట్టుకో అనగానే..

అదుపులో పెట్టుకో అనగానే..

సోహెల్ కు ఈ మధ్య కాలంలో గొడవలు చాలానే అవుతున్నాయి. షో మొదలైన కొత్తలో అతని కోపాన్ని చూసి తట్టుకోలేకపోయిన నాగార్జున కూడా వార్నింగ్ ఇచ్చాడు. అదుపులో పెట్టుకో అనగానే ఆ మధ్యలో మొత్తం కూల్ అయ్యాడు. లోలోపల బాధ పడ్డాడు గాని కోపాన్ని బయటకు తియ్యలేదు. ఎవరు ఎంత తిట్టినా, రేచ్చగొట్టినా కూడా కంట్రోల్ తప్పలేదు.

హద్దులు దాటేసిన సోహెల్

హద్దులు దాటేసిన సోహెల్

అయితే అతనికి కోపం ఉండాలి అంటూ ఎలిమినేషన్ సమయంలో అమ్మా రాజశేఖర్ వివరణ ఇవ్వగా నాగార్జున కూడా మద్దతు ఇచ్చాడు. అవసరమైన సమయంలో ఆటలో భాగంగా కోపాన్ని చూపించడంలో తప్పులేదు. ఎదుటి వ్యక్తి రియాక్షన్ బట్టి మన ఆవేశం కూడా ఉండలని చెప్పడంతో అప్పటి నుంచి సోహెల్ కోపాన్ని తగ్గిస్తూ.. పెంచుతూ.. వస్తున్నాడు. అయితే ఇటీవల అరియానాపై మాత్రం ఒక్కసారిగా తన హద్దులు దాటేసి మరి రెచ్చిపోయినట్లు అనిపించింది.

ఒక అబ్బాయితో..ఇదే మొదటిసారి

ఒక అబ్బాయితో..ఇదే మొదటిసారి

ఇక మొన్నటివరకు సాహెల్, అఖిల్ తో కూడా గొడవ పడ్డాడు. అయితే అరియానాతో గొడవ తీవ్రత పెరగడంతో సోహెల్ కు సపోర్ట్ చేశాడు అఖిల్. మెల్లగా వారిద్దరి మధ్య వాతావరణాన్ని కూల్ చేసేందుకు ప్రయత్నం చేశాడు. ఒక అబ్బాయి నాతో ఇలా ప్రవర్తించడం ఇదే మొదటిసారి అంటూ గొడవ అనంతరం బోరున విలపించింది అరియానా ఆ సమయంలో అభిజిత్ తో పాటు అఖిల్ కూడా ఆమెను ఓదార్చాడు. అంతే కాకుండా నీది కూడా తప్పుందని వివరణ ఇచ్చాడు అఖిల్.

Recommended Video

Bigg Boss Telugu 4 : Rahul Sipligunj Slams Trollers
సోహెల్ కు సపోర్ట్ చేస్తావని కూడా నాకు తెలుసు

సోహెల్ కు సపోర్ట్ చేస్తావని కూడా నాకు తెలుసు

నువ్ కూడా అతని మీదకు వెళ్ళావ్. మొత్తం వాడిదే తప్పు అని మాట్లాడకు అంటూ అఖిల్ కూల్ గా అరియానాకు సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. అంతే కాకుండా నువ్ సోహెల్ కు సపోర్ట్ చేస్తావని కూడా నాకు తెలుసని వారి గత స్నేహన్ని గుర్తు చేశాడు. అయినప్పటికీ అరియానా తగ్గలేదు. నా స్పెస్ నాకు వదిలేయండి అంటూ పాత గొడవలను కూడా తవ్వి బయటకు తీసింది. ఎక్కువగా కన్నీళ్లతో కనిపించి మోనాల్ రికార్డును బ్రేక్ చేసే ప్రయత్నం చేసింది అరియానా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X