Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఎవడికి పడితే వాడికి పడిపోవద్దు.. అరియానా దూకుడుకు అవినాష్ కౌంటర్
బిగ్ బాస్ 104రోజుల ప్రయాణం చాలా డిఫరెంట్ గా కొనసాగిందనే చెప్పాలి. సెలబ్రెటీల విషయంలో నిర్వాహకులు ఏ విధంగా ఆలోచించారో గాని మొత్తానికి ఎదో ఒక విధంగా కొంతవరకు ఆడియెన్స్ సపోర్ట్ ను గెలుచుకున్నారు. అయితే చివరి దశలో మాత్రం పెద్దగా ఆశ్చర్యపరిచే ఘటనలు ఏమి చోటు చేసుకోవడం లేదు. హౌజ్ లో నుంచి వెళ్లిపోయిన కంటెస్టెంట్స్ ను హౌజ్ లోకి పంపుతూ ఎదో ఫన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

అంతగా అకట్టుకోవడం లేదు..
ఇక కంటెస్టెంట్స్ అందరు కూడా ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయిన వారిని మరోసారి చూసి భావోద్వేగానికి గురవుతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా సరికొత్తగా ప్లాన్ చేసిన ఈ ఎపిసోడ్స్ బాగానే ఉన్నప్పటకి మాస్ మసాలా ఆడియెన్స్ ను అయితే అంతగా ఎట్రాక్ట్ చేయడం లేదు. శనివారం ఎపిసోడ్ లో ఎక్కువగా అవినాష్ ఎంట్రీ కొంతవరకు మంచి ఫన్ క్రియేట్ చేసింది.

అతను వెళ్లిపోయిన తరువాత
అవినాష్ రెండు వారాల క్రితం హౌజ్ నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. మోనాల్ తో చివరి వరకు ఎలిమినేషన్ లో పోరాడిన అవినాష్ ఉహీంచని విధంగా ఎలిమినేట్ అవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ విషయంలో చాలా నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. అవినాష్ వెళ్లిపోయిన తరువాత హౌజ్ లో ఎంటర్టైన్మెంట్ పార్ట్ మిస్సయ్యిందనే కామెంట్స్ కూడా వచ్చాయి.

అఖిల్.. పులిహోర రాజా
ఇక శనివారం అందరిని కలుసుకున్న అవినాష్ ఒక అటాడుకున్నాడు. ముఖ్యంగా అఖిల్ ను అయితే పులిహోర రాజా అంటూ కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చాడు. అభిజిత్ కు కూడా అమ్మాయిలా ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగా పేరిగినట్లు చెప్పేశాడు. ఇక అరియానా గురించి అయితే కొంత ఎమోషనల్ గా మాట్లాడుతూనే సరదాగా జోక్స్ వేశాడు.

నువ్వు వెళ్లిపోయిన తరువాత తెలిసింది
అవినాష్ వెళ్లిపోయే సమయంలో ఫైనల్ ఎపిసోడ్ లో అంతా అయిపోయిన తరువాత బయట ఉండు వెయిట్ చేయి నా కోసం అంటూ అరియానా వివరణ ఇచ్చింది. ఇక నువ్వు వెళ్లిపోయిన తరువాతే ఆ ఫీలింగ్ ఏమిటో తెలిసిందని అంటూ చాలా మిస్ అవుతున్నానని కూడా ఏడ్చేసింది.

ఎవడికి పడితే వాడికి పడకు
ఇక ఇటీవల అఖిల్ అరియానాతో కొంత క్లోజ్ గా ఉండడంపై కూడా వివరణ ఇచ్చాడు అవినాష్. ఎవడికి పడితే వాడికి పడకు అంటూ సరదాగా కామెంట్ చేసిన అవినాష్ ఈ సమయంలోనే మరింత స్ట్రాంగ్ గా ఉండాలని వివరణ ఇచ్చాడు. ఇక హారిక, సోహెల్ కూడా గేమ్ అద్భుతంగా ఆడారని మీకు కూడా అభిమానుల సంఖ్య గట్టిగానే పెరుగుతొందని తెలియజేశాడు అవినాష్.