For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  షాకింగ్ : గంగవ్వను కావాలనే పంపించేశారట.. అసలు కారణమిదే!!

  |

  బిగ్‌బాస్ తెలుగు నాల్గో సీజన్‌కు గంగవ్వ ప్రత్యేకమైన కంటెస్టెంట్ అని అందరికీ తెలిసిందే. ఇంటా బయటా ఆ విషయం అందరికీ తెలిసిందే. మొదటి రోజే ఆ విషయాన్ని మిగతా కంటెస్టెంట్లకు చెప్పేశారు కూడా. గంగవ్వను జాగ్రత్తగా చూసుకోవాలని ఇంటి సభ్యులందరికీ నాగార్జున సూచించాడు. ఇక ఒక్కొక్కరు పోటీ పడి మరీ గంగవ్వ చుట్టూ చేరారు. బెల్లం చుట్టూ ఈగల్లా బాగానే వచ్చారు. అందులో కొందరు నిజమైన ప్రేమతో ఉంటే ఇంకొందరు మాత్రం ఓట్లు, సింపతి, ఫాలోయింగ్ అంటూ ఇలా లెక్కలు వేసుకొచ్చిన వారుకొందరు. మొత్తానికి గంగవ్వను ఐదో వారంలో బయటకు పంపించేశారు. దానికి కారణాలు చాలా ఉన్నాయంటూ బయటకు వినిపిస్తున్నాయి.

  Bigg Boss Telugu 4 : ప్లాన్ ప్రకారమే Gangavva ను హౌస్ నుంచి పంపేసిన Bigg Boss !
  మొదట్లో అలా..

  మొదట్లో అలా..

  వచ్చిన మొదటి, రెండు వారాల్లో గంగవ్వ ఆరోగ్యం కాస్త దెబ్బతింది. వాతావరణం పడటం లేదు. ఉండలేకపోతోన్నా. నన్ను పంపించేయండి బాంచన్ అంటూ తన గోడునంతా వెల్లిబుచ్చుకుంది. అయితే ఆ సమయంలో మాత్రం బిగ్ బాస్.. గంగవ్వకు ధైర్యం చెప్పి ఉండమని సలహా ఇచ్చాడు. వైద్యం అందించి మళ్లీ గంగవ్వను మామూలు స్థితికి తీసుకొచ్చారు. దాంతో గంగవ్వ కూడా మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో కనిపించింది.

  ఐదో వారంలో ఇలా..

  ఐదో వారంలో ఇలా..

  ఐదో వారంలో గంగవ్వ అనారోగ్యానికి గురైందని కొన్ని వీడియోలు చూపించాడు. డాక్టర్ల రిపోర్టలంటూ నాగార్జున చేతిలో పట్టుకుని బిల్డప్ ఇచ్చాడు. అయితే ఆ వారంలో మాత్రం గంగవ్వ తనకు తినాలని అనిపించడం లేదు, నిద్ర కూడ రావడం లేదు.. కళ్లు లోపలికి పోతున్నయ్ అంటూ తన బాధను చెప్పుకొచ్చింది. అయితే ఈ సారి మాత్రం గంగవ్వను బిగ్ బాస్ ఆపలేకపోయాడు. సరే అని గేట్లు ఓపెన్ చేసి పంపించాడు.

  అందుకే అప్పుడు..

  అందుకే అప్పుడు..

  బిగ్ బాస్ నాల్గో సీజన్ ఎంత పేలవంగా మొదలైందో అందరికీ తెలిసిందే. ఒక్కరంటే ఒక్క కంటెస్టెంట్‌కు కూడా స్టార్ స్టేటస్ లేదు. కొంత మందిని గూగుల్‌లో వెతికినా కూడా దొరకరు. అలాంటి మహానుభావుళ్లను పట్టుకొచ్చారు. అయితే ఉన్న ఏకైక స్టార్ గంగవ్వ. గంగవ్వ అంటే తెలియని వారెవ్వరూ ఉండరు. అందుకే మొదటి వారంలో దాదాపు ప్రోమోలన్నీ గంగవ్వ మీదనే, ఆమె వేసే సెటైర్ల మీదనే ఉంటాయి. అలా మొదటి రెండు వారాలు గంగవ్వ పేరు చెప్పి లాక్కొచ్చారు. అలాంటి సమయంలో గంగవ్వ వెళ్తే షో మునిగిపోతుందని వారికి కూడా తెలుసు. అందుకే గంగవ్వను ఉంచారట.

  గందరగోళంగా మారింది..

  గందరగోళంగా మారింది..

  అయితే గంగవ్వ వల్ల రాను రాను ఆట దెబ్బతింటూ వస్తోంది. ఒక్కోసారి గంగవ్వ ఏం చేస్తుందో ఆమెకే తెలియకుండా ప్రవర్తిస్తోంది. గంగవ్వ వల్ల కంటెస్టెంట్లందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఏదైనా ఉంటే ఆమె మీద వేసేస్తున్నారు. ఆమెను కెప్టెన్ చేయడమైనా సరే, ఫ్యాషన్ షోలో విజేతగా ప్రకటించడంలోనైనా సరే అంతా సేఫ్ గేమ్‌లోనే వెళ్లారు. ఇలా ఆట అంతా దెబ్బతింది. పైగా గంగవ్వ ఫిజికల్ టాస్కులు ఆడలేదు.

  అందుకే పంపించేశారు..

  అందుకే పంపించేశారు..


  ప్రస్తుతం షో కాస్త పికప్ అయింది. ఓ ట్రయాంగిల్ ట్రాక్, హారిక హాట్ షో, అరియానా అవినాష్ పుటేజ్‌లు సోహెల్ మెహబూబ్‌ల వల్ల అయ్యే గొడవలతో షో హైవే ఎక్కేసింది. ఇలాంటి సమయంలోనూ గంగవ్వ ఉంటే ఇంకా సేఫ్ గేమ్ అంటూనే ఊగుతారని ఆమెను పంపించేశారని టాక్ నడుస్తోంది. స్టేజ్ మీద ఆమె చేసిన సందడి చూస్తే ఆమె ఆరోగ్యానికి ఏ ఢోకా లేదని కనిపిస్తూనే ఉంది.

  అప్పుడేమో..

  అప్పుడేమో..

  మామూలుగా ఆరోగ్యం బాగా లేకపోతే గతంలో నూతన్ నాయుడి భుజం విరిగినప్పుడు చేసినట్టుగా అటునుంచి అటే పంపించేయాలి. ఇలా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లకు చేసినట్టుగా స్టేజ్ మీదకు తీసుకొచ్చి అభిప్రాయాలు చెప్పించడం ఏంటని కొందరు అంటున్నారు. మళ్లీ గంగవ్వను రీ ఎంట్రీలో తీసుకునే ప్రసక్తే లేదని తెలుస్తోంది. ఏది ఏమైనా అది బిగ్ బాస్ షో. అంతా బిగ్ బాస్‌కు నచ్చినట్టుగానే చేస్తాడు.

  English summary
  Bigg Boss 4 Telugu Bigg Boss 4 Telugu week 6 Akhil Kisses harika, Bigg Boss 4 Telugu Housemates Become Emotional On Gangavva illness, Bigg Boss 4 Telugu Gangavva Is Out Of Game Due To illness, She may come back when she is totally fine !, Avinash Performing as Bigg Boss, Bigg Boss 4 Telugu Will Abijeeth Become Fool In Hotel Task, Bigg Boss 4 Telugu Harika Gets Jealous For Swathi Deekshith Playing Game With ABhijeet, Bigg Boss 4 Telugu Trolls On Mehaboob Missing Special Coin, Bigg Boss 4 Telugu Swathi deekshith With Akhil And Abhijeet, Bigg Boss 4 Telugu Sohel Fires On Abhijeet About Physical Task, Sohel satires On Abhijeet And Humiliates for Not Involving In Physical Task.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X